నాకు కంచె సినిమా నచ్చింది/ నచ్చలేదు ఎందుకు ????

​ప్రేమలో తిట్టు ఉంటుంది
తిట్టు కూడా ప్రేమలా ఉంటుంది

నచ్చింది

———-
– అసలు ఇలాంటి సబ్జెచ్క్ట్ ని తీసుకోవడమే ఒక డేర్ అయితే దాన్ని ఇంత అద్భుతంగా డీల్ చెయ్యడం సూపర్బ్

– వరున్ తేజ్ నటన ఎక్కడ ఏ సీనుకి ఎంత ఇంటెన్సిటీ ఉండాలో అంత ఇచ్చి అద్దరగొట్టాడు కాబట్టి, మెగా ఫ్యామిలి నుంచి వచ్చి , రెండో సినిమా మాస్ సినిమా చెయ్యగలిగి, ఇలాంటి సబ్జెక్ట్ ని తీసుకుని గెలవడం నిజం గా సూపర్

– సినిమా పొడవునా అద్భుతమైన పోయెట్రికల్ ఫీల్ తో నింపగలిగారు కాబట్టి

– కధనం, బ్లాకింగ్, ఎండింగ్ వీటన్నిటి పరం గా ఈ సినిమా తెలుగు సినిమాలో నిజం గా ఒక మైలురాయి ( అంత లేదు అనుకున్నా ఒక మార్పు అనుకోవచ్చు)

– పీసు పీసులుగా సాయి మాధవ్ డైలాగులు చాలా రోజుల తరువాత విజిల్స్ బదులు చప్పట్లు కొట్టించాయి

– ఎంత చదువుకున్న దేశమైనా బెధాలతో ఎలా నాశనం అవుతుందని తెలివిగా లింక్ చేసినందుకు

– హీరో పాత్ర కధలో భాగం గా తప్ప , ఎక్కడ కూడా పరిధి దాటి చూపించకుండా కధల నడిపించినందుకు

– హోప్ మీద సినిమాని నడింపించిన తీరు , చివరికి హీరో హోప్ ని ఊరిలో నిజం చేసిన తీరు చెప్పకుండా చెప్పడం రచ్చ

– జర్మనీ నుంచి తప్పించుకునే ప్రతీ బిట్ ఎమోషనల్ గా , రెయలిస్టిక్ గా ఉన్నాయి.
ఇక

+++++++++++++++++++++

నచ్చలేదు

———–

– అసలు విమానం నుంచి పడ్డ బాంబులూ, ట్యాంకర్ నుంచి పడ్డ బాంబులు అన్నీ ఒకేలా పేలతాయా

– సచ్చిన ఒక్క సైనికుడి వొంటి మీద నెత్తురు కాని , దెబ్బలు కానీ ఉండవా

– స్కూల్ నాటకాలలో కాల్చగానే ” ఆ ” అని పడిపోయే సీన్ నే మళ్ళీ జర్మన్ లొంగుబాటు సీన్ లో చూపించాలా

– అసలు ఊర్లో గొల్లపూడి, ఇంకొకళ్ళు తప్ప అంతా అగ్రహారం స్టైల్ లో మాట్లాడతారా

– కులం అనే డైలాగ్ నాకు విజిల్ ఎయ్యించింది… కాని ఒక్క సారి మీనింగ్ మొత్తం ఆలోచించి చూడండి

– అసలు జమిందారు ఇంట్లో ఒక మంగళి వాడి కూతుర్ని ఎత్తుకెళ్ళుతుంటే 4-5 ఐదుగురు తప్ప ఎవ్వరూ ఆపరా ( ఆరోజుల్లో )

– కర్ర ఫైటు దగ్గర, క్లైమాక్స్ ఫైట్ లో ఎందుకంట ఆ పాట, ఏమైనా మీనింగ్ అన్నా కన్వే అయ్యిందా లేదా… We missed the entire tempo and feel off the scene with bad slow music bits….

– డైలాగ్స్ కధలో భాగంగా ఉన్నట్టు వెళ్తూ , మధ్యలో ఓవర్ మెలో లోకి చాలా సార్లు చిరాకు తెప్పించాయి

– అవసరాల శ్రీనివాస్ అనే అద్భుతమైన నటుడిని , ఇలా కామెడీకి కాకుండా, అటు యాక్టింగ్ కి కాకుండా బిరియానీలో కరేపాకులా వాడారబ్బా,, విసిగొచ్చింది మొదటి సారి శ్రీనివాస్ ని చూసి

– అలాగే ఇంగ్లీష్ , జర్మన్ వారి ఇంగ్లీష్ పదజాలం స్వతంత్రంకి ముందు అలా మాట్లాడినట్లు అనిపీయడం లేదు, చాలా తెచ్చిపెట్టుకున్నట్టు కనపడుతున్నాయి.
– సెకెండ్ ఆఫ్ లో ఆ పాట ఎందుకు పెట్టారో, ఆ సంగీత దర్శకుడు ఎవరో మలయాలం లవ్ స్టోరి అనుకున్నాడేమో మహానుభావుడు, అంతకు మించి మాట్లాడిటే ఎలాగో నీకేం తెలుసు అని నన్ను తిడతారు.

– ఎంత కధను నమ్ముకున్న సినిమా అయినా కొంచుమైనా ఇంటరస్ట్ అన్నా చెడకుండా చెయ్యచ్చు కదా. పట్టుగా ఉండాల్సిన సెకండ్ ఆఫ్ అంత చప్పగా సాగదీయక్కర్లేదేమో
క్రిష్ సారూ…. మీరు గొప్ప సినిమా తీయలేదని అనటం లేదు…. ఉన్నదున్నట్టు చెప్పాలి అనిపించిందీ…..

ఒక ప్రేక్షకుడిగా నాకు తట్టిన భావాలు మాత్రమే ……..
ఇకపై క్లాసిక్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయాడు అని మిమ్మల్ని మేం అనుకోకూడదని ఈ ప్రేమ లేఖ రాశాను

—————————————–
ప్రేమలో తిట్టు ఉంటుంది
తిట్టు కూడా ప్రేమలా ఉంటుంది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s