స్వప్నిక


ఉన్నట్టుంది బాగ గుర్తుకొస్తోంది. మీకు కూడా పేరు వినంగానే బాగా గుర్తుకువస్తోంది కదా.
నాకు వారానికి ఒక రోజ్జైనా గుర్తుకువస్తోంది ఈ చెల్లెలు….
అందుకే ఈ వారం మీతో ఈ బాధని పంచుకుందామని ఇలా పోస్ట్ చేస్తున్నా…

యాసిడ్ దాడి జరిగినప్పుడే మనకు మానవత్వం గుర్తుకువస్తోంది ఏంటి…
ఎవడో పిచ్చి పట్టి పోసారు …
మీడియా గోల చెసారు……
డిస్కషన్ జరిగింది…..
ఈలోపల పోలీసులు ఎంకౌంటర్ చీసేసారు ……
లోపల స్వప్నిక నొప్పితో ఏడుస్తుంటే…..
జనాలు ఎంకౌంటర్ చేసినందుకు..టపాసులు పేల్చి…స్వీట్లు పంచుకున్నారు..
అదేం ఆనందం ఓ…..
వెంటనే యూథ్ ని తిడుతూ…. నాటకాలు… సినిమాలు…. స్పీచ్లు….

తర్వాత కాలం లో రెండు సంఘటనలు జరిగాయి….
1. చిత్తూరు లో ఒక ఆటో డ్రైవర్ తనను ఒప్పుకోలేదని… ఒక అమ్మయిని … కిరస్నాయిల్ పోసి చంపాడు…
2. వరంగల్ జిల్లాలో ఒక అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుందని… కుక్కని కొట్టినట్టు కొట్టి (ఆడవాల్లే)…. చంపేసారు… ఆ వీడియో తలుచుకుంటే ఇప్పటికీ నిద్ర రావటం లేదు….(in TV9)

ఐతే ఈ రెండు సంఘటనల టైం లో…. రాష్ట్రంలో వేరే నాయకుల టాపిక్స్ ప్రధమం గా ఉన్నాయి..
ఈ వార్తలు దిస్ట్రిక్ ఎడిషన్లో లేకపోతే… ఐదవ పేజీలో కనిపిస్తాయి…
మళ్ళీ ఏ న్యూస్ లేదనుకో ….. హెడ్-లైన్స్ లో మహిళపై దాడి అని వేస్తారు..

మళ్ళీ…పోసే…అరిచే… కాల్చే….
అంతేనా… మహిళా సమస్యలు అంతటి తోనే సాల్వ్ అవుతాయా….

మనం సెక్స్-ఎడ్యుకేషన్ ఇస్తున్నాం…..
కాని…సెక్షువల్ రుగ్మతలు…. ప్రేమతో వచ్చే రుగ్మతలు గురించి మాట్లాడుతామా…
అసలు మన సోసైటీలో సైకాలజిస్ట్ల సంఖ్య లేక నిష్పత్తి ఎంత…
ఎలా ప్రెమించాలో ….ఎలా వసీకరణం చెస్కోవాలో చిత్రాలతో సహా వివరించే పుస్తకాలు ఉన్నాయి….
కాని…. ప్రేమలో విఫలం ఐతే… వచ్చే బాధలు…రుగ్మతలు… ఎలా సరిదిద్దు కోవాలి…అని చెప్పే పుస్తకాలు ఏమున్నాయి.
ఒక ప్రోగ్రాం రాదు… ఒక కథ రాదు…. ఒక సినిమా రాదు…. ఒక నాటకం రాదు…
ఎంతసేపు పొగిడ్తే యూథ్ ని పొగడటం…లేకపోతే 1231231 ట్టడం..
అంతే తప్ప …. ఒరే ఎదవా… ఇది చిన్న విషయం రా….. అమ్మ్మయి… వదిలేస్తే ఎవడికైనా…. నరకమే… బాధే వస్తుంది….. సాంబార్ రాదు… అని చెప్పేవాదెవ్వడు….
ఇంకా లోతుగా… విష్లేషించి ….. సెట్ చెస్తున్న వాళ్ళు ఎవరు…
ప్రింట్-మీడియా కొంత వరకు క్రుషి చేస్తోంది… అయితే అది సరిపోతుందా.. చాలా…?

ఖచితంగా ఈ మగాళ్ళలో/ఆడవాళ్ళలో పెరుగుతున్న రుగ్మతలపై చర్చ రావాలి….
సైకాలజిస్ట్ ల సంఖ్య పెరగాలి…
చనిపోతూ స్వప్నిక ఒక మాట అడిగింది…మన అందరినీ “నా పరిస్తితి వేరే అమ్మయికి రాకుడదు?” అని…. నాకు గుర్తొచినప్పుడు ఎక్కడో ద్రుఖం తన్నుకు వస్తోంది… నేను అప్పుడప్పుడు మనిషి కదా…..

ఒకడు హత్య చేస్తే వాడి రూంలో వీర్ బాటిళ్ళు వెతకదం కాదు…
వాడి మైండ్లో…. దయ్యాన్ని లాగండి….వాడితోపాటు చాల మందిలో ఉన్న దయ్యన్ని చంపండి…
నేను చెప్పినవే చెయ్యమని చెప్పటం లేదు…..
కాని ఆలోచించండి….
యాసిడ్ దాడి జరిగినప్పుడు కాదు…
ఇప్పుడు… ఇవాళ రేపు…
ప్రపంచం లో ఖరీదు లేని పని ఒకటి ఉంది…..
కబుర్లు చెప్పడం…

కనిసం మీరైతే ఎలా ఆపుతారు…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s