COLLEGE LIFE

suggested by @Sai Raj Biyakar

కాలం వెనక్కి వస్తే
దేవుడు ఒకటే వరమిస్తే
యవ్వనం తిరిగిచ్చేస్తే
ఒకే ఒక సారి అడుగుతా
నా కాలేజి లైఫ్ నాకిమ్మని

వెళ్లిన మొదటి రోజు పరిచయమైన స్నేహితులు
బస్సుల్లో విన్న సినిమా పాటలు
స్టాపుల్లో ఎదురుచూసిన అందమైన అమ్మాయిలు
మొదటి సారి క్లాసుల్లో పరిచయమవుతున్న ముఖాలు
అన్నీ ఇంకొక సారి మళ్ళీ అనుభవిస్తా

అప్పుడే మొలిచిన మీసాలు, బక్క చిక్కిన కండలు
ఇంటర్ తెచ్చిపెట్టిన కళ్ళజోడ్లు
మొదటి సారి వాడిన నోకియా ఫోన్ లు
మొదటి సంవత్సరం లో డ్రాఫ్టర్లు అన్నీ
మళ్ళొక్క సారి ముట్టుకుని చూస్తా
మొదటి సారి ఫీలింగ్ పుట్టిన అమ్మాయిలతో
మరొక్కసారి జాగ్రత్తగా మాట్లాడతా

క్లాసులో కొట్టిన బంకులు,Hod దగ్గర క్లాసులు
అయినా కాకా పడితే అటెండెన్స్ ఇచ్చే సారులు
బిల్డ్ అప్ కొట్టిన అయ్యోరులు
ఐ డి కార్డులు లాక్కునే ప్రిన్సిపాల్ సారును
ప్రాక్టికల్స్ లో వాళ్ళు పెట్టిన టార్చర్లు
అందరినీ కలిసి
ఒక సారి థాంక్స్ చెప్పుకుంటా

మేం మొదలెట్టిన గ్యాంగ్ గోలలు
కబుర్లు చెప్పే గ్రూప్ స్టడీ లు
అమ్మాయిల ఇళ్లల్లో నైట్ ఔట్ లు
వాళ్ళు రాసిచ్చిన రికార్డులు
ఎక్సామ్ ముందు రోజు ప్రాక్టీసులు
సప్లై ఎక్సామ్ లో దండయాత్రలు
అన్నీ ఇంకా కొత్తే

ఆటోరియం లో మేం చేసిన గోల
ఫంక్షన్ కు ముందు మేం చేసే సందడి
చైర్మైన్ చేసిన డాన్సులు,వచ్చిన సెలబ్రిటీ లు,
అన్నీ మరో సారి అనుభవిస్తా

కిలోమీటర్లు ఎండలో నడిచే ఓపికా
జీవితం గురించి ఆలోచించే తీరికా
తప్పేం చేసినా పోనీ పిల్లాడిని వదిలేసే సౌలభ్యత
అన్నీ ఇచ్చిన ఒకే ఒక కాలం

వెయ్యి కోట్లిస్తా
మళ్ళొక్క సారి ఇవ్వవూ
ఒకే ఒక్క సారి
కనీసం ఫ్రెండ్ తో గొడవ పడిన రోజునైనా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s