అవినీతి ఎక్కడ పుడుతుంది?

పుట్టిన ప్రతి పసి పాప నిజాయతీగానే ఉంటుంది….
అదే పాప పేద్దయ్యేటప్పటికి అవినీతిని ఎలా ఎక్కించుకుంటుంది….

కాసేపు నిజాలు మాట్లాడుకుందాం

1. అటెండెన్స్ ఉంటే చాలు , చదవకపోయినా పర్లేదు

2. నువ్వు ఏం చేసినా పర్లేదు , మార్కులు వస్తే చాలు

3. నీకు 100 మర్కులు వస్తే మేధావివి , నువ్వు ఎంత చదివావు, ఎంత లోతుగా ఆలోచిస్తున్నావు అనేది ఎవరూ అడగరు

4. ఐ.ఐ.టి.., చదివితేనే మా పరువు దక్కుతుంది.. లేక పోతే , పక్కన వాళ్ళు ఎగతాలి చేస్తారు

5. అనవసరమైన ప్రయోగాలు ఎందుకు , క్లాస్ లో సార్ చెప్పింది చెయ్….

6. రోజూ చదవడం అవసరమా,,,, లాస్ట్ కొన్ని రోజులు చదివితే చాలు,, నైట్ అవుట్ ఐతే ఇంకా బెటర్…

7. వీడు కాలేజి టాపర్, వీడిని ఏం అనద్దు

8. అడ్డమైన ప్రశ్నలు అవసరం అంటావా, నా క్లాస్ సిలబస్ అవ్వదు, మూస్కుని ఆన్సర్ రాసుకో

9. తెలుగు మాట్లాడితే ఫైన్…..

ఇవన్ని దేనికి సంకేతం , అవినీతికి విత్తనాలు కాదా…..
పిల్లల్ని దగ్గరుండి మరీ….
ఎస్కేపిస్టులుగా ,
ప్రయోగాలు ఇష్టం లేని వాళ్ళుగా
మానసిక బద్దకస్తులుగా
మార్చడం లెదా….

23 ఏళ్ళు రాగానే అంతా అవినీతి పరులు ఐపోతారా…
డబ్బు చూడంగానే మనుషులు దిగజారుతారా…
20 సంవత్సరాల పాటు మా నెత్తి మీద
బెల్టు షాపులు, షార్ట్ కట్లు,ట్వింకిల్ twinkle twinkle little star lu రుద్దలేదా….

మీ తప్పులు ఏం లేకుండానే పిల్లలు చెడిపోతారా…..

గింజలోనే క్యాన్సర్ వైరస్ పంపి….
చెట్టయాక ఏడుస్తారెందుకు…..

పెద్దమనుషులూ …. మేధావులూ
సమాధానం చెప్పండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s