ఓయ్ రాక్షసి

​DISCLAIMER:

Purely imaginary piece of work

Dont relate it to me.
ఆ కళ్ళు చెప్పే కధలు

కలిపితే చాలవు లోకంలో పుస్తకాలు
చాలవు     ఈ కవిత్వాలు, కధలు

చాలవు      కళాకారుల ట్యాలెంటులు

నీ గురించి

నా భావనలు చెప్పడానికి
ఎప్పుడు ఎల్లిపోయావో గుర్తు రావడం లేదు

రోజూ నీతో గాల్లో మాట్లాడుతున్నా కదా
నువ్వు లేవన్న ఫీలింగ్ కన్నా

నువ్వున్నప్పుడు మన నవ్వులే గుర్తొస్తాయి
అందువల్లే,

నా వల్ల నువు నవ్విన ప్రతి క్షణం

వెయ్యి టన్నుల వోల్టాజి దానం
కాలం అలా అలా ఆగిపోయింది,

నీ రూపంలో

గతం కల, గతం వృధా అనుకునే యుగంలో

గతం కూడా ఒక్కోసారి అందమైన నిజం అని చెప్పే

నీ జ్ఞాపకాలు నాతో నడుస్తున్నాయి
మనం కూర్చున్న ఒంటరి ప్రదేశాలు

మనం కలిసి పనిచేసిన ఆఫీస్ చెల్లెంజ్ లు
నీకు మాత్రమే సొంతమైన నా భుజం

మనల్ని చూసి కుళ్లుకున్న బ్యాచ్ లు
ఓ కాలం కథ చెప్పే మన జ్ఞాపకాలు

నాతో, నీతో ఒంటరిగా ఉండిపోతాయి…

తల్చుకున్నప్పుడల్లా నవ్విస్తున్నాయి
మన మధ్యన ఒక నిశబ్ధం ఉండేది

కానీ అది మనం మాట్లాడుతున్నట్టే ఉండేది

ఓరి నాయనోయ్

దేవుడిది చాలా రొమాంటిక్ సెన్స్ రా బాబు

తనని తాను ప్రూవ్ చేసుకోడానికి

మాకెన్ని మెమోరీస్ ఇచ్చేసాడు
నీలో ని పసితనం, నీ అమాయకపు చూపు

చుసిన కళ్లది ఎంత అదృష్టం

మనం మళ్ళీ అలా ఉండమేమో…

పెద్దోళ్లమైపోతాం కదా
ఒక్కోసారి నిన్ను తలిస్తే

జ్ఞాపకం గుండెలో కన్నీరు కారుస్తోంది

మరో సారి నీ ఊహలోని ఆనందం

చెంప పై నిమురుతూ ఓదారుస్తూ ఉంది
కాలం కలిసొస్తే

నాకొక వరమొస్తే

మరొక్క పది నిముషాలు

నీతో ఉండాలని

మాట్లాడాలని

హాయిగా నవ్వాలని

అనిపిస్తుంటోంది.
ఏంటో

పిచ్చి లోకం

మరీ ప్రాక్టికల్ అయిపోయింది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s