గుడి

ముందుగా గుడిని గురించి గుడి, గుడికున్న స్థానాన్ని గురించి ఓ చిన్న మాట చెప్పుకుందాం. చందమామ చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడటం మనం చూస్తూ ఉంటాం. అలాగే, ఊఉరు మొత్తం అన్ని రకాల భూముల్ని కలుపుకుని మొత్తం భూమి ఎంత ఉంది అని లెక్క కట్టేటప్పుడు కూడా ఊరి గుడికట్టు ఇంత అని తేల్చి చెబుతారు. అలాగే గుణింతాలు చెప్పేటప్పుడుకుగుడిఇస్తేకిఅవుతుంది.మామాటకొస్తే గుణింతాలు కూడా గుడిలోంచే వచ్చింది. ఈ రకంగా పరిశీలించినప్పుడు ఊరు యొక్క , కేంద్రకంగా గుడి ఉంటుందని, గుడి చుట్టూ  గ్రామీణ వ్యవస్థ , అల్లిబిల్లిగా అల్లుకుపోతుందని ఊహించవచ్చు.

ఈ విషయాన్ని పైరకంగా ప్రస్థావించడంలో ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటె గుడి అనేది ఒక ప్రార్ధనా స్థలం మాత్రమే కాదు అని చెప్పడానికి. అంటే గుడి ఒక బడి, ఒక న్యాయస్థానం, ఒక అధ్యాత్మిక కేంద్రం, కళలకు కాణాచి, సాపంప్రదాయ విధ్యలకు పుట్టిన ఇల్లు, ప్రాచీనతకు మూల స్థానం, సామాజిక ఏకీకరణకు కేంద్రం.

                 గుళ్ళు, గోపురాలు గురించి ప్రస్థావనకు వచ్చినప్పుడల్లా, తరచూ మహారాజులు, సంస్థానాధీసులూ, వాళ్ళు కట్టిన నిర్మాణాలు, వాళ్ళు తీర్చిదిద్దిన శిల్పాలు వాటిని గురించి మాత్రమే ప్రస్థావిస్తూ ఉంటాం. కానీ, చరిత్రలోకి చూస్తే అనేక సందర్భాల్లో జనసామాన్యం కూడా గుడి నిర్మాణంలో, నిర్వహణలో పెద్ద ఎత్తున పాల్గొన్నట్ట్లు కనబడుతుంది. సాధారణమైన సనికులు, రైతులు, పేదలు, మహిళలు కూడా, గుడి నిర్వహణలో నిర్మాణంలో పాల్గొన్నారు.

                     కల్నల్ మెకంజీ ప్రతి గ్రామం తాలూకు విశేషాల్ని సేకరించి , అనేక విషయాల్ని పదిలపరిచారు. దాంట్లో ఆనాటి అనేక సామాజికి, చారిత్రక, భాషా పరమైన పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనబడతాయి. ఒక్కొక్క గ్రామం కధని కైఫియత్తుగా పేర్కొంటారు. అలా దాదాపు ప్రతి కైఫియత్తులోనూ , ఆ ఊర్లో ఉన్న గుడి, ఎలా ఏర్పడింది? దాని విశేషాలేంటి, ఆ గుడికి ఆ ఊరి జనానికి ఉన్న అనుబంధం ఏమిటి మొదలైన ఎన్నో అంశాల్ని అది పేర్కుంటుంది. దదాపు అలాంటి డాక్యుమెంటేషన్ మనకి మన ప్రభుత్వాలొచ్చిన తరువాత ఒక్కటి కూడా జరుగలేదు. ముఖ్యంగా, గుడి చుట్టూ అల్లుకున్న జన జీవనాన్ని కైఫియత్తులు ఎంతో ఉదాత్తంగా పేర్కొన్నాయి.

రాయి రాయి పేర్చి ఊరందరూ పాల్గొన్న గుడి నిర్మాణం ఆ ఊరికి గొప్ప ఆత్మశక్తిని ఆత్మ విశ్వాశాన్ని ప్రసాదించింది. ఇది మా గుడి ఈయన మా దేవుడు అనే అనుభూతిని కలిగించింది. దేవుడి కల్యాణోత్సవాలకు ఊరు ఊరంతా ముస్తాబయ్యేది. చుట్టు ప్రక్కల గ్రామాలు బండు మిత్రులందరిని పిలిచుకునే వాళ్ళు. గ్రామోత్సవాల్లో ఆడంబరాలు మరిచి , ఒకరికొకరు భుజం రాసుకుంటూ గొంతెత్తి పరమాత్ముడికి జై కొడుతూ , ఊళ్ళో ఉత్సవాలు జరిగేవి.

                     ఇంత అద్భ్తంగా అటు చరిత్రలోనూ, ఇటు ఇటీవల కాలం దాకా కొనసాగిన ప్రజల భాగస్వామ్యం, నేడు దాదాపు అంతరించిపోయింది. ఉత్సవాలు, ఊరేగింపులు, అన్నీ ప్రభుత్వ కార్యక్రమాల్లాగా రొటీన్ గా జరుగుతున్నాయి. ఎక్కువ మంది ఈ కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి , మళ్ళీ ప్రజల భాగస్వామ్యం మమ్మరంగా ఉండేందుకు చేయడానికి ఈ క్రింది సూచనలు కొన్నింటిని పరిశీలిద్దాం

1) గత ఆరు దశాబ్దాలలో వచ్చిన మార్పులలో ముక్యమైనది , అన్ని వర్గాల వారికి చదువు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే చాలా ఊళ్ళలో భగవద్గీత, విష్ణు సహస్రనామం, మొదలయినవి కూర్చుని భక్తులు, బృందాలుగా ఏర్పడి పారాయణం చేస్తున్నారు. లక్ష్మీ సహస్రనామం, శివ అష్టకం, లక్ష్మీ అష్టకం, మొదలయినవి నిత్యపారాయణం చేయడానికే , వీలుగా, అందులోనూ , స్వామి సన్నిధిలో చెయ్యడానికి వీలుగా ఏర్పాటుచేస్తే , ఎక్కువ మంది భక్తులు సుప్రభాత వేళ్ళల్లో సాయం సమయాల్లో పాల్గొనుటానికి వీలుంటుంది. దీనికి అనుగుణంగా సమయాన్ని కేటాయించగలిగే శిక్షకుల్ని , లక్షల సంఖ్యలో తయారు చేసుకుని ప్రతి గుడిలో , భగవన్నామ పారాయణంలో ప్రతి గుది శ్రవణ సుందరంగా, భక్తి బంధుకంగా తయారుఛెసుకోవచ్చు.

2)   ఇంతక ముందు ప్రతి గ్రామంలో ప్రజలకు భజన కూటములు ఉండేవి. ఈ భజన కూటములు గుళ్ళలో స్వామి ఎదుట , గుడి ముంగిట, గ్రామ మధ్యలో, భజనలు చేసేవారు. భజన కూటంలో ఒకానొక విశేషం ఏమిటంటే , సమాజికి అంతరాలు సమసి పోయి, అందర్ని , ఒక చోటికి చేర్చటానికి వీలవుతుంది. వీటిలో నగర సంకీర్తన మొదలుకుని , పవళింపు సేవ దాకా ఉన్న అనేక ఉత్సవాల్లో బృందాలు బృందాలుగా పాల్గొనటానికి వీలవుతుంది. ప్రాచీన భక్తి సాహిత్యం మాళ్ళా మన మధ్యకు వస్తుంది. ప్రజల మధ్య అరమరికలు తగ్గుతాయి.

3) ఈ మధ్య కాలంలో చాలా దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమాలు ఆరంభమవుతునాయి. నిత్యాన్నదానం లేని చోట కూడా ఏదో ఒక పేరుతో అన్న వితరణ జరుగుతుంది. అలాంటి చోట ముఖ్యంగా, వండేటప్పుడు, వడ్డించేటప్పుడు కూడా సాధారణ జనం పాల్గొనవచ్చు ఉదాహరణకు కూరలు తరగడం దగ్గర్నుంచి వడ్డన వరకు ఉన్న వివిధ దశలలో పాల్గొనుట వలన ప్రతి భక్తుడు పరమాత్మను సందర్శించడానికి వీలవుతుంది.

రామ భక్తుల్లో అగ్రగణ్యుడైన ఆంజనేయుడు, ఉడత చేసిన సాయానికి ముగ్దుడై సిరస్సు వంచి నమస్క్రైంచాడట. అలాంటి మానసిక స్థితి కలగడానికి ఇది దోహదపడుతుంది. మా తోటలో పండిన పంట తప్పకుండా పరమేశ్వరుడికే చెందాలనే భావంతో పూలని సమర్పించేవాళ్ళు. మాలా కైంకర్య ఆచారం ఉండేది. స్వామి కోసం పూలు పళ్ళు పండించి ఇవ్వడం ఒక ఆచారంగా మారటం కష్టమయ్యేది.

దేవాలయాల పునరుద్ధరణలో దేవాలయాలలో మంచి మొదలయిన సదుపాయాలు పెంచటంలోనూ, జనం పాల్గొనటానికి వీలున్నది. ఈ మధ్యకాలంలో ఇంట్లో జరిగే అనేక కార్యక్రమాలు ఫంక్షన్ హాలులో జరుగుత్నాయి. ఉదాహరణకి జాతకర్మ, నామకరణం, షష్టి పూరిత్ మొదలయినవి పరమాత్ముడు కొలువైన కోవెలలో ఆయన సన్నిధిలో ఆయన ప్రత్యక్ష్య పర్యవేక్షణలో జరిగితే మరింత ఉదాత్తంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల్ని మరింత పటిష్టం చేయడం ద్వారా దేవాలయాలు సత్సంప్రదాయానికి అలవాలం అవుతాయి. ఉదాహరణకు మనింట్లో జరిగే వేడుకల్ని మంచి సంప్రదాయికైమయిన వాతావరణంలో సాంప్రదాయ వేషభాషల మధ్య శ్రీచరణ సన్నిధిలో జరగటం గొప్ప విశేషం కదా.

             త్యాగరాజ స్వామి వారు సంగీత ఙ్నానం , భక్తి వినా, సన్మార్గం కలదే మనసా అని భక్తి సంగీతాల ప్రాముఖ్యాన్ని చాటి చెప్పారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు నిర్దిష్ట సమయాలలో దేవాలయాలు వేదికగా కనీసం కొన్నైనా సామూహిక బృంద కీర్తనల్ని నేర్పించవచ్చు.

             తల్లి గర్భంలో పడ్డనాటి నుంచి పుడమి గగ్ర్భంలోకి చేరే దాకా నడిచే జీవన యాత్ర ప్రతి స్థాయిలో నరుడు నారాయణుదు, కలిసి పనిచేయడం భారతీయ ఆర్షసంప్రదాయం. చేను పండినా , ఆవు కోడెను పెట్టినా, ఆడపిల్లకి గుప్పెడు అక్షింతలు నెత్తిన పెట్టినా అన్నింటిలోనూ దైవం —- కోరుతూ, ముందుకు సాగే ఆ సంస్కృతిని కొనసాగిద్దాం. దేవాలయాలు, భక్తి సంపన్నంగా లోక కల్యాంతో విరాజిల్లుతాయి.

-ముక్తేశ్వర రావు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s