ఒక సైనికుడు

ఒంటరిగా మిగిలిపోయానని అనిపించలేదు 

ఇంకా గన్నులో బుల్లెట్లు ఉన్నాయి….

ఎదురుగా శత్రువులు ఉన్నారు..

లెక్క సరిచేసాకే వెళతా 

ఇంటి వైపో , స్వర్గం వైపో  

రెండూ ఒక్కటేగా 

 


 July ,2,1999 – రోజు శుక్రవారం 


అప్పుడే వస్తున్నా IT boom లో కుర్రకారు హాలిడే తీసుకునే టైం . వీకెండ్ పార్టీలు, సిట్టింగులు వెళ్లే టైం. ఆదివారం ఏ సినిమా కెళదాం, మిగిలిపోయిన పనులు ఏవి పూర్తీ చేద్దాం –  అని అందరూ ఆలోచించే రోజు. తనకు మాత్రం అది కీలక సమయం. ఎందుకంటే …

అతనో సైనికుడు. పేరు యొగిందర్ సింగ్ యాదవ్. పెళ్ళయ్యిన  నెల రోజులకే యుద్ధ భూమికి వచ్చినవాడు. నిండా పాతికేళ్ళు నిండని వాడు. ఎలాంటి కఠిన పరిస్థితి నైనా తట్టుకోగలిగిన వాడు.

పరీక్షలు అయిపోయాయని పిల్లలందరూ క్రికెట్టు ఆడుకుంటున్నారు. టివిల ముందు కూర్చుని  మ్యాచ్ లు చూస్తున్నారు.  అతనికి మాత్రం దేశ భద్రతకు, ప్రతిష్టకు పరీక్షని తాను ఒంటరిగా  రాయాల్సిన సమయం. తన లాంటి కొంత మంది మాత్రమే అనుభవించే ఉద్వేగం.

“ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం ” కమాండర్ ఇచ్చిన ఆదేశాలతో , రెండు ఒకటిన్నర రోజుగా జరుగుతున్న ప్రయాణంలో జస్ట్ అలా రిలాక్స్ అవ్వడానికి యొగిందర్ తో పాటు వచ్చిన 28 మంది సైనికులకు ఛాన్స్ దొరికింది. వాళ్ళు వచ్చిన పని , పాకిస్తాన్ చొరబాటులో ఉన్న టైగర్ హిల్స్ ని వశం చేసుకోవడం.  ఈ ఒక్క ఆపరేషన్ సక్సెస్ అయితే పాకిస్తాన్ ని కార్గిల్ యుద్ధం లో ఓటమి వైపు తోసేసినట్టే. కానీ అది అనుకున్నంత తేలిక కాదు అక్కడ. దాదాపు 5000 అడుగుల ఎత్తున్న టైగర్ హిల్ పైన స్థావరం ఏర్పరుచుకున్నారు శత్రువులు.

[ఏ యుద్ధంలో అయినా ఎత్తు ప్రాంతాలలో ఉండే వారి వైపే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. 1- కింద వారిని తొందరగా చూడొచ్చు. 2 – శత్రువు ఎటు వైపు నుండి వచ్చినా భీకర దడి చెయ్యొచ్చు.]

దాడికి భారత సైన్యం ఎంచుకున్న వ్యూహం ఎవ్వరూ ఊహించని మరొక వైపు నుండి కొండ ప్రాంతాన్ని ఎక్కి దాడి చెయ్యడం. ఎక్కడం అంటే మాటలు చెప్పినంత తేలిక కాదు. ఒంట్లోని శక్తి మొత్తం పైకి వచ్చేటప్పటికి హరించుకుపోతుంది. కొండ పైకి ఎక్కుతూ, తాడు ని కట్టి , వెనుకన్న వాళ్లకు దారి కల్పించే బాధ్యత తన నెట్టి పై వేసుకున్నాడు యొగిందర్. నాకే ఎందుకింత అవస్థ అనుకోలేదతను. ” ఇది రా నా దేశానికి ఋణం తీర్చుకునే అవకాశం అనుకున్నాడు.

దారి ఏర్పరుస్తున్న యొగిందర్ కు చిన్న పాటి సమస్య ఒకటి ఎదురయ్యింది. ప్యాంటు జోబిలోని రూపాయి బిళ్ళలు మాటి మాటికీ కదులుతూ చికాకు పెడుతున్నాయి. ” చల్ !విసిరేస్తే పోలా ” అని వాటిని బయటకు తీసాడు. పక్కనున్న ఫాజిల్ భాషా ” ఎందుకు ఊరికినే పారెయ్యడం ” నాకివ్వు అని ఆటపట్టిస్తున్నాడు. వాళ్ళకది సరదానే. నెలరోజుల నుండి వాళ్లిద్దరూ అలా కుళ్ళు జోకులు వేసుకుంటూనే సేద తీరుతున్నారు  “నీకెందుకు ఇవ్వడం. నా దగ్గరే పెట్టుకుంటా” అని. పై జోబులో వేసుకుని, తిరిగి తన పనిలో పడ్డాడు యాదవ్. అది జూన్ 4 వ తారీఖు. రాత్రి అవుతొంది. రెండు రోజుల ప్రయాణం ఇంకా కొన్ని గంటల్లోముగింపు  ,5300 కాస్తా 100 అడుగుల ఎత్తు దాకా వచ్చేసింది.

వెనకాలే వస్తున్న గ్రెనెడియర్ రాకేష్ చంద్ర , ఉన్నట్టుండి పట్టు తప్పి జారిపడబోయాడు. పడబోతున్న అతన్ని కమాండర్  పట్టుకున్నాడు. కానీ ఆ క్రమంలో రాళ్ళ కదలిక తో పెద్ద శబ్దమే వచ్చింది.  పాకిస్తాన్ వారు, అక్కడ రెండు చిన్నపాటి బంకర్ లు ఏర్పరుచుకున్నారు.ఆ విషయం ఇండియన్ ఆర్మీ కు తెలియదు. పైగా చీకటి.  అలికిడి విని వచ్చింది ఇండియన్ ఆర్మీ అనే ఫిక్స్ అయ్యి, కాల్పులు మొదలుపెట్టారు పాకిస్తాన్ సైన్యం . మొట్ట మొదటిసారి , అనుకోని విధంగా యుద్ధం మోదయ్యింది, వారి ఆపరేషన్ లో.

కాల్పులు భీకరంగా వస్తున్నాయి వారి బంకర్ నుండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా లేపేస్తారు పాకీ సైనికులు. వాళ్ళకున్న పెద్ద అడ్వాంటేజ్ ఎత్తైన ప్రాంతం పై ఉండటం. ఆ కాల్పులకు తిరిగి బదులిచ్చే అవకాశం లేక , తాడు పట్టుకుని పైకి రాలేక, 25 మందిలో 18 మంది సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. అంటే రిట్రీట్ అవ్వడం.ముందున్న ఏడుగురు  వెనక్కి పోవడానికి అవకాశం లేదు. ముందుకు పోవడానికి కూడా. అందరి మనస్సులో మొదటి సారి ఆలోచన ఎం చేద్దాం. మిగతా వారితో వెళ్లి , మళ్ళీ వద్దామా. ఉన్న వాడిని మట్టుబెడదామా. ఎం చేద్దాం. పాకిస్తాన్ జిందాబాద్. భారత్ ముర్దాబాద్ అని అరుస్తూ . రెచ్చిపోతున్నారు పాక్ సైనికులు. ఏడుగురికి ఏమి చెయ్యాలో అంతుపట్టడం లేదు.


” మన వైపు 7 గురు మాత్రమే మిగిలారు సార్. ఎటువంటి సహాయం లేకుండా. ఒంటరిగా ..” అన్న మాటకు  

“మనం ఒంటరిగా మిగిలిపోయామని ఎవడన్నాడు . తుపాకుల నిండా బుల్లెట్లు ఉన్నాయి . ఎదురుగా కాల్చోవాల్సినన్ని పందులున్నాయి . లెక్క సరి చేశాకే వెళదాం. ఇంటికో, స్వర్గానికో . రెండూ ఒకటే ” అని సమాధానం ఇచ్చాడు కమాండర్. 

 

వారికి తెలుసు. ఇప్పుడు గనుక వెనక్కు వెళితే కింద ఉన్న వారు కూడా మరణించడం ఖాయం. తేల్చుకోవాలి. నిజమే. కష్టం అనుకున్న వాడు వెనుకకు పోతాడు. ముందుకు రాలేడు. కానీ అవకాశం అనుకున్నవాడు తేల్చుకునే వెళతాడు .  యొగిందర్ ఇతర సైనికుల మనసులో నూతన ఉత్సాహం మొదలయ్యింది.

కమాండర్ అప్రమత్తం చెయ్యడం తో సరైన పొజిషన్స్ కి నిమిషాల్లో రెడీ అయ్యారు. యొగిందర్ కు యుద్ధం కొత్త కాదు. తన వెనుక ఉన్న ఇంటి బాధ్యత కొత్త. ఇక్కడ ఉన్న కుక్కలని చంపితే కానీ తిరిగి ఇంటికెళ్ళలేనేమో అన్న సంకల్పం. రెండూ మెదడులో తిరుగుతున్నాయి. బంకర్ లోని సైనికులు కాల్పులు జరుపుతున్నారే కానీ, రాత్రి అవ్వడం తో ఇండియన్ ఆర్మీ వారు ఎంత మంది ఉన్నారు ఊహించలేకపొతున్నారు. ఎప్పటికప్పుడు పొజిషన్స్ మారుస్తూ కాల్చడం తో అక్కడున్నది 7 గురు కాదు 70 మంది సైనికులు అన్న భయంతోనే పోరాడారు పాకిస్తాన్ బంకర్ లో వాళ్ళు. కాసేపట్లోనే మొదటి గండం దాటింది. బంకర్ నాశనం అయిపోయింది.

యొగిందర్ తో పాటు ఉన్నవారంతా సెలెబ్రేట్ చేసుకుంటుంటే అన్నాడు కమాండర్. ఈ శబ్దాలకు పాకిస్తాన్ ఆర్మీ కి సంకేతం అంది ఉంటుంది . వచ్చిన వారిని వచ్చినట్టు కాల్చేసి ముందుకు వెళ్ళాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అని.

నిజానికి , ఈ మిషన్  కు సంబంధించి ఇంస్ట్రుక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇండియన్ ఇంటెలిజెన్స్ నుండి సరైన సమాచారం ఏది రాలేదు. ” అక్కడ కొన్ని పందులున్నాయి  . కాల్చేయ్యండి ” అని తప్ప.


పైన 40 అడుగుల ఎత్తులో ముఖ్య స్థావరం లోని  పాకిస్తానీ కమాండర్ , కు సమాచారం వచ్చింది.

” దుష్మన్ మన బంకర్ ని నాశనం చేశారు.”

“ఎంత మంది ఉన్నారు ”

“సుమారు. 100 మంది ఉన్నారు.”

“సుమారు కాదు. సరిగ్గా ఎక్కడున్నారు. ఎంత మంది ఉన్నారో చెప్పండి”

“…..”

”   మూడు ట్రూప్స్ ను పంపించండి”

ఆర్డర్ ఇచ్చిందే తడవు. పాకిస్తానీ సైనికులు దాదాపు ముప్పై మంది దాకా బంకర్ ఉన్న ప్రాంతానికి వచ్చారు. వచ్చిన వారిని వచ్చినట్టు కాల్చిపడేయ్యడం మొదలుపెట్టారు భారత సైనికులు. ఒక్క సైనికుడిని కూడా దగ్గరికి దాకా రానివ్వకుండా చంపే పారేస్తున్నారు . ఈ సారి ఎవడి గొంతు నుండి పాకిస్తాన్ జిందాబాద్ అన్న మాట బయటికి అనడానికి  సమయం ఇవ్వడం లేదు యొగిందర్ , కమాండర్ , అండ్ ట్రూప్.

 

కానీ, అక్కడ పాకిస్తాన్ ఎత్తు వేరు, భారత సైనికులు పొజిషన్స్ తెలుసుకుని రావడం. వచ్చిన వారందరు మరణించగా, ఇద్దరు మాత్రం ఎలానో తప్పించుకుని స్థావరం చేరుకున్నారు. ఆర్మీ పొజిషన్స్, లెక్క మొత్తం రిపోర్ట్ చేసారు.

“ఉన్నది మొత్తం ఏడుగురు మాత్రమే సార్ ”

తక్కువ మంది అని తెలిసాక, ఉత్సాహంతో ఒక బ్యాచ్ సైనికులందరనీ ఎంచుకుని మరీ పంపించేశాడు పాకిస్తాన్ కమాండర్. పైనుండి బాంబులు, తుపాకులు , అన్నీ కలిపిన దాడి  మొదలయింది. రాబందుల మందలా  ముంచుకొస్తున్న దళాల్ని చూసి ఆలోచనలో పడింది బృందం. అప్పటికే మూడు రోజులు దాదాపు నిద్ర లేకుండా వచ్చిన భారత బృందం అలసిపోయి ఉంది. ఓపిక కూడగట్టుకుంటూనే ఆలోచనలో పడుతున్న సైనికుల వైపు చూసి కమాండర్ అన్న మాట ఇది. మీ

ముందడుగు వేసాక. వెన్ను చూపించడం. వెనక్కి తిరిగి చూడటం,సైనికుడికి తెలియదు.

బతికితే పది తరాలు తల ఎత్తుకుని చెబుతాయి మన సాహసాన్ని, 

ఒక వేళ చనిపోయినా, రాబోయే దళానికి దారి తేలిక చేసే చనిపోదాం.

పాషా , యొగిందర్ అందరూ నిర్ణయించుకున్నారు. ఎంత మంది వస్తే అంత మందిని లేపేద్దాం. అప్పటికే వారితో తెచ్చుకున్న లైట్ మెషిన్ గన్ శత్రువు బలమైన ఆయుధాల  కాల్పుల్లో దెబ్బతింది. ఉన్న తుపాకుల రేంజ్ తక్కువ. దగ్గరికి వచ్చిన వారిని మాత్రమే చంపగలరు. గ్రెనేడ్ లు, తుపాకులు వాడుతూ వచ్చిన బృందాన్ని మట్టి కురిపిస్తున్నారు భారతీయ సైనికులు.వారి సంఖ్య చాలడం లేదు. అవతల మంది ఎక్కువ మంది ఉన్నారు. ఒకరికి ఒకరు ఎదురు వచ్చేసారు. కానీ .పైనుండి ఇచ్చిన సరైన ఇంస్ట్రుక్షన్స్ తొందరగా భారత సైనికుల్ని కనిపెట్టి చంపడం మొదలుపెట్టారు . యొగిందర్ కు కూడా, ఒంటి లోపలి 13 బుల్లెట్ల దూసుకెళ్లాయి. ఎడమ చెయ్యి, సగం ఊడిపోయింది. మర్మాంగం పక్కన 3 బుల్లెట్లు తగిలాయి. యొగిందర్ కళ్ళు మూసాడు.

కాలి కింద పసుపు ఆరని, తన భార్యకి తన దేహం ఇలా ఇస్తున్నాని కుమిలిపోతూ నేల కొరిగాడు.

 


 

మళ్ళీ కాల్పుల శబ్దం. ఉలిక్కి పడి  లేచాడు యొగిందర్. తాను ఇంకా చావలేదు. కానీ, పాకిస్తాన్ సైనికుల మాటలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క భారతీయుడి మృత దేహం పై తిరిగి ప్రాణం ఉందాలేదా అని చూసి కాలుస్తున్నారు.” ఇన్ని దెబ్బలు తిన్నా నేనెందుకు బ్రతికున్నాను. ఈ నొప్పిని ఎంత సేపు భరించాలి “తలపై, గుండెపై కలిస్తే తప్ప ఇక చావనేమో అని అనుకున్నాడు అతను. యొగిందర్ కాసేపు స్పృహ లేనట్టే ఉన్నాడు. సరిగ్గా కళ్ళు మూసుకున్న సమయానికి ,అతనికి  దగ్గరగా వచ్చి ముఖం మీద ముఖం పెట్టి చూసాడు, పాకిస్తాన్ సైనికుడు. యొగిందర్ కదలలేదు. అతని పొట్టలోకి మళ్ళీ కాల్చాడు. సౌండ్ కూడా చెయ్యలేదు.  ఛాతి మీద కాల్చాడు. యొగిందర్ కు అర్ధం కావడం లేదు. తాను ఇంకా బ్రతికే ఉన్నాడు. పాక్ సైనికుడు అటు తిరిగిపోగానే చూసాడు. మొన్న తానూ దాచుకున్న 5 రూపాయిల బిళ్ళ.దాని మీద బులెట్ ముద్ర. ఇవాళ డబ్బు ఇలా  ప్రాణం కాపాడింది కదా అనుకున్నాడు. అంత నొప్పిలోను విచిత్రమైన నవ్వు ఒకటి నవ్వాడు.

 

” కింద ఉన్న బంకర్ ని కూడా రాకెట్ పెట్టి పేల్చేద్దాం. భారత దేశం ఇక ఈ కొండ వైపు చూడదు ” అన్నాడు అన్న మాటలు వినిపించాయి యొగిందర్ కు . అది విన్న యొగిందర్ సింగ్ కి ఆ క్షణం అర్ధం అయ్యింది. తానెందుకు బ్రతికున్నాడో. నా ప్రాణం ఎలాగూ కాసేపట్లో పోతుంది . కానీ, పోయేలోపు కింద ఉన్న వారందరినీ రక్షించాలి అని నిర్ణయించుకున్నాడు. పక్కనున్న తుపాకీ తీసుకుని ముగ్గురు సైనికుల్ని కాల్చేశాడు. బంకర్ కు అవతల  వైపునున్న సైనికుల్ని దొర్లుతూ తప్పించుకుంటూ దగ్గరకు రాగానే కాల్చి పడేసాడు. పూర్తిగా దెబ్బ తిన్న ఒక కాలు, ఒక చెయ్యి తోనే శక్తి కూడతీసుకుని ఎదురుగా ఉన్న  మరో బంకర్ లోకి గ్రెనేడ్ విసిరేసాడు . ఒకటే దెబ్బలో బంకర్ లోని 4 గురిని అంతం చేసాడు . ఆ ప్రాంతం వరకు ఉన్న శత్రువు లేదు, మిత్రుడు లేదు. బ్రతికున్నది తానొక్కడే

తాను చెయ్యాల్సిన తరువాతి పని గురించి ఆలోచించాడు  యొగిందర్ . తన  వారిలో ప్రాణం ఉన్న వారిని వెనక్కు తీసుకెళ్లడం, కిందకు వెళ్లి వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్యడం. పాకుతూ వెళ్లిన తన స్నేహితులు ఒక్కొక్కరిని కదిలిద్దాం అనుకునే లోపల కన్నీళ్లు వస్తున్నాయి.ఒక్కడన్నా , ఒక్క చిన్న గుండె చప్పుడు విన్పిస్తాడేమోనని ఆశగా వారి దగ్గరికి కదిలాడు.శబ్దం లేకుండా నే , పోయే తన ప్రాణంతో కలిపి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కమాండర్ సార్ కి తల సగం ఊడిపడిపోయింది.  తనను ఆట పట్టించే భాషా , శత్రువు బుల్లెట్ల  పోట్లకు గుండె బయటికి వచ్చి కనపడుతోంది. వేడి బెల్లెట్ మంటకు, మనిషి చర్మం కాలిన వాసన ఆ ప్రాంతం మొత్తం.


గన్ పౌడర్ , మనిషి చర్మం కలిపి వచ్చిన వాసన

ఆ వాసన ఏ దేశం వాడి శరీరం నుండి తనకు కూడా తెలియడం లేదు.

చుట్టూ  శవాలు.

ఎదురుగా ఒక పాక్ సైనికుడి శవం, మీసం కూడా సరిగ్గా రాలేదు. తన వయస్సే ఉంటుంది. చాలా చిన్న వాడిలా కనిపిస్తున్నాడు. కన్ను బయటికి వచ్చి భయంకరంగా కనిపిస్తున్నాడు. తన వారిని వెతుక్కుని వెతుక్కుని ముక్కలయిన దేహాల్ని చూసాడు. ఏడవడానికి కన్నీళ్లు కాదు, ఒంట్లో నుండి కారుతున్న రక్తం కూడా సరిపోవడం లేదు. కర్తవ్యమ్ గుర్తొచ్చింది. ఉన్న కాస్త ఊపిరి,నా దేశం కోసం  వాడాలి. అటు వైపు ఇటు వైపు ఇంత  మంది ప్రాణం తీస్తున్న యుద్ధం ఆగిపోవాలంటే శత్రువుని తొందరగా తరిమెయ్యాలి. వేరే దారి లేదు అని నిర్ణయించుకున్నాడు.

ఎడమ చెయ్యి  కదలడం లేదు. ఊడిపోయింది ఏమో , కోసేద్దాం అనుకున్నాడు. కానీ, చేతి నరాలు పని చేస్తున్నాయి. విరిగిపోయి, సగం తెగిన ఆ చేతిని వీపు  వెనక్కి –  బెల్ట్ తో కట్టి , వచ్చిన దారిలో జారుకుంటూ వెళ్ళిపోయాడు.

మద్యానం రెండు గంటలకు అక్కడి పోస్ట్ వారికి పరిస్థితిని వివరించాడు. పూర్తీ సమాచారం తీసుకున్న తరువాత, కమాండర్ అతనిని మిలిటరీ డాక్టర్ వద్దకు పంపాడు. 36 గంటలు తరువాత లేచిన అతనికి తెలిసింది. టైగర్ హిల్ భారత వశమైందని. ఎదురుగా డాక్టర్, అతని కమాండర్ గుర్తుపట్టావా అని అడిగాడు. తెలియదు అన్నాడు.

హాస్పిటల్ లో మిగతా పేషెంట్స్ అందరినీ ఒక సారి అలా చూసాడు. వారిలాగా , తన ఒంట్లో ఏ భాగం తీసివేయబడ లేదు.

ఇది జరిగే సమయానికి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్. అక్కడి కొంత మంది పేషెంట్స్ దగ్గరి నుంచి, సామాన్యుడి దాకా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు.

తాను కూడా అందరిలానే కాస్త ఆనందపడ్డాడు. ఇండియా మ్యాచ్ గెలిచింది కదా అని.

లోపల అనుకున్నాడు , మన యుద్దాలు కూడా క్రికెట్ బాట్, బాల్ తో ఆడితే ఎంత బావుండేది.

 

 

యోగేందర్ సింగ్ యాదవ్ కు తరువాత పరమ వీర చక్ర అవార్డు లభించింది. 

మిలటరీ నుండి ప్రస్తుతం రిటైర్ అయ్యాడు. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s