అమ్మ కూచి

ఆఫీస్ వర్క్ పూర్తీ  చేసుకుని అప్పుడే  ఇంటికి వచ్చింది కల్పన. అసలే పొద్దున్న అమ్మ నాన్నతో వాదించి మూడ్ ఆఫ్ లో ఉంది. ఐదేళ్ల కూతురు బుజ్జి సాయంత్రమే స్కూల్ నుండి వచ్చి బయట ఆడుకుని మళ్ళీ ఇంటికొచ్చింది. కల్పన ఇంట్లోకి వచ్చిందే లేట్ , “మామి మామి “అంటూ మీద పడి పీకుతోంది, బుజ్జి.

” మ్మా,………… నూడుల్స్ చేసివ్వు ప్లీస్ ప్లీస్.”

అని చీర పట్టుకుని లాగుతొంది. లాగిపెట్టి ఒకటిచ్చింది కల్పన.

ఏడుపు స్టార్ట్ చేసుకుని “నేను డాడీ కి చెప్తా నూ” అని వెళ్ళిపోయింది బుజ్జి. బుజ్జి అలా ఏడ్చుకుంటూ వెళ్లిపోయేటప్పటికీ, కాస్త చివుక్కుమంది కల్పనకి. కానీ, ఏం చేస్తుంది. పొద్దుననుండి చిరాకు చిరాకు గానే ఉంది. ఫామిలీ టెన్షన్స్ దెబ్బకి ఆఫీసులో పన కూడా సరిగ్గా చెయ్యలేదు. ఒక్క రోజు డల్ అవ్వగానే. టీం హెడ్ over action. ఆఫీస్ వాళ్ళు చేసిన delay కి తననే ఎందుకు తిడుతున్నారని,frustation  – అంతా కలిపి బుజ్జి పై కాస్త చూపించింది.


బెడ్ రూమ్ కి వెళ్లి, మంచం పై బారిన పడుకుని ఏడుస్తోంది బుజ్జి . “డాడీ మమ్మీ కొట్టింది ” అని ఫోన్ లో చెప్తోంది . కూతురికి , భర్తకి కాసేపు పది నిముషాలు సర్ది చెప్తే కానీ మాములు అవ్వలేదు. ” ఎపుడస్తున్నావ్ ? ” అని మురళిని(భర్త ని ) అడిగి , టైం విని ఫోన్ పెట్టేసింది.


” అసలే ఇదో తోకలేని కోతి  , మళ్ళీ వాళ్ళ నాన్న గారాం ఒకటి “. అనుకుని కాసేపు సోఫా మీద పడి TV ఆన్ చేసింది.


ఆ రోజు పొద్దున్న కాల్ నాన్న నుండి

“అమ్మకు ఒంట్లో బాలేదు రా. టైఫాయిడ్ వచ్చింది. అస్సలు ఓపిక ఉండటం లేదు.నువ్వేమైనా వస్తావా ?”

” నాన్నా నా గురించి తెలిసి కూడా అడుగుతావెందుకు? ఆఫీస్ , ఆయన, బుజ్జి ఇవన్నీ లీవ్ అన్న తీసుకోవాలి. లేదా ఉద్యోగం మానెయ్యమంటావా చెప్పు.”

“సరే లే నాన్నా..! ఇదిగో అమ్మ మాట్లాడుతుంది అంట రా

ఇవ్వు “

” నాన్నా…. ఎం చేస్తానా ! “

” బానే ఉన్నా మ్మా “

” ఎమన్నా తిన్నావా “

” తిన్న తిన్నా.. ఉండు ఒక ఐదు నిముషాలు ఆగి కాల్ చేస్తా “

పొద్దున్న మాటలు గుర్తొచ్చాయి.దెబ్బకి మళ్ళీ మూడ్ ఆఫ్ అయ్యింది.అని రాష్ గా మాట్లాడేసి ఫోన్ పెట్టేసింది. అనడం ఐతే అనింది గాని, లోపల అలా మాట్లాడినందుకు ఎక్కడో చిన్న ఫీలింగ్ . 

” మొన్నే పండక్కి కదా వెళ్లివచ్చింది. మళ్ళీ పుట్టింటికెళ్తే , మురళి గొణుగుతూ ఉంటాడు. బుజ్జి స్కూల్ ఇబ్బంది అవుతుంది. అబ్బా ఏం టెన్షన్స్ రా బాబు “అనుకుంది!అదే టెన్షన్ ఆఫీస్ లో, ఇప్పుడు ఇంట్లో. తల నొప్పి పుడుతోంది తనకు. టీవీ ఆన్ చేసి కూర్చుంది. కూర్చుంది అనే కానీ మైండ్ ఇక్కడ లేదు.

స్నానం చెయ్యడానికి లేచి bedroom లో బట్టలు రాక్ ఓపెన్ చేసింది. నైటీ వెతుకుతుంటే, ఒకటి కనిపించింది. అమ్మ కొనిచ్చిన పాత చీర. తలకు ఆనిస్తే మొదటి సారి అమ్మ తనని తల నిమిరడం గుర్తొస్తోంది.” అబ్బా ! ” అనుకుని, అడ్డం ముందు వెళ్లి నిలబడింది. చెవికమ్మలు గుర్తొస్తున్నాయి.


ఒక రోజు . అమ్మ లోపలి అక్కను, తనని పట్టుకెళ్లి రూమ్ లోకి తీసుకెళ్లింది. అమ్మ ఫేస్ ఎంత వెలిగిపోతోందో చెప్పలేం. అంత హ్యాపీ గా అమ్మ ఎప్పుడూ లేదు. చెవి బుట్టలు బంగారువి మా ఇద్దరికీ తీసుకొచ్చింది. తనకు చిన్నప్పటినుంచి కల అంట. అవి కొనుక్కోవడం.

ఇంకా గుర్తు అద్దం ముందు నిలబడినప్పుడల్లా, అమ్మకు సెట్ అవ్వని తెల్ల పొడి మేకప్. అది బాలేదని తాను చేసిన గోల అలా కాసేపు కళ్ళ ముందు తిరుగుతున్నాయి. చిన్నప్పుడు అమ్మ పెద్దదానిలా కనిపించేది , కానీ కల్పన పెద్దదయ్యే కొద్దీ అమ్మ చిన్న పిల్లలా కనిపిస్తోంది.” మా … ” బుజ్జి పిలుపు వినిపిస్తోంది.

అన్నం పెట్టమని.

వెంటనే ” ఇదిగో స్నానం చేసి వచ్చేస్తా అమ్ములు. “

స్నానం చేసి నైటీ వేసుకుని వచ్చేసింది. టవల్ తీసి జుట్టు తడి నిమురుకుంటోంది.  


బుజ్జి పుట్టాక బాగా తెలుస్తోంది వాళ్ళ అమ్మకి ఎంత ఓపికో అని. చిన్నప్పుడు carriage తినకుండా ఇంటికి వస్తే ఎలా కొట్టేదో, పెద్దయ్యాక లేట్ గా లేచినా అంతే గారాం చేసింది. జడలు వేసేటప్పుడు కదిల్తే మాములుగా పడేవి కాదు వైపు మీద వాతలు. బుజ్జికి ఈ దెబ్బలు లేవు, దాన్ని ఏదైనా అంటే అత్తయ్య, మురళి అంతా కలిసి క్లాస్ తీసుకుంటారు.

మాళ్ళీ తనకి (పాపకి ) మాములుగా అన్నం పెట్టడం సరిపోదు. రోజూ ఒక కథ చెప్పాలి.  తనలాగే. ఆమ్మో ఎన్ని చేసింది అమ్మ. ఎం చేస్తాం, రియాలిటీ వేరు కదా. ఉద్యోగం, ఇల్లు, పిల్లలు  టెన్సన్స్ ఇన్ని అడ్డులు. అందుకేనేమో,

చిన్నప్పుడు తను స్కూల్ నుండి కాలేజీ అయ్యే దాకా కూడా ఏదైనా టూర్ కి వెళ్తానంటే,నాన్నతో వాదించి మరీ ” ఆడపిల్ల కదండి , ఇప్పుడు కాకపోతే ఎప్పుడు” అని మరీ పంపించేది. ఆడపిల్ల అన్నందుకు తనకు కోపం వచ్చేది. కానీ , తన మాటలు ఒక్కటొక్కటే ఇప్పుడు అర్ధం అవుతున్నాయి.తనకోసం, తన ముచ్చట్ల కోసం ఏ రోజు ఒక్క రూపాయి దాచుకునేది కాదు . అంతా అక్కకి , తనకి.

ఎప్పుడైనా వర్క్ లో ఎవరి మోసం తెలిసినా, బాగా అలసిపోయినా  అనిపిస్తుంది కల్పనకి

“అమ్మ దగ్గరికి వెళ్లి ఒక్క సారి ఒడిలో పడుకోవాలి. కాసేపు, నేను  కూడా చిన్నతనం లోకి వెళ్లాలని “

సెల్ లో ఫోన్ రింగ్ టోన్ సౌండ్ కి మళ్ళీ మాములు లోకంలోకి వచ్చింది కల్పన. అవతల నాన్న ” నాన్నా అమ్మకు సీరియస్ గా ఉంది. తొందరగా వచ్చెయ్ అని కాల్ ”

గుండెల్లో ఎదో భయం. కొత్త టెన్షన్ కి ఏడుపు కూడా రావడం లేదు. బ్లాంక్ గా ఉంది మైండ్.  మురళి కూడా ఆందోళనగా ఇంటికొచ్చేసాడు. ఇంకా టెన్షన్ పట్టుకుంది. ముగ్గురు కలిసి బస్సు ఎక్కి బయలుదేరారు, కల్పనా సొంత ఊరుకి.

ఇంటికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు ఎవరూ. అమ్మకి ఫోన్ ఇవ్వడం లేదు.

కల్పన కి మాత్రం గుర్తొస్తోంది ఫోన్ పెట్టె ముందు అమ్మ మాటలు

” అన్నం తిన్నావా తల్లి “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s