అమ్మాయిలు పనికొస్తారు

” తొందరగా రా”
Inspecter ఇచ్చిన permission తో రాకెట్ స్పీడ్ తో బయటికెళ్లి సిగరెట్ కాల్చుకోవడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ సతీశ్.
పాన్ షాప్ లో కుర్రాడు సతీష్  ని చూడగానే లైట్స్ పేకెట్ లోంచి మూడు సిగరెట్లు తీసి ఇచ్చేసాడు.
ఫ్రీ గా వచ్చిన వాటిని తీసుకున చక్కగాి ఒకటి వెలిగించుకున్నాడు. దమ్ము తరువాత దమ్ము తీసి పిలుస్తుంటే గుర్తొచ్చింది, స్టేషన్ లో టీ సంగతి. అక్కడ్నుంచి టీ కొట్టుకెళ్లి టీ పట్టుకురమ్మని చెప్పి, ధూమపానం కంప్లీట్ చేసి స్టేషన్ కెళ్లాడు.

లోపలంతా హాట్ డిస్కషన్. పొద్దున్నుంచి, జనాల తాకిడిని తట్టుకోలేకపోతున్నారు. నేషనల్ మీడియా, నుండి లోకల్ చానల్స్ వరకు అందరూ ఆ ఊర్లో జరిగిన ఘోర సంఘటనని కోవర్ చేస్తున్నారు.

ఇన్స్పెక్టర్ ప్రసాద్ దేవినేని కు కాళ్ళు చేతులు ఆడటం లేదు. అటు రేపు చేసిన మినిస్టర్ కొడుకుని పట్టుకోలేడు. ఇటు ఉన్న జనాన్ని కొంట్రోల్ చెయ్యలేడు. లోపల వస్తున్న మానవత్వపు కోపాన్ని అణుచుకోలేక మొత్తం స్టేషన్ స్టాఫ్ అందరినీ పచ్చి బూతులు తిడుతున్నాడు.


అప్పుడే న్యూస్ చూస్తున్న రాజేష్ టీవీ పెట్టి పూర్తవుతున్న న్యూస్ హెడ్ లైన్స్ చూస్తున్నాడు. విజయవాడలో మహిళ గ్యాంగ్ రేప్. శరీరం లో …. కోసి వేత, మానవ సంఘాల నిరసన. పాక్ పై భారత్ సంచలన విజయం. మళ్ళీ 3 గంటలకు వార్తల్లో కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ..

న్యూస్ చూస్తున్నంత సేపు, రాజేష్ రక్తం ఉడికిపోతుంది. ఏం అనాలో తెలియడం లేదు. ఎమోషన్ తట్టుకోలేక – వాణ్ణి దొరుకితే ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు.

మళ్ళీ సినిమా న్యూస్ స్టార్ట్ అయ్యింది. ఫోటో లకు న్యూడ్ గా పొజిచ్చిన సన్నీ, రెచ్చిపోయిన హీరోయిన్. చూడగానే కాలిపోతుంది రాజేష్ కి. ఎదో ఒకటి చెయ్యాలి. ఈ సమాజానికి ఎదో ఒకటి చెయ్యాలి.

ఫెస్ బుక్ తీసి స్టేటస్ పెట్టాడు. ఎవరో ఆ అంశం పై పెట్టిన వీడియో ఈ షేర్ చేసాడు. ఇంకా కొంత మంది టైం లైన్ పైన పెట్టిన స్టేటస్ లపై “ఆ ల.. కనబడితే” అని కామెంట్ చేసాడు. కాస్త సమాజ సేవ చేసాడు.

కానీ, అప్పుడు ఆలోచించాడు. ఈ రియాక్షన్ తో ఆ అమ్మాయికి ఏంటి ఉపయోగం. సినిమాలోలా వాడిని ఎత్తుకెళ్ళి ఏదైనా చేస్తే అని ఆలోచించాడు.


మళ్ళీ న్యూస్ స్క్రోలింగ్ స్టార్ట్. ఈ సారికి, ఇన్స్పెక్టర్ తో పాటు , కమిషనర్ కు కూడా వణుకు స్టార్ట్. మినిస్టర్ కొడుకు కనిపించకుండా పోయాడు అని. కమిషనర్ ఒక్కటికి వంద సార్లు అడిగాడు మినిస్టర్ ని.
” సర్. కరెక్ట్ గా చెప్పండి. నిజంగా మీ కొడుకు కనిపించట్లేదా. కరెక్ట్ గా చెప్పండి. జనం మధ్యలో కెళ్తే అతను మీకు దక్కడు. Are you sure” అని అడిగాడు.
” డ్రామాలు దె… మాకా. నువ్వే అరెస్ట్ చేసి చేసి ఉంటావు. నా కొడుకు నాకు దక్కకపోతే, నాలో ఏం చూస్తావో నాకు తెలియదు. ” అని తిక్కగా మాట్లాడుతున్నాడు మినిస్టర్.

కమిషనేర్ కి ఒళ్ళుమండిపోయింది.
” సాయంత్రం లోపు పట్టుకుంటాం సర్”

అని చెప్పి వచ్చేసాడు.
లోపల గొణుక్కుంటు” ఏ ఫామ్ హౌస్ లోనో???”

 


 

స్టేషన్ ఇప్పుడు ఖాళీ గా ఉంది. ఊరు ఊరంతా గొడవ గా ఉంది. అది ఒక అమ్మాయిని రేప్ చేసారని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతొంది. మొత్తం యూత్ బయటికొచ్చేశారు. వారిని ఆపడానికి గస్తీ కి దాదాపు స్టేషన్ మొత్తం ఖాళీ చేసి పంపిస్తున్నారు. టైప్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ ఇద్దరూ, ఎదో పర్స్ దొంగతనం కంప్లైంట్ తీసుకుంటున్నారు. సతీష్ ఇంతలో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
” సార్…” నోట మాట రావడం లేదు అతనికి
హెడ్ కానిస్టేబుల్ అతని ముఖం చూసి, ఏమైందన్నట్టు కన్నెగరేశాడు.
“మొన్న రేవు జరిగిన అమ్మాయి నిషా, చెల్లెలు సీత వచ్చింది సర్. ”
లోపలికి వచ్చి ఉన్న నలుగురు స్టాఫ్ ని చూసింది సీత.
చేతిలో బాగ్ ఉంది.
నరసింహం మర్యాద, జాలి చూపిస్తూ అన్నాడు. “చెప్పమ్మా.”
” మొన్న పెట్టిన అక్క రేపు కేస్ వెనక్కి తీసుకోండి అంకుల్”
ఈపాటికే ఎవరో బెదిరించి ఉంటారు అని అర్థమై
” కుదరదమ్మా. నువ్వు భయపడుతున్నావు. నీకు మొత్తం విజయవాడ అండగా ఉందమ్మా. కేస్ నడవలసిందే”
” లేదు అంకుల్ మీరు తీసుకోవలసిందే. నాకు చాలా భయంగా ఉంది. ”
” నీకు భయం అక్కర్లేదు. సతీష్ టీ పట్టుకురా….చెప్పు నన్న”
” స్టేషన్ లొనే ఉంటానంకుల్. నేనో తప్పు చేశా”
” నికిష్టమొచ్చినంత సేపు ఉండు. ఇన్స్పెక్టర్ సర్ కూడా వస్తాడు. ఎం చేశావ్ అమ్మా నువ్వు ?”

తనతో పాటు తెచ్చిన కర్రల బ్యాగ్ తీసింది. పైన ఉన్న పులా దండలు తీసి టేబుల్ మీద పెట్టింది. అప్పుడే తీసింది బయటికి. చూసిన పోలీసులకి కి వాంతి, పిచ్చి, తల తిరగడం మొదలయింది.

అది ఒక మనిషి తల. కాదు మినిస్టర్ కొడుకు తల. నరికి తీసుకు వచ్చింది. ఎవరి కళ్ళని వాళ్ళు నమ్మలేకపొతున్నారు. అప్పుడే స్టేషన్ లోకి వచ్చిన inspector కి “ఇక నా పోలీస్ కెరీర్ అయిపోయింది “అనుకున్నాడు. మగాడిగా ఆ అమ్మాయిని లోపల అభినందిస్తూనే, బయటికి ఆ అమ్మాయిని ఎలా కాపాడాలి ఆలోచిస్తున్నాడు. మొదటి సారి డ్యూటీ సరిగ్గా చేస్తున్నాడు.

” అంకుల్! నేను చేసింది తప్పే. ఐతే మీ చట్టం-  కాకపోతే ఆ బ్యాచ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు నన్ను చంపేస్తారు. కానీ, ఒక్కే ఒక్క సరి – ఒక్క సాయం చెయ్యండి అంకుల్ “అంది. అమాయకంగా. ఈ మాట అడుగుతుంది ఒక 22 ఏళ్ల అమ్మాయి.

Inspector ప్రసాద్ దేవినేని కి ఎందుకో మొదటి సారి ధైర్యం వచ్చింది. ఎలాగూ తనకు పరువు, ఉద్యోగం పోవడం ఖాయం. కనీసం, ఆ అమ్మాయికి ఎదో ఒక రకంగా సాయం చేస్తే ఇంట్లో తల ఎత్తు కోవచ్చని అనుకున్నాడు.

” చెప్పు నన్న. ఏం చెయ్యమంటావు” 

” ఒక్క సారి! ఫెస్ బుక్ లైవ్ పెట్టుకుంటా”

” అర్ధం కాలేదు. అది నీ సెల్ తో ఎక్కడైనా”

” ఏ పోలీస్ స్టేషన్లో లైవ్ పెడతాను అంకుల్”

” కావాలంటే మీడియా ని పిలవమన్నా పిలుస్తా”

“వొద్దు అంకుల్. అక్క శవం గురించి ఫెస్ బుక్ లో పెడితే కానీ, కవర్ చెయ్యలేదు వాళ్ళు, నేను నమ్మను వాళ్ళని.”


లైవ్ స్టార్ట్ ఐయింది. అమ్మాయి లైవ్ పెట్టగానే ముందు వ్యూస్ వస్తూన్నాయ్. లైక్స్ వస్తున్నాయ్. తానేమీ మాట్లాడటం లేదు.

అబ్బాయిల్లో ఒక అమాయకుడు మొదటి కామెంట్ పెట్టాడు

mFX

. తను. చూస్తున్న వాళ్ళకి  మతి పోయింది. తానేమీ మాట్లాడటం లేదు. ముందు ఫ్రెండ్స్, తరువాత వాళ్ళ ఫ్రెండ్స్, పాపులర్ పేజీలు అందరూ లైవ్ ని షేర్ చేస్తున్నారు. దెబ్బకి మొత్తం ఫెస్ బుక్ లో సగం జనం చూడటం మొదలు పెట్టారు. తనింకా సైలెంట్ గానే ఉంది. ఏం మాట్లాడుతుంది అని ఎదురు చూస్తున్నారు. రాజేష్ తో సహా. 

“ఇప్పుడు మాట్లాడతా” నోరు తెరిచింది తను.

“నా పేరు సీత. మీరు డిస్కస్ చేస్తున్న నిషా చెల్లెలు నేనె”

అందరూ ఉపిర బిగబట్టిి అలానే చూస్తున్నారు. న్యూస్ చానెల్స్ మైండ్ పోయింది.  ఎక్కడుందో కనుక్కుందామని తిరుగుతున్నారు


” ఇది నా ఫస్ట్ ఫెస్ బుక్ లైవ్. తెలీదు లాస్టో కాదో”
” ఇతను మినిస్టర్ కొడుకు, సురేష్ ల. ఇది వాడి తల. గంజాయి బాగా తాగుతాడు. అదే మత్తులో మా అక్కని చంపానని ఒప్పుకున్నాడు. అందుకే చంపేసా”

1

ఒకడి తరువాత ఒకళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు.

2

” పొద్దున్న మమ్మీ పెట్టిన కాఫీ నచ్చలేదు. అందుకే వీడ్ని నరికేసా.”

kFX

” రూల్ ఆ పాడా. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతా. మా అక్క critical care లో ఉంది. తాను బ్రతికొస్తే జాలి, పిచ్చి చూపులు లేకుండా normal లైఫ్ మీరు ఇవ్వగలరా. సరే అంత వొద్దు గాని. ఒకమ్మాయి తనకు వేళ రేప్ జరిగిందని వచ్చి complaint ఇస్తే, తరువాత ఇదే society లో తనకి పెళ్లి జరుగుతుందన్న guarantee ఉందా. అందరిలా బ్రతికే అవకాశం ఉందా. తనకు ఆ ఛాన్స్ లేనప్పుడు వీడికి మాత్రం ఎందుకుండాలి?”

lFX

” ఏ లాజిక్ మీద మా అక్క రేప్ ఐయింది. తానే తప్పు చేసింది ఇప్పుడు ఎందుకు చంపానో కారణం చెప్పాలా నీకు. ”

oFX

ఇంకొక్కడు

nFX

” అదే నేను అడుగుతున్నా. మాకెందుకు ఈ లొల్లి. రేప్ చేసినప్పుడల్లా అందరూ గోల, ఆ తరువాత ఆ అమ్మాయి ఏమయిందో ఎవడికి అక్కర్లేదు. ఆ మాత్రం దానికి మా అక్కని ఎక్కడ ఏం కట్ చేసారో వివరిస్తూ యదవ న్యూస్ లు. అసలు ఈ లొల్లి ఏంటి. మీ అందరికి సామాజిక బాధ్యత ఉందని నేను నమ్మాలా.

వీడిని ఎందుకు చంపానంటారా, వీడో కూలి వాడి కొడుకయ్యుంటే అసలు నాకు భయం లేదు. చట్టం ఉంది. కానీ మినిస్టర్ కొడుకు, ఎలాగైనా ఒప్పిస్తారు, తప్పిస్తారు. ఛాన్స్ ఇవ్వకూడదనుకుంటున్నా. నరికేసా.

నిర్భయ గురించి మాట్లాడి నినాదాలు చేసే దేశం మనదే
హీరోయిన్ న్యూడ్ ఫోటోలు లీక్ ఐతే వాట్సాప్ లో పంపుకునే దేశం మనదే

నేనెందుకు ఎవరినైనా నమ్మాలి. మా బట్టలు బాలేవు. మా తిరుగుళ్లు ఎక్కువయ్యాయి అంటారా. అమెరికాలో, సౌదీలో కూడా బికినిలతో అమ్మాయిలు తిరుగుతారు. రేప్ చేస్తార్రా. చెయ్యరు.

pFX

అరే జఫ్ఫా. అదొక రీసన్ ఆ రా. అది మీ ఇగో problem . వేల సంవత్సరాలు మీరు చేసిన మోసాలు అబద్ధాలు అన్నీ లెక్కపెడితే మాది లెక్కే లేదు. మీ లాగే మాకు కూడా ఛాయిస్ ఉంటాయి. ఉండాలి కూడా. దానికి రేప్ కి లింక్ పెట్టడానికి సిగ్గు లేదు.

” ఫైనల్ గా మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. అమ్మాయిలతో అక్క అక్కర్లేదు, చెల్లి అనక్కర్లేదు. కష్టం వచ్చినప్పుడు కాదు, ముందు అలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు ఎక్కడ ఉన్నా, వాడిని బాగు చెయ్యండి. లేదా ఎగ్గిరి తన్నండి. మాకు క్లాసు పీకేముందు, మేం ధైర్యం గా తిరగగలం అన్న నమ్మకం కలిగించండి. మీరెవరు రేపు మా ఇంటికొచ్చి ఒక రూపాయి తీయరు. ఇలా ఉద్యమాలు ఒకటి రెండు చేసాక మీకే బోర్ కొడుతుంది. ఇదొక్కటే కాదు ,సైకాలజిస్ట్ లునో, పోలీసింగ్ ఓ, పెప్పర్ స్ప్రే నో మిరే ఆలోచించండి. మీ రందరు తెలివితేటలు ఉన్న వారేగా. మా అక్కలా ఇంకొక్క అమ్మాయికి జరగదని నమ్మకం ఇవ్వండి. అది గవర్నమెంట్ ఆ,జనమా నాకు తెలీదు. నా నమ్మకం నాకు ఇవ్వండి.

వచ్చినపుడు చూద్దాం అంటారా
రేపు మీ తల్లికి కూడా ఇలానే అవుతుంది.
చెల్లికి అవుతుంది.
ఒక్కడికి కూడా వాళ్ళు చెప్పుకోలేరు.
చెప్తే బతకనివ్వరు ఆ సమాజం

మారితే మారండి, లేదా మూసుకోండి
అంతే కానీ, మాకు సగం సగం మర్యాదలు వొద్దు.

అసలు ఎవడి సంతాపాలు మాకొద్దు

మేం మాలా ఉంటె చాలు. మేము పక్కలోకి కాదు, బ్రతకడానికి , తలా ఎత్తుకుని తిరగడానికన్నా పనికొస్తాం అనుకుంటే చాలు
ఇంతలో RGV comment పెట్టాడు.

rgv1

rgv2

rgv3

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s