కుమారుడికి ప్రేమతో

 

ప్రియమైన నానికి,
ప్రేమతో రాస్తున్న లేఖ. నీకు సర్ప్రైజ్ లు అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి, ఎప్పుడో మానేసిన లెట్టర్ రైటింగ్ మొదలుపెట్టి ఈ ఉత్తరం రాస్తున్నాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ , wishing you a very happy birthday. ఇది నీకు 27 వ బర్త్ డే. ఇవాళ నాకు మీ అమ్మకు  ప్రపంచంలో అత్యంత ఇష్టమైన రోజు. నీకు తెలుసు కదా. నువ్వు పుట్టిన రోజులకి నాకింకా ఉద్యోగం లేదు. చేతిలో రూపాయి ఉండేది కాదు. మా ఇద్దరి జీవితంలో మొట్ట మొదటి సారి ఉద్వేగానికి లోనయ్యింది క్షణం అది. అప్పుడేమో మమ్మల్ని పట్టించుకోడానికి కూడా పక్కన ఎవ్వరు లేరు. కానీ నిన్ను చూసి పడే ఆనందం ముందు ఒక్క ప్రాబ్లం కూడా గుర్తుకొచ్చేది కాదు.

 
నువ్వు మొట్ట మొదటి సారి నన్ను చూసినప్పుడు నూవ్వు ఏడ్చిన ఏడుపు ఎంత కమ్మగా అనిపించిందో. నాన్నా నేను వచ్చేసా అని పలకరిస్తున్నట్టు ఉండేది. పెరిగే కొద్దీ ఎప్పుడు ఇంటికొచ్చినా అదే అనే వాడివి. నాన్నా నేను వచ్చేసా అని. మా ఫ్రెండ్స్ అందరూ తమకి ఆడ పిల్ల కావాలని అనుకుంటుంటే, నేను మాత్రం మగ పిల్లవాడే కావాలని అనుకునే వాడిని. You know why??Its a boy thing. ఎందుకంటే నా బాల్యాన్ని నేను మళ్ళీ చూడొచ్చన్న కోరికతో. నేను పోగొట్టుకున్న ప్రతీది నీకు ఇవ్వచ్చన్న ఆశతో. కొడుకు అయితే పెద్దయ్యాక కూడా కోపం వస్తే నాలుగు అంటించి, ఇంట్లో కూర్చుని కాసేపు వాదిస్తూ, కాసేపు సరదాగా మాట్లాడుతూ, కాసేపు నీ వీపు మీద చెయ్యి వేసి పడొకోవచ్చు అన్న స్వార్థంతో. I may not be a king, but son was always a prince .
అందరు నాన్నలు మా అబ్బాయికి రాంక్ ఇంత , అంత అంటూ హెచ్చులు పోతుంటే నేను మాత్రం నా కొడుకు తనకిష్టమైన రంగంలో హ్యాపీగా ఉంటె చాలు ఆనుకునే వాడ్ని. అసలు పిల్లల్ని అలా గొప్పలకి వాడుకోవడం నాకు అస్సలు నచ్చదు. అందుకే ఐ.ఐ.టి. పిచ్చి ఉన్న కాలం లో నిన్ను ఇంటర్ లో HEC తీసుకుంటానంటే కాదనలేదు.

 

 

నా నమ్మకం నిజం కావడం ఆలస్యం అయింది. కానీ, నువ్ అనుకున్న రీసెర్చ్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యి, ఒక ఇంటివాడు అవ్వడం మాత్రం దానికి మించి డబుల్ ఆనందం గా ఉంది. అన్నట్టు మర్చిపోయా , స్వాతి తల్లి కూడా కులసానే కదా. కోడలు తల్లిని జాగ్రత్తగా చూసుకో, అందరికీ మీ అమ్మకు అన్నంత ఓపిక, సహనం ఉండదు.  I hope you celebrated the day well with your love.
అన్నింటికీ మించి ఈ సంవత్సరం నికోకటి చెప్పాలి. చిన్నప్పుడు నువ్వెంత ముద్దుగా ఉండేవాడివో నీకు తెలియదు. మీ అమ్మ అలా లిఫ్ట్ దాకా ఎత్తుకెళ్తే దిష్టి తీయాల్సి వచ్చేది. ఎంత టెన్షన్ లో ఉన్న మెత్తని నీ బుగ్గలు, పళ్ళు లేని నీ నవ్వులు, ఎర్రని నీ చేతులు చూస్తుంటే నాకు స్వర్గం నేలను తాకినట్టు ఉండేది . ఇప్పుడు చూడు అమెరికా వెళ్లిన రెండేళ్లలో ఎంత లావయిపోయావో.
టైం కి తింటున్నావో లేదో డౌట్, మధ్యలో చుట్టూ అలవాట్లు ఉన్న స్నేహితులు, ఇంచ్ దూరంలో ప్రమాదం ఉండే రోడ్డులు , వీటన్నింటి మధ్యలో నువ్వెలా ఉన్నవో అని బెంగ. సరేలే,  i need to be practical. But, నాకనిపించిందల్లా జంక్ ఫుడ్స్ కాస్త తగ్గించు నాన్నా. మాకు 50 ఇళ్లకు వచ్చే రోగాలు మీ జెనేరేషన్ కి 30 ఏళ్లకే వస్తున్నాయి, నిన్ను చిన్నప్పుడు బయట ఆడుకోనియ్యకుండా , ట్యూషన్ కి పంపినందుకు ఇప్పుడు భయంతో పశ్చాత్తాప పడుతున్నాను. వీలైతే రోజు జిం కి వెళ్ళు, best suggestion is yoga. దానికి మించింది లేదు. వీలైనన్ని గేమ్స్ ఆడు. ఛాన్స్ దొరికితే నడువు. బైక్ కన్నా అదే బెటర్. అసలే ఇవాళ తిండి దగ్గర్నుంచి, పీల్చే గాలి దగ్గర నుంచి, తాగే నీళ్లు దాక అన్నీ కలుషితమే. నీ వాట్సాప్ పిక్ లో ఎంత లావయ్యవో చుస్తే భయం వేసి చెబుతున్నా. నేను చదివిన చరిత్రలో అత్యంత worst hygiene conditions ఉన్న జనరేషన్ లో బ్రతుకుతున్నావ్. అందుకే ఈ జాగ్రత్తలు.

 
ఇదే విషయాన్ని ఫోన్ లో చెప్తే సర్లే నాన్నా అని ఉరుకుంటావ్. అందుకే నా చేతి వ్రాతతో రాసి పంపుతున్నా. ఈ నాన్న చిన్న కోరికని లెక్క చేస్తావని ఆశిస్తూ,
ముద్దులతో,
నీ బాబు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s