మరణ ప్రస్థానం

DISCLAIMER : Its just an imaginary piece of work. Nothing related to my life.
25 నిముషాలు
నా కణ ప్రవాహానికి మిగిలిన క్షణాలు

ఈ కొత్త అనుభవానికి కాబోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు

ఈ క్షణం చేరే దాకా తెలియలేదు

ఆ అనుభూతికి ఒక సెకండు , ఒక అడుగు, ఒక వస్తువు

తగిలేంత దూరం లో ఉన్నానని

కాదేదోయ్ మరణాయుధానికి అనర్హం అని

విజయానికి మెట్లు గురించి ఎవడైనా చెప్తాడేమో

మరణానికి ప్రతి మెట్టు నా పెదవిపై పుస్తకమౌతొంది
15 నిముషాలు
దేవుడి ఆటలో ఈ మనిషి అనే పావు కి

మిగిలిన పావు గంట అది

చుట్టూ తిరుగుతొంది వందల మనుషులు,

కానీ వారుండేది ఆండ్రాయిడ్ ఎడారిలో

ఎవరి చేతిలో వారి ప్రపంచం

ఎదురుగా MNC షాపులు

అందులో నాకేసి చూస్తున్న బొమ్మలు

వాటి పక్కనే తలా దించుకుపోతున్న మనుషులు

నా పయనానికి గమ్యం మృత్యువు

వారి పయనం ఎటో తెలియదు

ఒక్కరికైనా పంచుకోవాలనుకున్న నా భావాలు

వాత్సాప్ నోటిఫికేషన్స్ లా మొగుతున్నాయ్ తప్ప

ఓపెన్ చేసి చూసే టైం లేదు ఎవ్వరికి
10 నిముషాలు
నే మొదలైనది ఒక చీకటి గదిలో,

అంతం మళ్ళీ అదే చీకటి ఒడిలో

నా రాత్రులకే సొంతమైన చీకటి

నా పగటిని కబళించే సమయం
రోడ్డుపై ఒక్కో అడుగు నడిచే కొద్దీ

నా కధ కొద్దీ కొద్దిగా ప్రత్యక్షం

నే చుసిన అందాలు, నే గెలిచిన క్షణాలు

నా బాల్యపు హాయి గుర్తులు

నా యవ్వనపు దూకుడు సందడి

స్నేహితులతో చేసిన అలజడి

నే చుసిన అవమానాలు

నిన్న దాకా పడిన వేదనలు

దేవుడు చేసిన మోసాలు

అన్నీ అన్నీ కలిపి కనిపిస్తున్నాయి
5 నిముషాలు
ఇక ఈ వికృత ప్రక్రుతి క్రీడకు చివరి ఐదు 60లు

ఆ తరువాత ఉండవు నాకు ఏ పట్టింపుల గోలలు

ఏ ప్రాంత, కుల, మత, గ్రూప్ గజ్జి గోలలు

ఏ బంధపు వంచనలు, చీత్కారాలు, మోసాలు

ఏ దేశపు వ్యూహాలు, ఏ చట్టపు పైత్య ప్రభావాలు

నా అందమైన నాకు మాత్రమే సొంతం అనుకునే

ఓ విశాల విశ్వపు భావన వైపు వెళ్ళడానికి సిద్ధపడుతున్నా
2 నిమిషాలు
నా మనసులోకి ఎవ్వరూ రావడం లేదు

ఉద్యోగం పోయినప్పుడు నా ఇల్లు లా తయారైంది అది

ఏ భావం రావటం లేదు

నాకోసం ఒక్కరైనా చూపించుంటే బాగుండేమో

నా పర్సులు, నా బట్టలు, నా సెల్

నా శరీరం పై

తగులుతూ సమ్మె చేస్తున్నాయి

యజమాని నిర్ణయం తప్పని అంటూ
అడుగులు పడుతున్నాయి

ఏదోటి తగిలించి

బొందిని వాడిలించుకునే పని మీద

ఒక మరణానికి ముందు ఎన్ని సార్లు

దాన్ని అనుభవించిందో

నా బుజ్జి గుండె

జాలిగా తన ఫేర్ వెల్ మీటింగ్ పూర్తి చేసుకుని వెళ్తున్నా
ఉన్నట్టుండి చీకటి

ఎం తగిలిందో తెలీదు
లేచి చుస్తే

ఒక పెద్దమనిషి

షోడ బాటిల్ పట్టుకుని
తుస్సుమన్న నా గుండెకు దవడ వాయిస్తూ

చెప్పింది మనస్సు

ఇంకా చాలా సార్లు

లోలోన చావాల్సి ఉంది

నా తరువాతే నువ్వు అని

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s