అప్పట్లో ఒకడుండేవాడు

సూర్యుడు పొద్దున్న ఉదయించక పోతే మనిషికి వణుకు

వర్షపు చినుకు లేకపోతే మనిషికి వణుకు

అదే ఓ పసివాడు బాల్యాన్ని చవి చూడకపోతే,

అది ఎవడికి కినుకు

//

మనకు పక్కవాడి బూతులు, పెద్ద జాతీయ సమస్యలు

బాల్యాన్ని పోగొట్టుకుని ప్రతి పిల్లవాడి కేకలు, మాములు విషయాలు

ఎక్కడా వినపడని బాల్యపు ఆక్రందనలు,

తుపాకులై పేలితే మళ్లీ మనమే ఇంటా బయటా గోగ్గోలు
ఎం చేస్తాం… FB wall  లో , TV లో చూసి ఊర్కోడం తప్ప.

అదేమైనా కుల, గుల, లేదా సెలెబ్రిటీ స్టేట్మెంట్ కాదు కదా

//

కానీ,

అప్పట్లో ఒకడుండేవాడు

అతడు

కాళ్ళకు కట్టిన వెట్టి సంకెళ్లు తెంచేసాడు

వెట్టి చాకిరీ కి వంగిన వీపును ఎత్తి నిటారుగా నిలబడ్డాడు
కార్పెట్ ఫ్యాక్టరీ లో జరిగిన అరాచకానికి తిరగ బడ్డాడు
//

గన్నుతో కాదు, పెన్నుతో కాదు

గొంతుతో,

వెట్టి వ్యవస్థపై మాటల తూటాలతో

తాను తప్పించుకున్న వెట్టి నుండిి

హమ్మయ్య చాల్లే అనక

ఆ చిన్న వయసులోనే ఉద్యమించాడు

తన పోరాటంతో విడిపించాడు , 3000 పసి చేతులని

//

ప్రపంచానికి వినిపించాడు పసి
గుండెల నొప్పిని,

చేతులు మోసిన భారాల్ని

వీపులు చూసిన ఘోరాలని

//

అదే విషపు వ్యవస్థ పేల్చిన

తూటాతో నేల రాలినా

కాలం తో పాటు

ప్రపంచం మరిచిపోయినా

వెట్టి వ్యవస్థ అంతమైనా

తాను బ్రతికే ఉన్నాడు

ప్రతి పసివాడి స్వాతంత్య్రపు కాంక్షలో
ప్రతి పసి చేతుల పసి కొరికలలో

//

మా దేశంలో బ్యాగుల వెట్టి విముక్తి కై

మళ్ళీ పుడతావు కదూ

(  22 ఏళ్ల క్రితం, వెట్టి చాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి, 3000 మంది పిల్లల్ని విడిపించి, 12 ఏళ్ల వయసులోనే హత్య చేయబడ్డ ఇక్బాల్ మాసి స్మృత్యర్థం  )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s