2050 Part 1

ఆగస్టు  10, 2050 , ప్రపంచ తెలుగు మహా సభలు
ఇండియాలోని అమరావతి నగరం. నాగరికత ఉత్తమ దశకు చేరుకున్న ప్రపంచ నగరాల్లో ఒకటి. భూ గ్రహం మీద మిగిలిన 79 దేశాల్లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న నగరం. ప్రజల ఇళ్ళు, కంపెనీల ఆఫీసులు అన్నీ ఆకాశ హర్మ్యాల్లోనే(sky scrappers) ఉండాలని UNO తీర్మానించడం వల్ల  మొత్తం వాటిలోనే నివసిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలన్నీఅన్-లైన్ లోనే. ఇళ్లకు , ఆఫీసులకు   స్థలాలు వెతుక్కోవాల్సిన అవసరం లేకపోవడంతో చుట్టూ వందల కిలో మీటర్ల కొద్దీ విస్తరిస్తున్నాయి అడవులు . ఆకాశ వీధుల్లోకి తీసుకెళ్లే స్పేస్ లిఫ్టులు. ప్రతి పెద్ద భవనంలో ఒకప్పటి హైదరాబాద్ అంత జనాభా ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక హోం థియేటర్. ప్రతి ఒక్కరూ చేతిపైనే అన్నీచూసుకుంటూ అన్నీ పనులు ప్రాసెస్ చేసుకునే విర్చువల్ సెల్ ఫోన్ స్కిన్.(చేతిపై అమర్చే స్కిన్ గ్లోవ్స్ లాంటిది) తో పనులు కానిస్తున్నారు.

 

990 నుండి 2020 దాకా ఒక ప్రపంచాన్ని శాసించిన ఇన్ఫర్మేషన్ యుగం అంతరించిపోయి, నానో మెషిన్ యుగం మొదలయ్యింది.   కూలి వాళ్ళ  అవసరం అసలు లేదు . 2040 నాటికే పేదరికం అంతరించిపోవడం తో భూతద్దంతో చుసినా పేదవాడనే వాడు కనిపించదు. అసలు విషయం ఏంటంటే , 2030 వచ్చిన మహమ్మారి రోగం డిమోని దెబ్బకి దాదాపుగా సగం ప్రపంచ జనాభా మాయం అయిపోయింది. మందులకు అవసరమైన డబ్బులు ఖర్చు పెట్టలేని మధ్యతరగతి దిగువ తరగతి వారు మొత్తం పూర్తిగా నశించిపోయారు . ఒకప్పటి రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దు. అన్ని ప్రయాణాలు ఇంస్టా ట్రాన్స్ ద్వారానే. ఎన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం అయినా క్షణాల్లోనే.

ప్రస్తుతం అమరావతి నగరంలో జరుగుతున్న 14వ  ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవ్వడానికి తనకిష్టమైన నానో సూట్ వేసుకుని బయలుదేరాడు 53 ఏళ్ల  జగదీష్.  రెండు  నెలలకి ఒక్క సారి మాత్రం సర్విసింగ్ చేయిస్తే చాలు దానికి. ఇన్స్టంట్ ట్రాన్స్ బళ్ళు భవనం పై కప్పులపై ఆగుతాయి. ప్రతి పెద్ద భవనం అక్కడ ఒక స్టేషన్ కింద లెక్క. క్యూలో నిలబడి తన వంతు బండి కోసం ఎదురు చూస్తున్నాడు. అతని టోకన్ నంబర్ 3020. తన వంతు 13 నిమిషాల్లోనే వచ్చేసింది. తాను వెళ్లాల్సిన బండి రాగానే డోర్ ముందు నిలబడి కన్ను ఆర్పాడు . అతని వివరాలన్నీ చదివేసిన ఇంస్టా, యాక్సెస్ గ్రాంట్ చేసి మరో 8 క్షణాల్లో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ లైఫ్ ఆడిటోరియమ్ దగ్గరి స్టేషన్ కు తీసుకెళ్ళి పోయింది. ప్రస్తుతానికి మహా సభలు జరుగుతున్న ప్రాంతం అదే. న్యూ లైఫ్ సెంటర్ చుట్టూ నెలకొన్న అద్భుతమైన వాతావరణాన్ని గమనిస్తూ వెళ్తున్నాడు .

 

ప్రపంచ వ్యాప్తంగా తరలి వచ్చిన తెలుగు వారి జనాలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయి ఉంది .దాదాపు 3 లక్షల మంది. 25 కోట్ల మంది తెలుగు వారు అక్కడ జరుగుతున్న సభలను విర్చువల్ ఫోన్ లలో చూస్తూ ఆనందిస్తున్నారు . చుట్టూ ప్రక్కన ఎటు చూసినా వర్చువల్ సెల్లర్స్ సందర్శకులతో మాట్లాడుతూ బేరం ఆడుతూ బిజీగా తిరుగుతున్నారు. పర భాషా వారు కూడా ట్రాన్స్లేషన్ ( అనువాద ) సాఫ్ట్వేర్ ల సాయంతో వ్యాపారం చేస్తున్నారు అక్కడ . తెలుగు పుస్తకాల పై వచ్చిన గ్లాస్ పేపర్ బుక్స్ స్టాళ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి . ఈ  గ్లాస్ బుక్స్  ఒకే కాగితం పై పేపర్ లు తిప్పుతూ చదవచ్చు . అందులో టెక్స్ట్ మొత్తాన్ని చదివి వినిపించగలవు కూడా . ఆ రకంగా తెలుగు లిపి రాని వారు కూడా పుస్తకాలు కొని వింటున్నారు .

జగదీష్ ఆ రోజు రోబోటిక్స్ లో తెలుగు ఉపయోగం పై ప్రసంగించడానికి వచ్చాడు. చుట్టూ జరుగుతున్న దృశ్యాలు చూస్తూ ఆనందిస్తున్నాడు. ఎందుకంటే యు.యాన్.ఓ. వారు తెలుగుని నాలుగవ అధికారిక భాషగా ప్రకటించిన తరువాత జరుగుతున్న మహా సభలు ఇవి.  కాని అందరిలో కలిసి ఆనందంగా కనిపిస్తున్నా జగదీష్ అప్పుడప్పుడూ బాధగా ముఖం పెడుతున్నాడు. బయటా లోపలా తెలియని నిశబ్దాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే
ఎవడి వల్ల ఈ  మార్పులన్నీ మొదలయ్యాయో
ఎవడితో  తను చూస్తున్న ప్రపంచాన్ని 30 ఏళ్ల క్రితమే కలగన్నాడో
ఎవడు కాలానికి ఎదురు నిలబడి మానవ జాతిని మలుపు తిప్పాడో
అలాంటి స్నేహితుడు కృష్ణ ప్రసాద్ ఇవన్నీ చూడటానికి లేడు.
అసలు ఇవన్నీ చేసిన కృష్ణ గతించి ఇప్పటికి పదేళ్ళు. అతని జివితంలానే అతని మరణం కూడా ఒక సంచలనమే. జీవితంలో ప్రతి అడుgu చాంపియన్లా వేసిన కృష్ణ, ఉన్నట్టుండ మాయమయిపోయాడు. ఎలా చనిపోయాడు అన్న విషయం, ఇప్పటికీ ఎవ్వరికీ అంటూ పట్టదు. ఏ వ్యవస్థ ఎక్కువ కాలం ఉండదు. క్యాపిటలిజం అయినా. అని చెప్పిన కృష్ణ అన్నట్టుగానే ప్రపంచ చరిత్రను మలుపుతిప్పాడు.  తెలుగుని ప్రపంచ స్థాయి భాషగా తిరిగి నిలబడేలా గుర్తింపు తీసుకు వచ్చాడు. మూస పద్దతులను చీల్చి చండాడాడు. యువతను విపరీతంగా ప్రోత్సాహించాడు. 100 శాతం అక్షరాస్యతను వేగంగా   అతనంటే రీచ్ అయ్యేందుకు ఉద్యమించాడు.
అలంటి కృష్ణ తన స్నేహితుడు అనే గర్వం ఒక పక్కన , తను లేడే అన్న బాధ మరో పక్కన , ఈ రెండు ఆలోచనలతో సతమతమవుతూ వెళ్తున్నాడు జగదీష్.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s