LAST BRITISHER

ఆగస్టు 15 1947

భారత దేశం స్వాతంత్ర్య క్షణాలు ఆస్వాదిస్తున్న సమయం. దేశ ప్రజలు మొత్తం ఇళ్లనుండి బయటికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు.
మాములుగా అమాయకులు. అసలే మంచి వాళ్ళు. పైగా భారతీయులు. మొన్నటి దాకా బ్రిటీషర్లు చంపి పడి వేసేంత కోపం ఉన్న వారందరూ ,నేడు వాళ్ళని కలిసి ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్నారు. పిలిచి స్వీట్లు పంచుతున్నారు. ప్రజలతో మంచి గా ఉన్న ఆఫీసర్ లను భుజం మీద ఎత్తుకుని థాంక్స్ చెబుతున్నారు. ఎందుకంటే, ఇక పై వారి పాలన, పీడన ఉండదు కాబట్టి. పెద్ద చదువులు చదువుకుని పెద్ద పొసిషన్స్ లో ఉన్న భారతీయులు వారి ఆంగ్ల మిత్రులకు విందులు, చర్చలు, ఇష్టాగోష్టి ముచ్చట్లు జరువుకుంటున్నారు.

అహో బల రావు, బ్రిటీషర్ L.jackson ford అలానే మాట్లాడుకుంటున్నారు. స్వాతంత్ర్య ఉద్యమం మొదలయ్యినప్పటి నుండి వారిద్దరి మధ్యన పెరిగిపోయిన దూరం ఇంత కాలానికి విశ్రాంతి పొందింది. గుంటూరు కలెక్టర్ గా ఉన్న జాక్సన్ ప్రజలందరి నోటా శత్రువుగా పేరుపోందిన వాడు. ఎక్కడ భారత నినాదాలు విన్నా జనాల్ని జైలులో పడ వెయ్యగలడు. చిన్న పాటి రాస్తా రోకో జరిగినా జనాల్ని చితక్కొట్టించేవాడు. అయినప్పటికీ తన కాలేజి స్నేహితుడైన అహోబలరావు మాత్రం అభిమానం చూపించే వాడు. ఎన్ని సార్లు ఎదురుపడినా, అతన్ని జైలుకు పంపించి మిగతా వారిపై కఠినత్వం చూపించేవాడు. తన దృష్టిలో తన మాతృ దేశం ఇంగ్లాండ్ క్షేమమే ముఖ్యం. వారు నూరిపోసిన దొర-బానిస దృష్టి అతనిలో ఇంకా నిండిపోయి ఉంది. 
ప్రస్తుతం ఇద్దరూ కలెక్టర్ బంగాళా లో కూర్చుని ఉన్నారు. తన పాత స్నేహితుడికి వీడ్కోలు పలకడానికి వచ్చాడు రావు. 

Jackson
: cingrats mr. Rao. You people achieved it finally

Ahobila: కృతఘ్నతలు జాక్సన్. మా దేశాన్ని వదిలి వెళుతున్నందుకు

జాక్సన్
: అర్ధం అవుతుంది. You people are waiting to see me get out of here. As soon as possible

Ahobila
: అయ్యో అదేం లేదు. జాక్సన్ , సారీ జాక్సన్ గారు. 

జాక్సన్ వచ్చి రాని తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. 


జాక్సన్
: చాలు చాలు. అంత రెస్పెక్ట్ వొద్దు. సో, 10 ఇయర్స్ నుండి నీ దేశం కోసం ఏమి ఓ చేయుటివి. ఇప్పుదు, వాట్ ఐస్ త నెక్స్ట్ ప్లాన్.

అహోబిల
: ఏముంది. మళ్ళీ కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి. ఇప్పటి దాకా నాతో కలిసి ఉద్యమం లో పని చేసిన వాళ్ళు సహకారం తీసుకుని. 


జాక్సన్
: Still you are a blind man. నిీకో నిజం చెప్తా.  ఉద్యమం అయ్యేదాకా నే నువ్వు వారి దేవుడివి. అయిపోయాక you are just another one for them.

అహిబిల
: see Mr. జాక్సన్..మా దేశం లో జనాలు నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. 50 ఏళ్ల స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి వారిలో ఇంకా ఉంది.

జాక్సన్
: mr. Rao. I am saying u not as a britisher. As a friend. మా దేశం కూడా ఎన్నో ఉద్యమాలు యుద్ధాలు చూసింది. ఉద్యమం తరువాత అంతా మనతో ఉంటారు అనుకోకు. 

అహిబిల
: సో. నన్నేం చేయమంటారు ఇప్పుడు. మీరు దోచి పడేసిన పేద ప్రజలతో సాయం చెయ్యకుండా , వ్యాపారం చేయమంటారా?

జాక్సన్
: మేము దానికి సరిపడా డెవలప్మెంట్ కూడా చేసాం. ప్రపంచం లో పరిపాలించిన ఏ దేశం కూడా మీ పరిస్థితుల్లో ఉందా. 
రావు దగ్గర సమాధానం ఉంది. కానీ ఎందుకో  చెప్పలేకపోతున్నాడు.


Jackson
: Ok leave it mr. rao. థింక్ వన్స్. Your business skills were so impressive, when you worked for british clothing exports.  Is there anything i can help you in restarting them.


అహోబిల
: ధన్యవాదాలు. Jackson. కానీ, ఒకప్పటిలా నేను బ్రిటీషర్ల కాసుల కోసం వెంటపడలేను. నా దేశపు ప్రజలు బానిసత్వం నుండి బయట పడ్డారు. మా దేశపు ఆలోచనలు, మా దేశపు భావాలు. మా స్వయం శక్తి. 

జాక్సన్
: stop there man. 
ఇద్దరి మధ్యన నిశ్శబ్దం కాసేపటిపాటు నిలబండింది.

జాక్సన్
: నీకు పిలిచి మాట్లాడుతున్నాను అంటే, అది నీతో బిజినెస్ చెయ్యడానికి కాదు.ఇప్పటికైనా మంచి లైఫ్ చూస్తావని. Further స్థాయి కి వెళ్తావని. ఇప్పటికే ఉద్యమం అని చెప్పి, u missed a greక్t career .


అహోబిల
: అంటే. నాకు ఇవన్నీ తెలియవు అంటావు. 

జాక్సన్
: జనం గురించి మరీ ఎక్కువ నమ్మేస్తున్నావు. వీళ్లకు అలవాటైన మా కల్చర్ ని అంత తేలిగ్గా మరిచిపోరు . మా జుట్టు, మా బట్టలు వాళ్ళు కట్టుకోవడం మానేస్తారు అనుకుంటున్నవా??

అహిబిల
: అవును. దశాబ్దాల నుండి ఖద్దరు బట్టలనే ధరిస్తున్నాం. ఇప్పుడు గేటు బయట నిలబడి ఉన్న వారిని చూస్తే తెలియడం లేదా??


జాక్సన్
: అది మీ బ్రమ. నువ్వనుకోవడమే. మహా అంటే ఒక 10 ఏళ్లు పాటిస్తారు. తరువాత

అహోబిల
: తరువాత కూడా

జాక్సన్
: తరువాత మాత్రం, మా బట్టలు ఏసుకుంటారు. Wait to see it man.  ఒక బట్టలే కాదు, మెషిన్ లలో మేము వండే తిండి తినడానికి క్యులలో నిలబడతారు, మా చెప్పులు, మా స్టైల్స్ అన్నీ మా నుండే అరువు తెచ్చుకుంటారు.
అహిబిల శర్మ ఇక లేచి వెళ్లిపోదాం అనుకున్నాడు. కానీ, సరైన సమాధానం ఇవ్వడానికోసం ఎదురు చూస్తున్నాడు. 

అహోబిల
: ఏ నమ్మకంతో అలా చెప్పగలుగుతున్నావ్ జాక్సన్. మా దేశ ప్రజలకు స్వాభిమానం ఉండదనుకుంటున్నావా??? ఇంకా మిరే పరిపాలిస్తున్నారు అనుకుంటున్నావా??

జాక్సన్
: మీకు స్వాభిమానం ఉంది. కానీ, మీ వాళ్ళు ఒట్టి అమాయకులు. 

మీ దేశంలో

తెలివి కలవారు డబ్బుకు లొంగుతారు,

పెద్ద వారు ఇగో satisfy చేస్తే ఏమైనా చేస్తారు

చిన్న తరగతి ఎమోషన్ తో కొడితే పడి ఉంటారు

సమాజం మేలు కోరు వారు చివరికి ఒంటరి అవుతారు

ఈ చిన్న విషయం పట్టుకునే మేం ఇన్ని ఏళ్ళు సంతోషంగా పరిపాలించాం.

 మీరు రాజ్యాంగ స్వాతంత్య్రం ఒక్కటే పొందారు. మా వస్తువులు, ఆలోచనల నుండి కాదు.

అహోబిల
: నువ్వవడోయ్ బోడి మాకు చెప్పడానికి. ఈ బానిస బుద్ది మాకు నేర్పింది మీ దేశమే కాదా. పొట్ట చేత పట్టుకొని…..
జాక్సన్ అతనిని మధ్యలో ఆపాడు. 

జాక్సన్
: మేము మిమ్మల్ని బానిసలు చేయడం మొదలుబపెట్టింది విద్యా వ్యవస్థతో. కొట్టి పిచ్చోళ్ళల్లా పిల్లల్ని కూర్చోబెట్టే వ్యవస్థతో. కానీ, మాకంటే ముందు ఏ బానిస బుద్ది లేకపోతే, 1857 లో మాతో కొందరు ఎందుకు చేతుకు కలిపారు? ఏ బానిస బుద్ధి లేకపోతే మా లంచాలకి మీ రాజులు దేశాన్ని ఎందుకు అమ్ముకున్నారు?? ఒక వ్యాపార కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ఫెవర్స్ కోసం చిన్న రాజ్యాలే ఎందుకు ఇచ్చేసారు.

అహోబల శర్మ ఆలోచనలో పడ్డాడు. 

జాక్సన్
: నువ్వన్నట్టు నీ దేశాన్ని పుర్తిగా పక్కన జపానులా, చైనాలా, స్వయం సమృద్ధి చెయ్యాలంటే ఇప్పటి నుండే మొదలుపెట్టు. మీ దేశీ వ్యాపారం తో డబ్బులు రాబట్టు. కానీ, నేను నీకు చెబుతున్నా ఈ జనం మారరు. ఎంత డబ్బు వచ్చినా మారరు. మేమిచ్చే వాటినే అరుదైన వస్తువులుగా, మా దేశం లో ఉద్యోగం చేస్తే దేవుడిలా చూస్తారు. మీ వాళ్ళు మారరు. లేదా, సంతోషంగా నాకు చెప్పు. లండన్ లో ఏ ఆఫీసుకైనా నేనే మాట్లాడిస్తాను. నా స్నేహితుడివి కాబట్టే ….

అహిబిల: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు జాక్సన్. ఈ దేశం మారుతుంది. ఇక్కడి ప్రజలు మారతారు. మీ దుస్తులు, మీ వాహనాలు, మీ దేశపు తిండి వీటికన్నా ఎక్కువ మా దేశపు ప్రజలు మా స్వ పరిజ్ఞానాన్నే వినియోగిస్తారు. చూస్తూ ఉండు.
సెలవు మిత్రమా.

అహోబల రావు గర్వంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. జాక్సన్ అతన్ని వెనక నుండి చూసి బాధగా నవ్వుతున్నాడు. భవిష్యత్తు ను ఊహించుకుని..

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s