పాఠకులు ,ఎక్కడికీ పోలా, మీరే తరిమేశారు

దేవుడి మీద ప్రమాణం చేసి అన్నీ నిజాలే చెబుతాను అబద్ధాలు చెప్పను.
—– మీరు బ్రతకరు – మమ్మల్ని బ్రతకనీరు !!!!!!!!!
ఇవాళ వైరల్ గా వెళ్తున్న ఈ కాలేజీ అనాలసిస్ చాలా బాగుంది. తెలుగు పాఠకులు ఎందుకు తగ్గిపోయారు అని చెబుతూ, టెక్స్ట్ బుక్ లో టైటిల్స్ పెట్టుకుని భలే వివరించారు . వైరల్ అవుతున్న ఈ ఆర్టికల్ గురించి నాకు అనిపించినా కొన్ని విషయాలు ——
బేసిక్ గా తెలుగు భాష ఏమవుతుంది అనే యాదవ డొకోటా నర పుంసక ఏడుపులు తప్ప , అసలు భాషని జీవితంలో ఎలా భాగం చెయ్యాలి. సాహిత్యాన్ని ఒక విడిది గా ,ఒక మైకంలా , ఒక కొత్త లోకంగా ,తెలుగు కమ్మదనాన్ని ఎలా రేపటి తరాలకి అందించాలి అనే ఆలోచన ఎవరూ చేసింది లేదు. చేసిన వాళ్ళని కూడా ఏదోలా తొక్కేయ్యడం తప్ప.
1980 లలో సినిమాలలో వాడిన భాషే (లింగో )ఇంకా చాలా వరకు నేటి రచనలలో ఉన్నాయి. అదేంటి అని అడిగితె, నీకు సాహిత్యం విలువ తెలియదని ఇగో వీరి మోకాలకి.
నాకెప్పుడూ అనిపిస్తుంది

ఇక్కడ నేను చదివే కథలలో నా జీవితం ఎక్కడ , నా కాలేజీ కష్టాలు ఎక్కడ , విద్యార్థుల ఆత్మ హత్యలు ఎక్కడ , మా ఆలోచనలు ఎక్కడ, మా ప్రయోగాలు ఎక్కడ , మా ప్రయత్నాలు ఎక్కడ . ఎంత సేపు ముసలి వాళ్ళ point of view లో రాసి మేము చదవటం లేదని ఏడుస్తారెందుకు.

స్కూళ్లలో పిల్లల చేత బలవంతపు వసూళ్లు ( తెలుగు లో మాట్లాడినందుకు )చేస్తున్నప్పుడు తెలుగు పాఠకుడు ఒకడు తగ్గుతున్నాడనే ప్రశ్న తల్లితండ్రులకు ఎందుకు రావడం లేదు.
తెలుగు లో యువ రచయితలు రావాలని అంటారు. విషయం లేదని అంటారు. అంటే ఏంటో చెప్పమంటే మల్లి పోజు కొడతారు. మరో తరం వారిని ఎలా భావిస్తున్నారు. నూటికి 98 మంది స్పాన్సర్ షిప్ చెయ్యడానికి ముందుకు రారు .
తెలుగు అనువాదమైన హరీ పాటర్, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు , మేలుహా పుస్తకాలూ , వేంపల్లి షరీఫ్ పుస్తకాలూ ఎందుకు అమ్ముడుపోతున్నాయి, మనవి ఎందుకు పోవడం లేదు. శ్రీ శ్రీ పుస్తకం ఇంకా మార్కెట్ లో ఎలా ఉంది. నిన్న గాక మనం రాసిన పుస్తకాలకు దిక్కేందుకు లేదు.
అసలు ప్రపంచం మొత్తం మీద పుస్తకాల అమ్మకం తగ్గింది. కానీ మన దగ్గర మాత్రం చేసిన అతి ఘోరం ఒక తరాన్ని పూర్తిగా తెలుగుకి దూరంగా పెంచడం. మీరు చద ిన ఎదవ పనికి , మళ్ళీ మా మీదకే నింద వేయడం సిగ్గుమాలిన చర్య .
ఎక్కడా లేని విధంగా బాల సాహిత్యం, టీన్ సాహిత్యం, పూర్తిగా ఇగ్నోర్ అవ్వబడటం జనాల్లో తెలుగు పఠనాసక్తి తగ్గడానికి ఒకానొక ముఖ్య కారణం.
అందుకే పెద్దోళ్ళు , చిన్నోళ్లు ముందు మమ్మల్ని అనే ముందు, ఇగో పక్కన పెట్టి ఆలోచించండి.
లేదా బి .పి ., షుగర్ టాబ్లెట్స్ వేసుకుని పడుకోండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s