శ్రీశ్రీ

ఎర్రటి నెత్తురుని నల్లటి అక్షరాలతో మరిగించిన కలం ఎవ్వరిది

విప్లవానికి దేహం ఏది శ్రీ శ్రీ అనే రెండు అక్షరాలు తప్ప

నువ్వు ఎంత అద్రుష్టవంతుడివి శ్రీ శ్రీ

1983 కాబట్టి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీవెళ్ళి పోయావ్

2011 ఐయితే ఛి థూ అనుకుంటూ నురగలు కక్కు కుంతూ వెళ్ళే వాడివి ఈ సమాజాన్ని చూసి

…..

నువ్వు ఎంత అద్రుష్టవంతుడివి శ్రీ శ్రీ

1931 లో మనదీ ఒక బతుకేనా అని అడిగి ఊర్కున్నావు

2011 లోమనదీఒకబతుకేనాఅనిమళ్ళీఅడగాల్సివచ్చినందుకుబాధపదేవాడివి

శ్రీ శ్రీ ………

ఇక్కడ ఇప్పుడు

ఆడదాని హక్కులు గురించి మాట్లాడితే ఫెమినిస్ట్,

పేదవాడి గురించి మట్లాడితే కమ్మ్యునిస్ట్ అని ,

కంట్రీ గురించి మట్లాడితే శాడిస్ట్ అని స్టాంప్లు వేస్తున్నారు

…..

ఇక్కడ బిడ్డ పుడితే మగా ఆడా అని అడుగరు

మనవాడా కాదా అని అడిగే రోజులు ఇవి

….

ఇక్కడి మేధావులంతా మోడర్నిస్ట్లు అంట

కంప్యూటర్లు ముందు కూర్చుని

వాళ్ళ ప్రొగ్రామింగ్ లాంగేజ్ లో వాళ్ళకి సాఫ్ట్ వేర్ లు చేసి పెట్టి

ఒక్క కొత్త యూనివెర్సల్ ప్రొడక్ట్ కూడా కోత్తగా కనిపెట్టని వీళ్ళు

మోదెర్నిస్ట్లు అంట

వేదాలు సుత్తి అంట

తెలుగు భాషా వాదులు బావిలో కప్పలంట

హర్రీ పోట్టర్ గొప్పదే

కాని పేదరాసి పెద్దమ్మ ఎందుకూ పనికి రాదంట

…..

ఐనా వీళ్ళంతా నిన్ను మించి పోయారు శ్రీ శ్రీ

ఏదైనా జరిగితే టివీ ల్లో న్యూస్లు వేస్కోడంలో

సంపాదకీయాలు రాయడంలొ

నాలుగు ఏళ్ళకు ఒక్క సారి

మనకు ఒలింపిక్ మెడల్స్ ఎందుకు రావటం లేదు అని అడగతం లో మాత్రమే

భాషా దినోత్సవం రోజునే , తెలుగు (సంతాప) సభలు చెయ్యడం లో

ఆగస్ట్ 15 న మాత్రమే డ్ేస్ామ్ మాత్లదటం లో

రవీంద్ర భారతి లో యూథ్ ని వీలైతే చిన్న పిల్లల్ని కూద తిట్టి కచ్చి తీర్చుకోదం లో

ఇక్కడ కుక్కని కాలిస్తే రెండు ఏళ్ళు జైలు శిక్ష

రెండు లక్షల మందిని చంపినా రెండు ఏళ్ళు జైలు శిక్ష

కన్నాభిరాన్, బాలగోపాల్, శంకరన్ కన్నా మద్దెలచెరువు సూరి చరిత్ర మనకి ముఖ్యం

తుకారాం ఒంబ్లే , విజయ్ సలాస్కర్ కన్నా కసబ్ లైఫ్ మనకి బాగా తెలుసు

ఇక్కడఇప్పుడుడబ్బుకూడాశాసించదంలేదు

ఎవ్వడికి పట్టిన పైత్యం వాదికి తప్ప

ఎవరి మీడియా పాలసీ వాళ్ళది

రిపుబ్లిక్ ఇండియా లో …….వెర్రి వాళ్ళు…..చెడ్డ వాళ్ళు……ఎవరున్నారు

జనాలు తప్ప

ఏదో ఒక్క రొజు అయినా మళ్ళి వస్తే చెప్పు శ్రీ శ్రీ

పెన్ను కనిపిస్తే నా లాగ కవిత్వం రాయడం

యూథ్ మీద కోపం వస్తీ …… స్పీచ్లు ఇచ్చి ఊర్కోదం

స్త్రైక్ వస్తే కాలేజ్ , ఆఫిస్ లకు బంక్ కొట్టదం

బంద్అంటేపనిమానేయ్యదం

యాసిడ్ దాడి జరిగినప్పుదు మాత్రమే ఆదదాని గురించి అలొచించటం

ఎవరికి కోపం వస్తే వాళ్ళు ఆందోళన చెయ్యదం, బస్లుపగలకొట్టడం

ఇది కాదు విప్లవం

మనలోని చేతకాని తనన్ని ఓడించడమే నిజమైన విప్లవం

ఎందుకంటే

నిజమైనవిప్లవంపనిలోఉంటుందిఆందోళనలోఉందదు

విప్లవం నీకై ఎదురు చూస్తోంది

గున్నుతో కాదు , పెన్ను తో

కొత్త అలొచనలతో , నిజాయతీ నిండిన ఆవెశం తో,

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తొంది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s