అవునా??మీరు తెలుగు భాషాభిమానులా?

 

అనగనగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ . అక్కడ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్లాసులు చెబుతారు . దాంతో అక్కడ చదువుకోవడానికి పెద్ద పెద్ద పిల్లలు , అదే పెద్దింటి పిల్లలు అందరూ వస్తారు . ప్రతి క్లాసు పిల్లలకు బాగా అర్ధం అయ్యే దాకా చెబుతారు . కంప్యూటర్ లో స్లైడ్ వేసి , వీలైతే వీడియోస్ ప్లే చేసి మరి చూపిస్తుంటారు. అలంటి స్కూల్ లో ఒక రోజు ఒక ఘోరం జరిగిపోయింది . ఒక విద్యార్థి అనుకోకుండా పెద్ద  బూతు మాట్లాడాడు . పక్కనే ఉన్న ఫ్రెండ్ ,ఎప్పటి నుండి ఇలాంటి అవకాశం కోసం ఎదురు కాసుకొని ఉన్నాడో ఏమో ? ‘ medum  he is talking  in telugu ‘, అని గట్టిగా అరిచాడు.

మొత్తం మీద కేరళ టీచర్ గారికి కోపం వచ్చింది. క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరిని పిలిచి కూర్చోబెట్టాడు . స్టూడెంట్ ని చెవి పట్టుకుని , అచ్చు మేకని పట్టుకొచ్చినట్టు ఎత్తుకొచ్చాడు . వీపు మీద DTS ఎఫెక్ట్ తో ఒకటి పీకాడు . కోపం తగ్గలే . బయట వెదురు కర్రలు పట్టుకొచ్చి చేతి మీద వాతలు  పడేట్టు  కొట్టాడు . కొట్టే కొట్టుడు కి వెదురు ముక్కలు ఎగిరి ఎగిరి పడుతున్నాయ్. మిగతా స్టూడెంట్స్ అంతా బిక్క చచ్చిపోయి వాడ్ని చూస్తున్నారు. టీచర్ కొడుతూనే ఉన్నాడు. డోంట్ టాక్ ఇన్ తెలుగు అగైన్ . అని వార్నింగ్ ఇచ్చి మరీ వె ల్లిపోయాడు .

 

ఏంటి సార్ చదువుతున్నారు . ఇదేమైనా కథ అనుకుంటున్నారా . వాస్తవం!! మీకు తెలిసి తెలియని కొన్ని వందల లక్షల మంది జీవితం లో చూసిన వాస్తవం . మీకు  చేతకాని బొంగులో standards , maintain చేస్తామని చెప్పే దొంగ స్కూళ్ల అసలు భాగోతం . తెలుగు తల్లి హత్య , ఆత్మ గౌరవ భంగం మొదలయ్యేది ఇక్కడే .

 

ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే ఆ పిల్ల వాడ్ని చూసి మైమరచిపోయి , తెలుగు మీడియం వాళ్ళని ఎండలో నిలబెట్టి ఇంగ్లీషు మీడియం వారిని బంగారు కొండలుగా వేరు చేసి – వివక్షతకు విత్తనం వేసి  , అమెరికా అల్లుడు అని -మా వాడికి తెలుగు చదవడం రాదు అని గొప్పలు చెప్పుకున్న మనం . ఇవాళ కొత్తగా తెలుగు అమ్మా తెలుగు అని సినిమా డైలోగ్స్ చెప్తుంటే , పెద్దోళ్ళు మీకెలా ఉందొ కానీ,  నాకు మాత్రం కనిపించినోడిని కనిపించినట్టు కొట్టాలని ఉంది .

 

ఏమోయిపోతోంది తెలుగు భాష . ఎక్కడికెళ్ళిపోతొంది మన జాతి , లాంటి పోచుకోలు కబుర్లు చెప్పే ముందు.మనం మరిచిపోకూడనిది, మనం చేసి పాపాలు .అవి,  ఒకటా రెండా .

 

మనం ఏ గుడ్డు పెడితే అదే జంతువు పుడుతుంది .

బల్లి గుడ్డు పెట్టి, కోడి రాలేదంటే అలానే అవుతుంది .

కాసేపు మన భాష చచ్చిపోతొంది . కాబట్టి కాపాడతాం ఉద్యమం చేస్తాం . ప్రాణాలు బలిపెడతాం అనే బదులు. అసలు మన జీవితం లోకి ఇంగ్లీషు చొచ్చుకుపోయిన చోట తెలుగు ని ఎలా ఆపాదించుకోవాలో ప్రయత్నించామా అని ప్రశ్నించుకోవాలి . what alternatives we have created ?? మనం ఆలోచించాలసిందే.

సరే తెలుగునే ప్రేమిద్దాం తెలుగునే అభిమానిద్దాం అనుకున్నప్పుడు , తెలుగులో , తెలుగు మీడియం లో చదువుకున్న వాళ్లకు, ఎలాంటి ఉపాధి అవకాశాలు ఈ సమాజం లో దొరుకుతున్నాయి.” తెలుగు మీడియం లో చదువుకోవడం వల్ల  వెనుకబడిపోయాం రా “అని చెప్పుకున్న ఫ్రెండ్స్ ఎంత మందిని చూసాం మనం. మరి దీనికి సమాధానం ఏదీ ?

పోనీ తెలుగు పదాలనే తీసుకుందాం. ఏదైనా ఇంగ్లీషు పాదాలకు తెలుగు పదం కనిపెట్టమంటే , కీ బోర్డు కి ఏమని పెట్టాలి ? అంటే ఒకాయన పద మీట అని , పద లిఖిని అని ఒక వర్గం వారికి మాత్రమే నచ్చిన సంస్కృత పదాలను వాడటం తప్ప . సరైన అనువాద పదాలు తయారు చేసుకుంటున్నామా . తమిళ్ లో బస్సు ని பேருந்து (పోరుందు) అంటే వెళ్ళేది అని, సెల్ఫోన్ ని కై పేసి  ( చేతిలో మాట్లాడేది ) అనే అర్ధం లో సామాన్యమైన పదాలతో కలుపుకుంటే మనం మాత్రం బహు ధుమ శకట వాహనం అని, దూర వాని సందర్శిని అని తొక్కలో ప్రయోగాలు చేస్తున్నాం . ఇక మన తెలుగు మీడియం పుస్తకాల సంగతి చెప్పక్కర్లేదు . అక్కడి సైన్స్ చదువుకున్న వాడు జీవితంలో ఎందుకు పనికి రానిది సైన్స్ అని నిశ్చయించున్నా తప్పేం లేదు .దానికన్నా తమిళం, మలయాళం బట్టీ కొడితే ఉపయోగం చాలా ఉంటుంది. కాదంటారా రండి, చూపిస్తా అందులో ఒక్క పేరా బట్టి కొట్టి చూపించు చూద్దాం.

ఏ భాష అయినా బ్రతకాలంటే , సామాన్యుడు , రచయితా ఇద్దరు పనిచేస్తూనే ఉండాలి . పక్క పక్కనే . ఈయన చెట్టు పైన , ఆయన కొండా పైన కాదు . ఇక్కడ రచయితల పరిస్థితి , కొత్త రచయితల గోల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం .

కానీ మనం అంతా కలిసి ఒక తప్పు చేసి ఎదో ఈ తరం తోనే తెలుగు అంతరించిపోతున్నట్టు వెధవ నాటకాలు అదే వారిని క్షమించే ఉద్దేశ్యం లేక ఈ కబుర్లు చెప్పాల్సి వచ్చింది . సర్లే లైట్ తీసుకుందాం . మరీ హాట్ హాట్ గా డిస్కషన్ అయినట్టుంది . మళ్ళా మాట్లాడుకుందాం .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s