ఒక కలం హత్య


అనగనగా ఒక పిచ్చోడు…

ఒక యువ రచయిత
కాస్త కొత్తగా రాయాలని అనుకున్నాడు

అతనో పిచ్చ పుస్తకం రాసాడు.

ఆ పుస్తకం బాగుందని చాలా మంది అన్నారు
ముఖ్యం గా యువత ఆ పుస్తకాన్ని కొన్న ఎవ్వరూ “మా దగ్గరలేదు ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయారు” అని చెప్పేంతగా నచ్చింది

ఆ పిచ్చాడికి ఒక పాడు బుద్ధి పుట్టింది
నేనే ఎందుకు పబ్లిష్ చెయ్యకూడదు అని

ఇక పుస్తకం కాస్త తిరగ రాసి
స్పాన్సర్ల కోసం తిరగడం మొదలుపెట్టాడు

FIRST LOCK
——

అలా తిరుగుతున్న అతనికి స్పాన్సర్లనుంచి వింత అనుభవాలు ఎదురయ్యాయి
” బొచ్చు దీనిలో సాహిత్య విలువ ఏముంది …” అని అంటే బాగోదని
” తెలుగులో ఉండాలయ్యా.. ఇన్ని ఇంగ్లీషు పదాలెందుకు”

” నాలుగు వేల కాపీలా , వెరీ గుడ్ నన్న” అని ఒక శవం చూసిన ఓదార్పు

” బొంగులోది, ఎవ్వడు కొంటున్నారమ్మా ఇవాళ పుస్తకాలు ”

” ఈ వయసులో రాసావంటే గ్రేట్, కానీ పుస్తకానికి స్పాన్సర్ చేస్తే మాకేమొస్తుందమ్మా ”

ఇలా బాగా ఎంకరేజ్ చేసారు..

INTERVAL

మీరెన్నైనా చెప్పండి
నేనీ పుస్తకాన్ని రాస్తా
ప్రజల ముందుకు తీసుకెళ్తా అని శపథం చేస్తాడు పిచ్చోడు

ఇంటర్వెల్ తరువాత

ఇస్తామన్న స్పాన్సర్లు
నెల రోజుల తరువాత చెప్పారు
గుడ్ న్యూస్ నీకో పది వేలు స్పాన్సర్ చేస్తున్నాం అని
ఆ తరువాత ఇంకా అవి పడలేదు అనుకోండి వేరే విషయం

పది వేలా … మాటలే
పది వేలతో నువ్వో పుస్తకాల షాపు పెట్టుకోవచా

నువ్వేమన్నా యండమూరా పుస్తకాలు ఎగబడి స్పాన్సర్ చెయ్యడానికి
పోనీ ఏ పేపర్ లో ఏసార్రా నీ పేరు

యదవ ల— పోజులు కాకపోతే
ఎక్కడ రా నువ్వు నాలుగు వేల కాపీలు అమ్మావని
అయితే ఏంటి గొప్ప
రాం గోపాల్ వర్మ వోడ్కా అనే పుస్తకం భగవద్గీతలా కొన్నారు 10 లక్షల కాపీలు
నీదేంటి గొప్ప పది వేల చాలా ఎక్కువ అని అందరూ గీతోపదేశం చేసి ఆ పిచ్చోడ్ని మామూలు చెయ్యడానికి ట్రై చేసాడు

PRE CLIMAX

ఎక్కడో ఒక సభ జరుగుతోంది

“కొత్త తరం తెలుగు పై ఆసక్తి చూపించాలి . కొత్త కధలు లేవు. ఎంత సేపు తొక్క లవ్ స్టోరీలు తప్ప.” అని ఒక గొప్పాయన , లెజెండ్ ఉపన్యసిస్తున్నారు.

” ఆగ రా రై. ఆగు సాలె… కొత్త తరం రాలేదా…. కొత్త తరానికి తెలుగు నచ్చదా… నీ ఎర్రి …. . మీకు తెలుసా ఒక పుస్తకం, ఒక పెయింటింగ్ వెలుగులోకి రావడానికి ఎన్ని … కు..లో . మీకు తెలుసా మీడియాలో నకిలీ ఆర్టిస్టులు , ఎంత మంది చేరి మాకు స్పేస్ లేకుండా చేస్తున్నారో. మీకు తెలుసా ఫ్యాషెన్ పెరేడ్ కి ఇచ్చే స్పాన్సర్ షిప్ మా పుస్తకాలకు ఇచ్చే స్పాన్సర్ షిప్ ఎంత తేడా ఉంటదో. కొన్ని పుస్తకాల షాపులు కవితల పుస్తకాలు తీసుకోమని ఓపెన్ గా చెప్తున్నాయ్. ఒక జెనరేషన్ మొత్తం నిర్వీర్యం చేసి. తెలుసు సచ్చిపోతుంది , కాపాడండి అని యన్.ఆర్. ఐ. ల దగ్గర అడుక్కుతినే మీరా మా తరం గురించి మాట్లాడేది .. అని అన్నాడు.

CLIMAX

ఇది యువ ఆలోచనల శ్మశానం
ఇక్కడ భాష , అభిమానం
ప్రేమ , కొత్తదనం, ఆప్యాయతల , సంస్కృతి
అని ఎవరైనా మాట్లడితే గుడ్డలూడదీసి కొడతా అన్నాడు

వెంటనే అతన్ని పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళారు.

అన్నట్టు అతను ( అందరూ కాదు కాని ) ఇంకా చాలా బాకీలు కట్టాలి…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s