ONE DAY LOVE STORY

“ఇంకొక్కసారి తనతో ఫ్రీ గా కూర్చుని మాట్లాడాలి” , రవి ఫీలింగ్ అలానే ఉంది. పరిచయమయ్యి 4 రోజులే అయ్యింది. కానీ, ఇదివరకు ఎప్పుడు లేనంత హ్యాపీ గా ఉన్నాడు దీపిక వచ్చాక. అది రాత్రి ఒంటి గంట, టైం.  సెల్ ఫోన్ ఆన్ చేసి దీపికా ప్రొఫైల్ పిక్ చూస్తూ ఉన్నాడు.

వాళ్లిద్దరూ పని చేస్తోంది, ఒక యాడ్ ఏజెన్సీ లో. రవి 5 సంవత్సరాలు గా అదే ఫీల్డ్ లో తిరుగుతూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో పాలుపంచుకున్నాడు. దీపికా కు ఆ ఫీల్డ్ కొత్త, స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ లో చేరింది. ఇద్దరు కలిసి ఒక టూత్ పేస్ట్ కంపెనీ కి యాడ్ ఫిలిం షూటింగ్ లో పాల్గొనడానికి nilagiri Hills కి  వచ్చారు. డైరక్టర్ సంతోష్ శివ, ఇండస్ట్రీ పాపులర్ హీరో సంతోష్ , హీరోయిన్ జెన్నిఫర్ తో షూట్.

పరిచయమైన మొదటి సారి, ఇద్దరు పెద్దగా మాట్లాడుకుంది లేదు. ఒకే కారులో ఇళ్లకు వెళ్లినా దూరంగానే కూర్చుని సైలెంట్ గా ఎవరి సెల్ ఫోన్ లో వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు. షూటింగ్ స్టార్ట్ అయ్యినప్పటి నుండి ఇద్దరికీ స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్. రవి బాగా కష్టపడతాడు. టీం మొత్తానికి దీపికా  బేబీ. అందరు గారం చెయ్యడం. దానికి తగ్గట్టు అన్ని , పనులు చేస్తూ స్క్రిప్ట్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ లెవల్లో పనిచేస్తుంది. అప్పుడప్పుడూ రవి చెప్పే క్రియేటివ్ ఐడియాలు విని అందరూ వావ్ అంటుంటారు, ఒక్క డైరక్టర్ సంతోష్ తప్ప.

ఆ రోజు లాస్ట్ డే షూటింగ్. రవి దీపికా ఇద్దరూ అప్పటిదాకా , ఇద్దరి లవ్ స్టోరీస్, ఇండస్ట్రీ కష్టాలు అన్ని షేర్ చేసుకుని మాట్లాడుకున్నారు. షూటింగ్ లో ఏ అవసరం వచ్చిన ఫస్ట్ దీపికా నే అడిగేవాడు. రేపెళ్లిపోతున్నాం, ఎలాగైనా తనని కలవాలని అనుకున్నాడు రవి. కరెక్ట్ రా రాత్రి 2 గంటల టైం కి వచ్చింది దీపిక తన రూమ్ దగ్గరికి.

మొకం లో కాస్త ఆందోళనగా

” రవి ! డైరక్టర్ సార్. రమ్మన్నారు లాప్ టాప్ మర్చిపోయారంట. తీసుకుని రమ్మన్నాడు ”

“ఎక్కడుండేది “ అని రవి అడగ్గా

” నా దగ్గరే ఉంది ! ఇప్పుడు తీసుకుని వచ్చి ఇమ్మన్నాడు ”

” సోది గాడు “

ఇద్దరికీ తాను ఎందుకు రమ్మన్నాడో అర్ధం అయ్యింది. సరే నే వస్తున్నా అని చెప్పి. ఫోన్ ఛార్జింగ్ నుంచి తీసి బయటికి వచ్చాడు.


డైరక్టర్ రూమ్ గుట్టగా ఉన్న ప్రాంతం పై అర కిలోమీటర్ దూరం లో ఉంది. ఇద్దరూ నడుచుకుంటూ డైరక్టర్ రూమ్ కి వెళ్లి బెల్ కొట్టారు. తలుపు తెరిచిన సంతోష్ అవతారం పిచ్చ కామెడీ గా ఉంది. ఊర పందికి టవల్ చుట్టినట్టు , ఒక టవల్ కట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. పక్కనే రవి ని చూసి సంతోష్కి ఎక్కడో కాలిపోతోంది. “సార్ !ఇదిగో LAPTOP, SHOOT SCRIPT “అని చెప్పి ఇచ్చేసింది. చేసేదేమి లేక ” ఆ సరే ! రేప్పొద్దున్న పాసింగ్ షాట్స్ తియ్యాలి. రెడీ గా ఉండండి ” అని చెప్పి తలుపు గట్టిగా ఏసాడు.

రవి కి , దీపిక కు ఖాళీ  ATM లో డబ్బులు వెంటనే దొరికినంత ఆనందంగా ఉంది. నవ్వుకుంటూ వస్తున్నారు. పక్కనే హీరో రూమ్ ఖాళీగా ఉంటె ఎక్కడా అని, రవి ని  అడిగింది దీపికా. ” పక్క రూమ్ లో ” అని ఆన్సర్ చెప్పాడు. ” hmm ” అని ఒక సారి అనుకుని నడుచుకుంటూ వచ్చేసారు ఇద్దరు.

రవి కి ఫీలింగ్ ఎలానో ఉంది. ఇంత చీకట్లో కూడా తననే హెల్ప్ అడగాలని అనుకుంది దీపిక. మనసులో ఎదో ఫీలింగ్. లవ్ ఐటీ కాదేమో. బట్ గుండె లోపల ఎయిర్ కూలర్ పెట్టినట్టు  సూపర్ గా ఉంది. రాత్రి 2:30 కి చలి భయంకరం గా ఉంది దాదాపు, 12 డిగ్రీల చలి. ఇద్దరూ ఎండాకాలం చొక్కాలేసుకుని తిరుగుతున్నారు.


ఎదురుగా వచ్చిన కో-డైరక్టర్ ని చూసి ఆగారు. జరిగింది చెప్పగా , పడి పడి నవ్వుకున్నారు ముగ్గురూ. ” పాపం వాడికి పార్ట్నర్ దొరకదు లే . Hihhihhhi  ” అనుకుని, ఇప్పుడే వస్తా అని కొండ కింద సిట్టింగ్ సరుకు  కోసం వెళ్ళాడు.

ఇద్దరు షూటింగ్ జరిగిన లొకేషన్ లో ఒంటరిగా రోడ్డు పక్కన కూర్చున్నారు. ప్రొడక్షన్ వాన్, బాయ్స్ ప్యాక్ చేసుకుని అప్పుడే బయలుదేరి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇద్దరే మిగిలారు.

చెట్ల లో నుంచి కిర్  కిర్  సౌండ్ వస్తోంది. అది కొండ ఏరియా. ఎటెళ్లినా లైట్లు దగ్గర తప్ప మొత్తం చీకటి. చుట్టూ  15 కిమీ దాకా ఒక్క బల్లి కూడా తిరగడం లేదు. అసలు వీళ్ళద్దరే ఎదో గ్రహం మీద పడిపోయినట్టు  మిగిలి ఉన్నారు . రూమ్ కి వెల్దామా , లేదా తనతో మాట్లాడదామా అని ఒక సెకండ్ ఆలోచించాడు. తనేం అడ్డు చెప్పట్లేదు. వెళదాం అని కూడా అనట్లేదు.

కాసేపు సైలెంట్ గా సౌండ్స్ వింటూ రోడ్డు మీద కూర్చుని ఉండిపోయారు.


” టైం మరీ స్పీడ్ గా వెళ్ళిపోతుంది కదా “

“యా ! మరీ  షూటింగ్ 4 డేస్ లో అయ్యినట్టే లేదు. ఎదో నిన్ననే వచ్చినట్టు  ఉంది ”

” జెన్నిఫర్ బాగా చేసింది ! ఈ హీరో గాడె expression లేదు కానీ , బిల్డ్ అప్ మాత్రం తెగ కొడ్తన్నాడు.”

” లైట్ అబ్బా! ఆళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. సోది మొకాలు, టార్చెర్ చూపించారు. ఒక్కొక్కళ్ళు”

” మనోడికి మైండ్ లేదు. ఈ టైం లో పిలవడం ఏంటి ?”

” ఆ ! వాట్సాల్ప్ లో కూడా లవ్  సింబల్స్ పంపిస్తున్నాడు ” అని చూపించింది.

నవ్వాగట్లేదు ఇద్దరికీ. ఫుల్ బ్రీజ్ లో ఇద్దరికీ ఆ నవ్వు అడిషినల్ కిక్  గా ఉంది.

రవి అందుకున్నాడు

” మన ఫీల్డ్ లో కామన్ థింగ్స్ ఏ అవి. ఒకళ్లకు ఒకళ్ళు ఓకే  అనుకుని ఎప్పుడు పిలిచినా పర్లేదు . రీసన్ ఉంటుంది. కానీ మరీ,. ఈ టైం లో నీకు ఏ ఇంటరెస్ట్ లేకుండా నిన్ను పిలిచి టార్చెర్ పెట్టకూడదు. ”

దీపికకు రవి చెప్పింది కరెక్ట్ అనాలని ఉంది , కానీ మాట్లాడటం లేదు. తనకు  టాపిక్ నచ్చలేదని వేరే మాట కోసం వెతుక్కుంటున్నాడు రవి . ఇంతలోనే


” అవును నీ సొంత యాడ్ డైరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ ”

” చెయ్యాలి తొందరగా !”

“ఇంకెప్పుడు చేస్తావ్, ముసలోడివి అయిపోతావ్ అబ్బా ”

లేదు ! ఈ ప్రొడక్షన్ అయ్యాక నెక్స్ట్ చేసేది అదే!

“అప్పుడు నన్ను నీ డిపార్ట్మెంట్ లో తీసుకుంటావ్ కదూ !”

” ఎహ్. నువ్వొస్తానంటే నేనొద్దంటానా “ అందామనుకున్నాడు కానీ .

ఆహ్! sure  అబ్బా ! అని అన్నాడు “

” నాకు వచ్చినప్పటినుంచి హిల్ వ్యూ కి వెళదామని ఉంది ”

” నాకు కూడా “ అన్నాడు రవి

“వెల్దామా !” అన్నమాట వచ్చేలోపు  ఇద్దరూ లేచి నడవడం మొదలుపెట్టారు.

” 

చుట్టూ చెట్లు మాత్రమే ఉన్నాయ్.  

దారంతా చీకటి 

భయంకరమైన అడవి 

అయినా నా పక్కన అందమైన అమ్మాయి ఉంది “

అని లోలోపల తిలక్ పద్యాన్ని కామెడీ గా పేరడీ చేసుకుని , నవ్వుకుంటూ వెళ్తున్నాడు.


రవి మొహం లోని వెలుగుని ముందు నుంచి చూస్తున్నా. తెలియనట్టు నడుస్తూ వెళుతోంది దీపిక. రవి ఉన్నట్టుండి దీపిక చెయ్యి పట్టుకున్నాడు. రెండు చేతులు క్లోస్ చేసుకుని నడుస్తుండగా, దీపికా కాసేపు రవి చెయ్యిని వదలకుండా పట్టుకుంది కానీ, మళ్ళీ వదిలించుకుంది. రవి ” అబ్బా ! ఎక్కువ చేసానే ” అని కాస్త జంకాడు.

చాలా మంది పెళ్లయిన జంటలు కూడా అలా తిరిగి ఉండరు ఆ టైం లో అక్కడ. “ఏంటో ఈ రోజు! పొద్దున్న డైరెక్టర్ గాడితో వరస్ట్ డే. ఇప్పుడేమో ఇలా .కానీ కానీ “అనుకుని , ఇద్దరూ సైలెంట్ గా నవ్వుకుంటూ వెళ్తున్నారు.

” అవును ! నీ పెళ్ళెప్పుడు. “

“ఆల్రెడీ చూస్తున్నారు ఇంట్లో. నాకు తెలిసి చేసేస్తారు ఈ సంవత్సరం. ఆ లోపల

“ఆ! ఆ లోపల ఏదైనా పెద్ద బ్యానర్ లో చెయ్యాలి అనుకుంటున్నా “

” చెయ్ ! నేను కూడా గీతా ఆర్ట్స్ లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ని ఒక సారి అడుగుతా .” అన్నాడు.

ఇద్దరు కలిసి హిల్ వ్యూ దగ్గర కూర్చున్నారు.

ఆ టైం లో కొండలు సెక్సీ గా ఉన్నాయి. అక్కడక్కడా వెలుగుతున్న రోడ్ లైట్స్, కింద ఉన్న ఉరి ఇళ్ల నుండి వచ్చిన లైట్స్ తో హాలీవుడ్ సినిమా లో సీన్ లా  ఉంది ఆ వ్యూ. దీపికా కు పెద్దగా అరవాలని ఉంది. కానీ , కంట్రోల్ చేసుకుంది.

ఇద్దరు కలిసి కూర్చున్నారు కొంత దూరం గా. రవి కి బాగా చలి అనిపిస్తుంది. అసలే చలి కాలం. అందులో మళ్లి హిల్ ఏరియా. రవి ని గమనించి పక్కకు వచ్చి దగ్గరగా కూర్చుంది దీపికా. రవి ఎదో మాట్లాడబోతుండగా దీపికా సైలెంట్ గా ఉండమంది. కాసేపు ఓన్లీ చెట్ల శబ్దం, చుట్టూ గాలి శబ్దం. కింద కొండ వ్యూ చూస్తూ  గడిపింది. రవి సెల్ తీసి , నొక్కుతూ పాటలు పెడదామని అనుకున్నాడు.

దీప్తి “సౌండ్ వద్దు , మళ్ళీ ఎవరైనా ఇటు వస్తే బాగోదు అని అంది.” ఒకే అని రవి ఊరుకున్నాడు. జోబీలో ఇయర్ ఫోన్స్ తీసి వింటున్నాడు. దీపికా ఫోన్ లాక్కుని పాట చూసి ” హే ! ఏమన్నావు సాంగ్ కదా. సూపర్ ఉంటుంది. అంది ఇద్దరం విందాం” అని ఒక ఇయర్ ఫోన్ లాక్కుంది.

పక్కనే ఉన్న సెంటర్ పోల్ కి ఆనుకుని ఇద్దరు పాటలు వింటున్నారు. దీపికా అప్పుడే రవి భుజం మీద వాలింది. రవి కి కరెంట్ షాక్ చల్లగా తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి పరిస్థితి. దేవుడా అనుకున్నాడు. ఆ నెక్స్ట్ మాటలు ప్రతి అబ్బాయికి ఎలానో తెలుసు.

దీపికా జుట్టు గాలికి ఆడుతోంది.సిల్కీ హెయిర్. తనవి పెద్ద కళ్ళు, కాస్త పొడవు మనిషి కూడా. దీపు ఉన్నట్టుండి లేవబొతే, రవి లాక్కుని మళ్ళీ భుజం మీద పడుకోమన్నాడు. దీపు , రవి కళ్ళల్లోకి చూసి మల్లి కళ్ళు మూసుకుని తలా వాల్చింది. ఇద్దరికీ తెలుసు లైఫ్ లో అలంటి రోజు వాళ్ళ లైఫ్ లో ఇప్పటిదాకా లేదు.

ఉన్నట్టుండి  దీపు ” నీతో ఉంటే ! అస్సలు ఏ భయం ఉండదు రవి. ఓవర్ చెయ్యవు. ధైర్యంగా అన్ని చెప్పుకోవచ్చు “.

అంత ఎం లేదు లే కానీ . మనకు అయిన ఇంతక ముందు అయిన గోలలకి ఫీలింగ్స్ అన్ని పోయాయి. నాకు జీవితం తెలుసు. లవ్ కు  ,ఫన్ కి ,  డేటింగ్ కి  తేడా తెలుసు.

“హే !మర్చిపోయాం .మనిద్దరిది  ఒక్క సెల్ఫీ కూడా దిగనేలేదు ” అని రవి గుర్తొచ్చి అన్నాడు.

“అవును మనమిద్దరమే దిగలేదు. పొద్దున్న లైటింగ్ రాగానే దిగుదాం ” అంది

” you  know what నా లైఫ్ లో ఒకమ్మాయి నన్ను ఇలా నమ్మి పక్కన ఉంటుంది అనుకోలేదు ”

దీపు ” అర్ధం కాలేదు ” అంది

“ఏం లేదు లే “

అని దీపు తల నిమురుతున్నాడు. దీపు కూడా సన్నగా నవ్వుకుంటోంది.

“మీ ఇంట్లో కుక్క పిల్లని నిమిరినట్టు నిముటున్నావ్. ఉన్నాయా మీ ఇంట్లో ”

” ఆ!!!! నాలుగు “

” నాకు కుక్కలంటే భయం. ”

తెలుసు మొన్న షూటింగ్ గ్యాప్ లో జెన్నిఫర్ తెచ్చిన కుక్క పిల్లని చూసి నీ expressions  ”

“ఏడిసావ్ లే ! ఎదవ “

“అవును రవి !ఇప్పుడు ఒక వేళ ఏదైనా పులి వస్తే ఎలా ఉంటది”.

“మనల్ని చూసి, కుళ్ళు కంపు కొట్టి పారిపోతుంది. “

దీపికా కాస్త బెరుకుగా నవ్వింది. రవి వీపు మీద ఒకటిచ్చింది.

“అబ్బా “

“ఛా! నేనేదో పెద్దగా కొట్టినట్టు ”

పెద్దగా కొట్టలేదా . ఆ చేతులు చూడు! మగ  పిల్లాడి చేతులు “ అని దీపు అరచేతి వేళ్ళు పట్టుకున్నాడు.

ఇద్దరూ ఎందుకో సైలెంట్.  రవి కి దీపు ని ముద్దు పెట్టుకోవాలని ఉంది. కానీ ఏదైనా తేడా కొడితే ఆ హ్యాపీ మూమెంట్ మొత్తం కంపు కంపు అయిపోతుంది. సైలెంట్ గా అనిరుధ్ పాటలు, నుంచి ఇళయరాజా సాంగ్స్ దాకా న్నీ వింటూ , ఇద్దరికీ ఇష్టమైన వీడియోస్ చూస్తున్నారు.

” మళ్ళీ కలుస్తామా ”

” పిచ్చా ! ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతున్నావా ఏంటి ? ఈ ఒక్క షూటింగ్  అయిపొయింది. అంతే కదా.”

“కదా !”

“ఏంటో నబ్బా ! ఇవాళ సూపర్ గా ఉంది కదా  !”

“అవును ” రవి కాస్త చిన్న నవ్వు నవ్వాడు


ఇక వెల్దామనా అని దీపు అంది.

“ఎహె ! కాసేపు ఉండు ”

తన మనస్సులోపల ఉన్న బాధలు అన్ని గుర్తొస్తున్నాయి. ఫామిలీ ఇష్యూస్ ,అన్నీ చెప్పుకున్నారు ఇద్దరూ.

గాలి ఇంకా చల్లగా ఉంది.

టైం తెలియలేదు. 3 గంటలు దాటిపోయాయి అప్పటికే. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్  అవుతున్నా అని గోల మొదలెట్టింది. .చూస్తే  టైం ఐదున్నర నెమ్మదిగా ఒక్కో కొలీగ్ లేచే టైం.

అప్పుడే సూర్యుడు అంచుల్లో ప్రయాణం మొదలు పెట్టాడు. చికెన్ బిర్యాని కూడా కూయడం మొదలుపెట్టింది. ఇద్దరికీ కళ్ళు, కాళ్ళు నిద్ర లేక పీకుతున్నాయి. ఇక బాగోదు అనుకుని రూమ్ కి తిరిగి  ప్రయాణం మొదలుపెట్టారు.

ఇంకో నాలుగు అడుగులు వేస్తే , మెయిన్ రోడ్ వస్తుంది. హిల్ వ్యూ పాయింట్ ఎండ్ అయిపోతుంది.

“సరే మరి ” అని రవి అనబోతుండగా

దీప్తి వెనక్కు తిరిగి

“థాంక్స్ ” అని గట్టిగా వాటేసుకుంది. అలానే ఇద్దరూ ఉండిపోయారు. కాసేపు. రవి కి వరల్డ్ కప్ విన్నింగ్ షాట్ ని  లో చూసినంత ఆనందం. పక్కనే లైట్ గా సూర్యుడు “ఏయ్ మామా ” అని కన్నుకొట్టిన ఫీలింగ్.

ఇక రవి నే వెనక్కి తగ్గాడు. రేపట్నుంచి తనని మర్చిపోవాలని గుర్తొచ్చి. దీపికా  కి ఆనందం కన్నా , మళ్ళీ రవి ని కలవనేమో, బిజీ అయిపోతాడేమో అని లోపల బాధ. ఇద్దరూ బాయ్ భాయి చెప్పుకుని ఎవరి రూమ్ లకు వాళ్ళు వెళ్లిపోయారు.

సాయంత్రం ఎవరి బస్సు ఎక్కి వాళ్ళ ఊర్లకు వెళ్లిపోతుండగా గుర్తొచ్చింది రవికి,

“సెల్ఫీ దిగడం మర్చిపోయాం కదా !” అని. 

లైఫ్ లో వాళ్ళు మళ్ళీ కలుస్తారో లేదో తెలియదు.

రవి ఊరెళ్ళాక కాల్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాడు.

MAY BE …..DATING అంటే ఇదేనేమో అని అనుకున్నాడు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s