అమెరికా పెళ్లి కొడుకు

దివ్య , కిషోర్ గురించి టెన్షన్ పడుతోంది. అసలే వాడో egoist, ఆ పైన మొహం మీద సమాధానం చెబుతాడు.

ఏమవుతుందోనని భయం భయంగా ఎదురు చూస్తోంది. నిన్ననే పెళ్లి చూపులు అయ్యాక, కిషోర్ విషయం చెప్పింది.అయినా అక్కడి సంబంధం ఓకే అయ్యింది.

……………….

కిషోర్ ఇప్పుడు నాన్నను కలవడానికి వస్తున్నాడు.

ఇంటికి దగ్గరలో కిషోర్ ఉండగానే ఫోన్ చేసింది. కిషోర్ ఫోన్ ఎత్తాడు..

” వచ్చావా”

” ఇంటి బయటే ఉన్నా. డాడీ ఉన్నారుగా”

”  హ్మ్. పొద్దున్నే మమ్మీ ని తిట్టారు,నిన్నటినుంచి నాతో అస్సలు మాట్లాడటం లేదు. భయం గా ఉంది రా”

” ఎహ్. ఫోన్ పెట్టెయ్. అంత scene ఏం లేదు. నేను మాట్లాడతా అన్నగా”
ఫోన్ పెట్టేసాడు. 4 ఇయర్స్ లవ్ స్టొరీ. ఇవాళ తేలిపోతుంది. ఏమవుతుందా అని దివ్య కి మాములు టెన్షన్ గా లేదు.
ఇంటికి వచ్చేసాడు. తాను చెప్పినట్టే కాస్త ట్రిమ్ గా రెడీ అయ్యి మరీ. చెల్లెలు విద్య అప్డేట్స్ ఇవ్వడానికి రెడి గా ఉంది. దివ్య బెడ్ రూమ్ లో దేవుడి ఫోటోకి, మహేష్ బాబు ఫోటో కి కలిపి దండం పెట్టుకుంటోంది. విద్య కి ఆ టెన్షన్ చూసి కాస్త బాధ, కాస్త నవ్వు వస్తోంది.
బెల్ కొట్టగానే అమ్మ సుజాత తలుపు తీసింది. వార్ రూమ్ సిద్ధం అయింది. దివ్య డాడీ రమేష్ కుమార్,అమ్మ, కిషోర్ ముగ్గురు కూర్చున్నారు. కాఫీ తాగుతావా అని అడుగుదామని వెనక్కి తగ్గింది సుజాత.
” హ్మ్. So u r kishore”

” Yes i am uncle”

” దివ్య నేను 4 ఇయర్స్ నుండి లవ్ చేసుకుంటున్నాం. ఆ కోర్స్ ఈ మాట నేను ఎప్పుడో చెప్పాలసింది మీకు. బట్ settle అయ్యాక చెప్పడం మంచిదని ఆగాను”

” మీ నాన్న ఏం చేస్తుంటారు.”

” రైల్వే ఎంప్లాయ్ అంకుల్. సీనియర్ ఇంజనీర్ గా చేస్తున్నారు”

” నీ ఇంటి పేరు అనుపల్లి. అంటే మీరు .. లా”

” Fullname కిషోర్ కుమార్ అనుపల్లి. అవును అంకుల్”

సుజాత , కు లోపల ఆనందం గానే ఉంది. సొంత caste వాళ్లే కదా అని. అబ్బాయి ఎందుకో కాస్త నచ్చాడు.
——–

” ఏం ఉద్యోగం చేస్తున్నావు”

” మొన్నటిదాకా, GmR లో జాబ్ చేసాను అంకుల్. ఇప్పుడు సొంతంగా స్టార్ట్ అప్ పెట్టాను. ఇండస్ట్రీలకు కెన్సెప్టు డిజైనింగ్ చేసే కంపెనీ. సో, ..”

” ఓ GMR లో నీకు ఎంత ఇచ్చేవాళ్ళు..”

” 4 లాక్స్ ప్యాకేజీ”

” గుడ్. ఉద్యోగం ఎందుకు చెయ్యకూడదు. సొంత కంపెనీ రిస్క్ కదా”

?????

” ఏ రిస్క్ వద్దనుకుంటే , ఉద్యోగాలు చేయలేము అంకుల్. పల్లీలు అమ్ముతూ ఉండొచ్చు  ”
దివ్యకి గుండెలు అదిరిపోయాయ్. కళ్ళల్లో నీళ్ళు డ్యామ్ రెడీ అయ్యింది. మొత్తం హోప్స్ పోతున్నాయి.

” సచ్చినోడు. మొత్తం చెత్త చెత్త చేస్తున్నాడు ” అని బయటికి అనలేక లోపల అనుకుంటోంది.
ఇక రమేష్ కుమార్ ఒరిజినల్ అవతారం ఎత్తాడు.

” బాబూ. నువ్వు నీ background అన్నీ విన్నాను. కానీ, మా అమ్మాయికి అమెరికా సంబంధం చెయ్యాలని మా కుటుంబం అంతా ఎప్పటినుంచో అనుకుంటున్నాము. లక్కీలి తనకు మంచి సంబంధం కుదిరింది. ”
” అదెలా అవుతుంది అంకుల్. తనకు నచ్చాలి కదా.”

” తను ఇంత పిల్లప్పుడు నుంచి నాకు తెలుసు తనకేం ఇవ్వాలో ఇవ్వకూడదో. But, తాను ఇష్టం అంది కాబట్టి పిలిచి చెబుతున్నా. అంతే.”

కిషోర్ కూడా ఒరిజినల్ కారెక్టర్ లోకి వచ్చాడు.

…………………………….

” అంకుల్. ఒకటి చెప్పండి”

” నన్ను వద్దనడానికి, ఆ అబ్బాయికి ఇవ్వడానికి ఒక్క రీసన్ చెప్పండి.”

” నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఆడిగావ్ కాబట్టి చెప్తా విను. అతను ఐ ఐ టి. చదివాడు. అమెరికాలో మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నాడు. మన దేశానికీ వస్తే ఎంత పద్దతిగా ఉంటాడో తెలుసా. నీలా ఆన్సర్స్ చెప్పడు.”
కిషోర్ కి ఎక్కడో ఫిష్ బుక్ లో మనోడి పార్టీ లైవ్ వీడియో గుర్తొచ్చింది. దివ్య పంపింది ఆ లింక్.

” నెలకు 3 లక్షలు జీతం. గ్రీన్ కార్డు కూడా ఉంది. నువ్వేమో ఉన్న ఉద్యోగం వదిలేశావ్. మెకానికల్ ఇంజినీర్ అంటున్నావు. మీ ఫీల్డ్ లో కన్నా మంచి ఫీల్డ్ లో ఉన్నాడు. మంచి గ్రోత్ ఉంది.  అంత మంచి సంబందం ఎందుకు వదులుకోవాలి. ”
” కరెక్ట్ అంకుల్.  మొత్తం మీద ఎక్కడో ఒకది దగ్గర పని చేస్తున్నాడు. అంతే కదా.”

…………………………………….

మళ్ళీ కాలింది రమేష్ కుమార్ కి. కాబోయే అల్లుడు కోసం యుద్ధం మొదలైయింది.
” ఆ అబ్బాయి 4 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదిస్తాడు. మీ ఫీల్డ్ లో నువ్వు ఎప్పుడు కుదురుకోవాలి. ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలి. మా అమ్మాయికి ఎలాంటి gurantee ఉంటుంది అసలు. నివ్వె చెప్పు”
” చెప్పగలను. 9/11 వచ్చినా, రెసిషన్, వచ్చినా ట్రంప్ వచ్చినా మాకేం ప్రాబ్లెమ్ ఉండదు. ఉద్యోగాల్లోంచి పీకెయ్యరు.
అయినా అదేం పిచ్చి అంకుల్ అందరికీ, అమెరికా అమెరికా అమెరికా,
ఎక్కడో ఒక కంపెనీ కింద డాలర్ జీతాలకు పని చేయడానికే కదా ఆడు వెల్లింది. ఎదో కనీసం రీసెర్చ్ కోసం అన్నా వెళ్లుంటే ఒక లెక్క. దానికేదో అతను గాల్లో ఉడిపడినట్టు అందరూ మాట్లాడతారెందుకు. ఏంటి అక్కడ వాళ్ళ గొప్ప. ?”
” సరే వాడిని కాదని మా అమ్మాయిని నీకిస్తే, అంత కన్నా మంచి లైఫ్ ఉంటుందని guarante ఏంటి. ఒక్క పాయింట్ లో చెప్పు”
” మిరన్నట్టే అందాము. ఒకవేళ వాడికి ఉద్యోగం పోయి, ఏ హోటల్ లో సర్వర్ గా చేస్తూ ఉంటే, ఎవడో వచ్చి  get out of my country అని కాల్చేసి పోతాడు అనుకుందాం. అప్పుడు మీది అమ్మాయి పరిస్థితి ఏంటి. ?”
అదొక బాంబ్ పడిన రూమ్ లా ఉంది. బయటికి పోరా అనేంత కోపం వస్తుంది , కానీ రమేష్ కుమార్ నిశ్శబ్దం గా కొంట్రోల్ చేసుకుంటున్నాడు.
” అంకుల్ ! నాకన్నా తన సంతోషం తెల్సిన వాడ్ని ఇచ్చి చేస్తున్నా అంటే. కనీసం వినడానికైనా బాగుండేది. ఏమైంది అందరికీ. మంచి అమ్మాయి కావాలంటే అమెరికాలోనే ఉద్యోగాలు చెయ్యాలా? ఇండియాలో వాళ్ళంతా adjust అవ్వాలా? ఏమంకుల్ మేం అందరం మీ ముందరే కదా పెరిగాం?
మేమేం చేసాం తప్పు. సాఫ్ట్వేర్ ఒక్కటేనా ఫీల్డ్. ఫ్లిప్ కార్ట్ డెలివరి బిజినెస్ కాదా, షాపింగ్ మాల్స్ బిజినెస్ కాదా, సినిమా బిజినెస్ కాదా, JIO బిజినెస్ కాదా. వీళ్లంతా కోట్లు సంపాదించలేదా. నా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ పిల్లల్లో సాఫ్ట్వేర్ లో మా లైఫ్ బాగుంది అణా వాడిని ఒక్కడిని చెప్పామనండి. ఒక్కడు ఒక్కడిని చెప్పామనండి.”
రమేష్ ఆలోచనలో పడ్డాడు.
” నాది మెకానికల్ ఇంజినీరింగ్ ఏ. కానీ మా అవకాశాలు మాకుంటాయి. మా ఉద్యోగాలు గవర్నమెంట్ నుండి పెద్ద ప్రాజెక్ట్స్ దాకా ఉంటాయి. మా ఫీల్డ్ కూడా మారింది. సరిగ్గా ప్లాన్ చేస్తే 30 ఏళ్ళు బిజినెస్ empire ఎందులో అయినా కట్టుకోవచ్చు. మీకు తెలీదా అంకుల్ మీ ఫ్రెండ్స్ ఎంత మంజి హోటల్, బట్టల షాపులు పెట్టి కోట్లు సంపాదించలేదు.??”
“…….”
అంకుల్ ఒడిపోయేవాడికి ఒకటే తలుపు కనబడుతుంది.

కానీ, గెలిచేవాడికి, వంద కిటికీలు, skrew drivers  కనపడతాయి
నాలో లోపముందంటే చెప్పండి. మార్చుకుంటా. నాకన్నా లవ్ చేసేవాడిని చూపించండి మారిపోతా. అంటే కానీ రోజుకి 1000, 10000 ఉద్యోగాలు పీకేసే సాఫ్ట్వేర్ వాడికిచ్చి చేస్తా. గొప్పలు చెప్పుకుంటా అంటే మాత్రం. నేను వెనక్కి వెళ్ళను.

రమేష్ నోట మాట రావడం లేదు. మళ్ళీ నిశబ్దం. కానీ ఈ సారి, చెక్ మేట్ తానే. దివ్య, ఫేస్ లో ఇంకా కన్ఫ్యూషన్ ఏ”
” నీ నెంబర్ ఇవ్వు”
……. The end.  ………….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s