Assistant director

అమీర్ పేట్. సాయంత్రం అయిదు గంటలు. హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ట్రాఫిక్  మోతతొ మారు మోగిఁ పోతొంది. నాలుగు పక్కల నుంచి కట్ట తెగిన చెరువు లా ఎగబడి పోవడానికి సిద్దంగా ఉన్న బళ్ళు. వీళ్ళని అదుపు చెయ్యడానికి అష్టకష్టాలు పడుతున్న ట్రాఫిక్ పొలిసు. ఒక్క సారి ట్రాఫిక్ సిగ్నల్ పడింది అంటే కరువు ప్రాంతం లో ప్యాకెట్లు దొరికిన లెవల్లో ఉరుకులు పెడుతున్న బైకులు.  పెద్ద బంగాళా మొత్తానికి పది నిమిషాల్లో బ్లాక్ పెయింట్ వేసేంత పొగ అక్కడ ఒక్క సెకండ్ లో విడుదల అవుతుంది.

సత్యం థియేటర్ నుండి నడుచుకుంటూ సారధి స్టూడియో వైపు వస్తున్నాడు కిషోర్. దారి పొడువునా వందల సంఖ్యలో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీల బ్యానర్లు. రోడ్డు పక్కనట్రెయినింగ్ సెంటర్ ల  పేపర్ యాడ్ లు పంచి పెడుతూ ఉన్న బాయ్స్. వాటిని ఇలా తీసుకుని వెంటనే కింద పడేసి వెళ్లి పోయే జనం. సినిమా ఫ్యాన్స్ షో అయ్యాక థియేటర్ లా ఆ వీధి మొత్తం పేపర్ల తో కప్ప బడి ఉంది.. హిజ్రాలు సిగ్నల్ పడిన చోట ఆగి బకరా క్యాంఢెటల కోసం వెతుకుతున్నారు. అక్కడ రోజు జరిగే వేట అదే. ఒకడి కి ఉద్యోగం వేట. ఇంకొకడు జంట కోసం. ఒకడికి అప్పుల వేట. ఇంకొకడిది స్టూడెంట్ల కోసం.  అంతా క్యాట్ అండ్ మౌస్ res  గేమ్.

అదే రోడ్డు పై సిగ్నల్ క్రాస్ చేసి ఎదురుగా ఉన్న సారధి స్టూడియో గేటు వైపు వెళ్తున్నాడు కిషోర్. అసిస్టెంట్ డైరక్టర్. సినిమాలంటే చిన్నప్పటినుంచి పిచ్చి మనోడికి. ఎంతగా అంటే 8 క్లాస్ నుంచి ప్రతి సినిమా స్క్రిప్ట్ రాసుకునే వాడు. ఏ సిన్ ఎలా తీసారో అందరికీ చెప్పేవాడు. 6 అడుగులు ఎత్తు. చామన ఛాయ రంగులో ఉండే కిషోర్ ఇంటర్ వరకే చదువుకున్నాడు. ఇప్పటికి డైరక్షన్ డిపార్ట్మెంట్ లో 2 సినిమాలు పూర్తి చేసాడు. ఎలాగైనా పెద్ద సినిమాల్లో చెయ్యాలని కసిగా ప్రయత్నించడానికి వచ్చాడు.

సారధి స్టూడియో గేటు చూడగానే కిషోర్ కి అన్ని రకాల ఎమోషన్స్ , ప్రశ్నలు తిరగడం మొదలయ్యాయి. మాములుగా అయితే అక్కడికి కారులో వస్తే లోపల జరుగతున్న సినిమా పేరు చెప్పేసి సెక్యురిటి దాటి వెళ్లిపోవచ్చు. ఒక్కోసారి అది కాస్త్లి కారు అయితే అడగకుండానే లోపలి పంపిస్తారు. కాని , కిషోర్ వెళ్ళింది పైదల్ సే. మామూలు శుస్ వేస్కుని. ఇందస్త్రీ కి  వచ్చి నాలుగు ఎల్లవుతున్నా మనోడి దరిద్రం అలానే పెరగకుండా , తగ్గకుండా నిలబడింది. ” ఏ సినిమా ” అని అడిగిన ప్రశ్న వినబడి మామూలు లోకం లోకి వచ్చాడు కిషోర్. ఎదురుగా వచ్ మెన్. ఎం చెప్పాలో తెలీడం లేదు. టెన్షన్ లో సినిమా బ్యానర్ పేరు మర్చిపోయాడు. హిరో పేరు చెప్పి ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ రమ్మన్నాడు అని చెప్పాడు. పక్కన ఉన్న ఇంకో సెక్యురిటి గార్డ్ కూడా వచ్చాడు. ” ఏంటి ” అనుకుంటా. ” ఛి దరిద్రం, ఈ రోజుకి ఇక బయటికే ” అని లోలోపల తిట్టుకోవడం మొదలుపెట్టాడు కిషోర్. కాని,. అదృష్టం ఒక్కోసారి దరిద్రం లా పట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే గేటు దాటుకుని ఎదురుగా వచ్చింది శ్వేత రాచర్ల. ఇంతక ముందు రెండు సినిమాల్లో ఇద్దరూ కలిసి పని చేసారు. తెగ
కొట్టుకునే వాళ్ళు. ఒకానొక టీం లో ఇద్దరినీ లవర్స్ ఏమో అనుకునేంతగా కలిసి తిరిగారు. శ్వేత  అని పిలుస్తుంటారు కాని, ఈ మద్య క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువయ్యి ఫేస్ బుక్ లో ఇంటి పేరుతో సహా పెట్టుకుంది. తన కులం గురించి హింట్ లాగా.  ” శ్వేత ” అని అరిచాడు ఎదో ఊర్లో ” అన్నా నమస్తే అని కిలోమిటర్ నుంచి అరిచినట్టు. దడుచుకుని వెనక్కు తిరిగి చూసింది శ్వేత. నిజానికి అక్కడ కలవడానికి వచ్చింది శ్వేత నే కాని తనకు అస్సలు చెప్పకుండా అక్కడ డైరక్ట్ గా కలుద్దామని వచాడు. ఫోన్ నంబర్ దొరక్క.  శ్వేత, “ఓయ్ నువ్వీంటి ఇక్కడ” అని అడగగా, కిషోర్ “:అదే నువ్వీ సినిమాకి పని చేస్తున్నావని తెలిసి కలుద్దామని వచ్చా అని చెప్పాడు. దాంతో శ్వేత అక్కడున్న సెక్యురిటి గార్డుకి చెప్పి లోపల షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్ళింది.

షూటింగ్  లొకేషన్

లంచ్ బ్రేక్ టైం. అంతా బయటికి తింటున్నారు. కిషోర్ ఎదురుగా హిరో అక్కడ కేరావాన్ లోపలి వెళ్లి కూర్చున్నాడు. బయట బాయ్ బాగు పట్టుకుని డోర్ దగ్గర నుంచున్నాడు. డైరక్టర్ వాసు బయటికి వచ్చి ఎవరు తెల్ల చొక్కా బండ పెద్దాయన కి షాకే హ్యాండ్ ఇచ్చి కుర్చుని మాట్లాడుతున్నాడు. తన జాతి వారు,అదే అసిస్టెంట్ డైరక్టర్ లు టెన్షన్ గా తిరుగుతూ చేతిలూ పేపర్లతో నెక్స్ట్ సీన్ కి రెడీ అవుతున్నారు.హీరోతో పోటిగా అసిస్టెంట్ డైరక్టర్లు కూడా కాస్త గ్లామర్ మైంటైన్ చేస్తున్నారు. వాళ్ళను చూడగానే చెప్పెయ్యోచు ఫిలిం స్కూల్ బ్యాచ్ అని. ఒక్కడికి తప్ప అందరికి కళ్ళద్దాలు. గెడ్డాలు. మండుటెండ లో కూడా ఒంటికి జాకెట్ కప్పుకుని స్టైల్ గా తిరుగుతున్నారు. శ్వేత ది కూడా అదే బ్యాచ్. కాని కాస్త నార్మల్ గా బెహేవ్ చేస్తుంది. తీసుకెళ్ళి వాళ్ళకు పరిచయం
చెయ్యగా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు కిషోర్.

అప్పుడే కాస్త తాగుబోతు కళ్ళతో వచ్చిన కో- డైరక్టర్ స్వచ్చమైన తెలుగులో బూతులు శ్వేత ని తిట్టడం మొదలుపెట్టాడు.కో – డైరక్టర్ చెప్పినవన్నీ రెడీ చేసి మళ్ళి కిషోర్ దగ్గరికి వచ్చింది శ్వేత.

” చెప్పు కిషోర్ ఏం సినిమా చేస్తున్నావ్”

” ఏ … ఖాళీనే…అయితే  పోయిన నెల రవి అన్న  సినిమా స్టార్ట్ అయ్యింది కాని ఆగిపోయుండే” అని బదులిచ్చాడు.

” అవును అబ్బా… మనకు కామన్ ఏ గా ”

” అవును ఈ సినిమాలో ఎమన్నా ఉన్నదా డైరక్షన్ డిపార్ట్మెంట్ ల చాన్సు”

” లేదు కిషోర్ , అలరెడి పెద్ద బడ్జెట్ సినిమా … అంతా పోటి ఎక్కువయ్యిపోయింది. ఉన్న వాళ్ళనే తీసేస్తారో లేదో తెలియడం లేదు. బయట వేరే సినిమా ఏది ట్రై చెయ్యలేదా?” అని అమాయకంగా అడిగింది.

” ట్రై చేస్తున్న కాని ,  నెక్స్ట్ యియర్ ఏప్రిల్ వరకు ఎవ్వరిది ఆఫీస్ కూడా ఓపెన్ చెయ్యట్లేదు”

” లైట్ తీసుకో…. మా  సినిమాలో  డిపార్ట్మెంట్ పెద్దదయ్యిపొయ్యింది. పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ల కొడుకులు, ప్రోద్యుసర్ల కొడుకులు అంతా చేరారు డిపార్ట్మెంట్ లో ”
” ఎమన్నా చేస్తున్నరా పని మరి”

” ఎందుకు చేస్తారు. ఎవడికి వాడు ఇంగ్లిష్ లో మాట్లాడుకోవడం , అదేదో సినిమా , ఇదేదో సినిమా అని వాటి గురించి డిస్కస్ చెయ్యడం. అంతకు మించి ఏం లేదక్కడ. నాకు మాత్రం వాచిపోతుంది ఇక్కడ. నేను , ఇంకో ఇద్దరు తప్ప ఎవ్వరూ పని చెయ్యరు ”
” ఆళ్ళ మోకాలు చూస్తేనే తెలుస్తుంది. రాత్రి పుట కూలింగ్ గ్లాస్ వేసుకునే  మొకాల్లెక్క ఉన్నారు ఒకోక్కలు. మరి డైరక్టర్ ఏమంట లేడా.”

“ఎందుకు అంటాడు. మమ్మల్ని మాత్రం అందరి ముందు పిలిచి బూతులు తిడుతూ ఉంటాడు. వాళ్లతో నెమో షూటింగ్ అయ్యాక పర్సనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అసలాళ్ళతో పనేందో తెలీడం లేదు”
” అందుకే మనోడికి మొన్న బంపర్ ఫ్లాప్ అచ్చింది. ఇంగ సినిమా ఎట్ల వస్తది.”

” పర్లేదబ్బా .. కాని సెకండ్ ఆఫ్ ఏ తేడా కొడుతుంది. ఆ విషయం చెప్తే అయన ఆస్థాన రైటర్ కృష్ణ మూర్తి గారు అమ్మనా బూతులు తిట్టి ఒక అసిస్టెంట్ ని పనిలోనుంచి తీయించేసాడు.”
” ఏందో ఆ కృష్ణ మూర్తి, వానికి హిట్ వచ్చి 5 ఏళ్ళు అయ్యింది. అయే డైలాగులు అదే స్టోరి పెట్టి ఎన్ని రోజులు రాస్తాడు. ”

” అంతే మన ఖర్మ. సరే నాకు పనుంది. హిరోయిన్ ని పిలవాలి”
అని చెప్పి శ్వేత పరిగేట్టుకుంటు వెళ్ళిపోయింది.

శ్వేత ని పరీక్షగా చూస్తున్నాడు కిషోర్. కనీసం తనకు మనిషికిచ్చినంత మర్యాద ఇస్తోంది. మిగత అసిస్టెంట్స్  భీబత్సమైన attitude మెయింటెయిన్ చేస్తున్నారు. ఏంటో పాడు లోకం అని విరక్తి తో ఒక పక్కన వెళ్లి చూస్తున్నాడు షూటింగ్ తతంగం అంతా. అక్కడ హిరోయిన్ తన ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతోంది. పక్కనే జుస్ బాటిల్ పట్టుకుని అసిస్టెంట్ వెయిట్ చేస్తున్నాడు. ఫోన్ మాట్లాడటం అయిపోయాక ఫోటో దిగి ఎందులోనో పోస్ట్ చేస్తోంది.పక్కనున్న బాయ్ దాదాపుగా పెంపుడు కుక్క తిరిగినట్టు ఆమె పక్కన తిరుగుతున్నాడు ఒక చేత్తో బాటిల్ ఒక చేత్తో గొడుగు పట్టుకుని. ఇక హిరో అప్పుడే షాట్ రెడీ అనేటప్పటికి వ్యాన్ దిగి స్పాట్ కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. డైరక్టర్ పిలిచి యాక్టింగ్ అసిస్టెంట్ కి షాట్ వివరించమని చెప్తున్నాడు. ఇంగ్లిష్ అసిస్టెంట్ డైరక్టర్లు కాసేపు మాట్లాడుకుంటూ లొకేషన్ కి వచ్చి సీరియస్ గా పని కోసం నిలబడి డైరక్టర్ దగ్గర నుంచున్నారు.

హిరోయిన్ ఇంకా రాలేదు. ఆమె లేటు గురించి బూతులు, జోకులు వేసుకుంటూ యూనిట్ వెయిట్ చెస్తూ ఉన్నారు. ఎదో ఒక రోజు వీళ్ళ అందరినీ తను డైరక్ట్ చేయ్యబోతానా అని అనుకుంటున్నాడు మనసులో కిషోర్. లొకేషన్ అంటా కోలాహోలం గా ఉంది. సినిమా వాళ్ళకే అలవాటైన ఫీలింగ్ ఒకటి ఉంది.
షూటింగ్ ఉన్నన్ని రోజులు ఆనందంగా టెన్షన్ గా బిజీగా ఉండే వాళ్ళు – ఒక్క సారి కాస్త గ్యాప్ వచ్చిందంటే కిషోర్ లానే ఫీల్ అవుతూ నిలబడి ఆలోచిస్తారు. ఇంతలో ” ఏయ్ ఎవడ్రా అది ” అని అరుపు వినిపించింది. తను అలొచిస్తూ నిలబడిన ప్లేస్ ఫ్రేం లో పడింది. ఫ్రేమ్ లో కిషోర్ పడ్డాడు. కెమెరా మెన్ తమిళం లో తాత ముత్తాతల దగ్గర నుంచి అందరినీ కలుపుతూ తిడుతున్నాడు. డైరక్టర్, శ్వేత ని పిలిచి ” ఎం చేస్త్నునావ్ ” అని అందరి ముందు గట్టిగా తిట్టాడు. శ్వేత చూడంగానే ఎదురుగా కిషోర్. ఎవడు వాడు. లోపలి ఎలా వచ్చాడు అని అడిగాడు. శ్వేత సర్దిచెప్పి మరిన్ని తిట్లు తిని కిషోర్ దగ్గరకు వచ్చింది. కోపం గా ” డైరక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నావ్ ఆమాత్రం తెలియదా నీకు” అని కోపం గా తిట్టేసి వెళ్ళిపోయింది.

కిషోర్ దాంతో బయటికొచ్చినిలబడ్డాడు. బాగా గిల్టి ఫీలింగ్. ఇండస్ట్రి లో ఉంది కూడా, బయట వాళ్ళు చేసే పనులు చేసే వెర్రి బాగులతనం గా ఉంటుంది. దాంతో పాటు కాసింత చిరాకు. ఛ తన వల్ల, శ్వేత కు తిట్లు పడ్డాయి అని.  ఎదురుగా వచ్చిన కో-డైరెక్టర్ ఒక రేంజ్ లో చూసి అసిస్టెంట్స్ మీద ఘర్జిస్తున్నాడు.  శ్వేత దగ్గర నంబర్తీసుకుని వెళ్ళేదాకా వెయిట్ చేద్దామని అనుకున్నాడు. ప్రస్తుతం అది కూడా వర్క్ అవుట్ అయ్యేట్టు లేదు.

ఇంతలో ” హె …!బ్రో”  అనే పిలుపు విన్పించి వెనక్కు తిరిగాడు.  ఇందాక పరిచయం అయిన అసిస్టెంట్ డైరక్టర్ రవికుమార్. ” ఏమనుకోకు బ్రో. కెమెరామెన్ కి డైరక్టర్ కి పడడం లేదు. చాన్స్ దొరికితే ఆ కోపం మొత్తం మా డిపార్ట్మెంట్ మీద ఎగిరి గంతేద్దామని  ట్రై చేస్తున్నాడు.

” లైట్ బై ..” అని సర్దుకుని, ” అవునూ డైరక్షన్ డిపార్టుమెంటు లో ఏమన్నా చాన్స్ ఉందంటావా” అని మళ్లి ప్రశ్నించగా
” ఇందాక శ్వేత ని కలిసావు గా … ఏమన్నా అడిగించావా మరి కో-డైరక్టర్ సార్ ని కలిసి”

” ఇంకేడ అడుగుత. ఇప్పుడు నా మీద ఉన్న మూడ్ లో”

” బ్రో …. మమ్మల్నే ఎప్పుడు ఎవర్ని తీసేస్తారో లేదో తెలియడం లేదు. అంతా గోల గోల గా ఉంది. స్క్రిప్ట్ పొద్దున్న వచ్చి రాసుకుంటారు. ఒక్కో సారి స్క్రిప్ట్ లేకుండా సీన్ లు తీస్తారు. ఎవరి స్టైల్ వాళ్ళది. ఆ శ్వేత కేమో బుర్ర పని చెయ్యదు. కరెక్ట్ గా అవసరమైనప్పుడే అన్నీ మరిచోపోతుంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ పని చెయ్యరు. ”
”  కామన్ భయ్యా. మరాలాగుంటే నాలాంటి వాళ్ళని  తీసుకోవచ్చుగా .”
” నువ్వు పని చేస్తావని ఎవరికి తెలుసు భయ్యా… ఉంటే గోద్దులా పని చేసి మంచి స్క్రిప్ట్స్ పెద్దవాళ్ళకి చెప్పగలిగే శక్తి ఉండాలి. లేదా ఇంగ్లిష్ బాగా మాట్లాడి ఎదో  కొరియన్ సినిమాల పేర్లు చెప్పుకుంటా … మన సర్కిల్ పెంచుకోగాలగాలి.. . అలాంటి వాడికే మన లో చాన్స్ ఉంటుంది..

ఇదంతా లేకపోతె కనీసం, షార్ట్ ఫిలిమ్స్ తీసి పెద్ద డైరక్టర్ కి చుపిస్తే ఏ పురిజగన్ , రాము, సుక్కు సార్లు ఒక్కోసారి తీసుకోవచ్చు.

”  అవును భయ్యా ఇంగ్లిష్ రాకపోవడం బాగా దెబ్బ అయ్యింది. కాని కధ బాగా నేరేట్ చేస్తా అంటరు అంతా. ”

” మళ్లి చాన్స్ వచ్చే దాకా చిన్న సినిమాలు ఏమన్నా చేరోచ్చుగా అసిస్టెంట్ గా ”

” చేసినా భయ్యా. ఇప్పటికి రెండు సినిమాలు అయినాయి. ఇంకో నాలుగు సినిమాలు కూడా చేసినా. ఏది ఎప్పుడు మొదలవుతదో. ఏది ఎప్పుడు ఎండ్ అవుతదో తెలవదు. అన్ని అయితే రిలీజ్ అవుతదో తెలవదు. ప్రొడ్యుసర్ కి ఎప్పుడు మూడ్ వచ్చి డబ్బులేస్తాడో తెలవదు. ఈల్లకు అసిస్టెంట్ డైరెక్టర్కు బాయ్ కు తేడా తెలవదు. అందుకే పెద్ద సినిమాల్ల ట్రై చేస్తున్నా. ”

” పెద్ద సినిమాలేదో బాగున్నట్టు. ఇక్కడ మాది ఇంకా కుక్క బతుకు.  చిన్న సినిమాలలో కనీసం అన్ని పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ రోజుకి ఒక్కసారైనా డైరక్టర్ మన మొకం చూసినా అదో పెద్ద అదృష్టం అనుకోవాలి. చిన్న తేడా వచ్చినా తీసి పారదొబ్బుతారు. నా మాట విని చిన్న సినిమానే హ్యాపి.రెండు సినిమాలు చేసానంటున్నావ్ కదా. కధలు ఉంటె, సర్కిల్ ఉంటే కుర్ర హిరో ఎవర్నైనా అడిగి సినిమా పట్టుకో. లేదా ఎదుగుతున్న చిన్న డైరక్టర్ల దగ్గర పని నేర్చుకో భయ్యా.. అదొక్కటే నేను నీకు చెప్పగలను.”

” థ్యాంక్స్ భయ్యా… ” అని బయలుదెరబొతూ, ఆగి ” నీ సెల్ నెంబర్ ఒక సారి ఇస్తవా. అని అడిగాడు.
” లేదు భయ్యా నాది పాత నంబర్ పొయ్యింది. కొత్త నంబర్ తీసుకుని శ్వేత కి ఇస్తా ” అని చెప్పి బయలుదేరాడు రవి.

” ఛి .. నా బ్రతుకు.. మనోల్ల గురించి తెలిసి కూడా అడిగిన చూడు.. ఇగ ఈ సినిమా కూడా బిస్కెట్ అని అనుకుంటూ బయలుదేరాడు కిషోర్, రుం కి. అప్పటికి కిషోర్ వయస్సు 29 ఏళ్ళు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s