STORY- చివరి తెలుగు పాఠం

పుంగనూరు పక్కన చౌడేపల్లి గ్రామం, chittor district
విజయవాణి ప్రైవేట్ హై-స్కూల్.

గురు మూర్తి. retired తెలుగు టీచర్. ఇప్పుడు వయస్సు 71 సంవత్సరాలు. వృధాప్యం తో వచ్చిన  తిప్పలతో, అడుగు అడుగుకూ  కష్టపడుతూ నడుస్తున్నాడు. స్కూల్ OLD STUDENTS మీటింగ్ ఆ రోజు. 2003 passed out బాచ్ వాళ్ళు. తమ టీచర్ లు అందరినీ ఎక్కడెక్కడున్నారో స్కూల్ యాజమాన్యం ద్వారా కనుక్కుని స్కూల్ కు అహ్వానించారు . అలాగే గురు మూర్తి కూడా ఆహ్వానించబడ్డాడు. ఇంతక ముందు చాల get together  లు జరిగాయి కానీ వ్యక్తిగత కారణాల వల్ల  వల్ల గురు మూర్తి స్కూలుకు రాలేకపోయారు. రిటైర్ అయ్యి కూడా 11 ఏళ్ళు అవుతొంది. ఈ పదకుండు ఏళ్లలో ఇది 3వ సారి మాత్రమే.

స్కూల్ లోకి ఎంటర్ అవ్వగానే మొట్టమొదట మారిపోయిన స్కూల్ భవంతిని చూసాడు. ఇంతక ముందు ఉన్న ఆఫీస్ రూమ్ పక్కనే నాలుగు అంతస్థుల కొత్త స్కూల్ భవనం కట్టారు.

పాత ఆఫీస్ రూమ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాడు. స్టాఫ్ రూమ్ శిధిలమైపోయి ఉంది. ఆ రూమ్ గోడకి తుప్పుపట్టి విరిగి పోయిన కిటికీ లోంచి చూస్తున్నాడు గురు మూర్తి. లోపలి గది మొత్తం బూజు, రెండు విరిగిపోయిన చెక్క కుర్చీలు, వదిలేసిన ఖాళీ అల్మారాలు, విరిగిపోయిన అద్దాలు కనిపిసున్నాయి.  తన వయసు వాళ్ళు అప్పటికే చాలా మంది చనిపోయారు.తన తోటి టీచర్లు అందరూ తనకన్నా చిన్న వారు కావడం తన అదృష్టం అనుకున్నాడు గురు మూర్తి. కనీసం తోడుగా ఒక్క సారైనా కలుసుకోవడానికి కొంత మంది అన్నా బ్రతుకు ఉంటారు కదా అని ఆశ. ఉన్న జ్ఞాపకాలు, తిరిగిన ప్రదేశాలు, అన్నీ ఇలానే శరీరంలా  శిథిలం అయిపోయి ఉన్నాయి. అక్కడ చదువుకుంటున్న చిన్న పిల్లల్ని చూసాడు. కానీ, అందరివీ కొత్త ముఖాలే. ” నేను టీచర్ అన్న విషయం కూడా మర్చిపోతున్నట్టున్నా ” అనుకున్నాడు.

మళ్ళీ లోకంలోకి వచ్చిన, గురు మూర్తికి వచ్చిన పని  గుర్తొచ్చింది. ముందు వెళ్లి ప్రిన్సిపాల్ ని కలిసి కాసేపు మాట్లాడాడు. మాటలు అయ్యాక,  బయటికి వస్తుంటే కనిపించాడు FORTUNE-R లో దిగిన సైన్స్ టీచర్ కిషోర్(51) , ప్రసుత్తం ఒక ప్రయివేట్ జూనియర్ కాలేజి కి ప్రిన్సిపాల్. 2004 బాగా వీస్తున్న IIT ట్రెండ్ పట్టుకుని బాగా సంపాదించేసుకున్నాడు. కాసేపటికి  ఇంగ్లీష్ టీచర్ రాం చందర్ రావు వచ్చాడు. అంతా మంచి బళ్లలో వచ్చి దిగుతున్నారు. ఎదో జాలిగా పలకరించి, ఒక చూపు చూసి ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెళ్తున్నారు. వచ్చిన బండి లానే బిల్డ్ అప్ సరిపడా ఇస్తున్నారు. ఒక్క సోషల్ మాస్టర్ రెడ్డప్ప తప్ప. కాసేపు పాటు రెడ్డప్పతో కబుర్లలో పడ్డాడు గురు మూర్తి.

“సార్” సౌండ్ విని గురు మూర్తి రెడ్డప్ప ఇద్దరూ తలా తిప్పి చూసారు. కృష్ణ. 2003 బాచ్ స్టూడెంట్ . తన దగ్గర బాగా దెబ్బలు తిన్న స్టూడెంట్. ఇవాళ తనని పట్టుబట్టి మరి రప్పించింది కృష్ణనే. టీచర్ లు ఇద్దరి చెయ్యి పట్టుకుని ” ఒక సారి ఇటు రండి.ప్లీజ్  ” అని తీసుకెళ్లిపోతున్నాడు. ఏదైనా surprise  ఉంటుందేమో అని అనుకున్నాడు గురు మూర్తి. కృష్ణ జస్ట్ నార్మల్ గా తీసుకెళ్లాడు తన బాచ్ బాచ్ వాళ్ళందరి దగ్గరకు. అందరూ పెద్ద వాళ్లైపోయారు ఒక్కొక్క పేరు సగమే గుర్తుకొస్తోంది. తాను పాఠం చెప్పింది, 10000 మంది విధ్యార్ధులకి.
అందరూ ప్రేమగా మాస్టర్ ని పలకరించారు.


సాయంత్రం అయ్యింది. స్కూల్ పిల్లలందరూ వచ్చి గ్రౌండ్ లో స్టేజ్ ముందుకు వచ్చి కూర్చుంటున్నారు.ప్రోగ్రాం స్టార్టింగ్  అయ్యాక, స్టూడెంట్స్ ఒకొక్కళ్ళు వాళ్లకు గుర్తున్న  అనుభవాలు అన్నీ  చెప్తూ వస్తున్నారు. గురు మూర్తిలో ఎదో అసహనం.అందరు టీచర్ లు చెప్పింది, తమకు ఇంజనీరింగ్ లో ఎలా ఉపయోగపడింది అని వివరిస్తూ వస్తున్నారు . ,

“నిజంగా నేను  చెప్పిన తెలుగు వీళ్లకు ఏ విధంగా ఉపయోగపడలేదా  లేదా. నేను టీచర్ గా కేవలం పాస్ మార్కులకు ఉపయోగపడ్డానా “ అని. అసలు ఎందుకొచ్చాను అని తనని తానే లోలోపల తిట్టుకుంటున్నాడు. తాను తప్ప మిగతా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ , మంచి పొజిషన్స్ కి వెళ్లారు. స్కూల్ లో ఉద్యోగం మానేసి, పెద్ద పెద్ద కాలేజీల్లో ఉద్యోగాలు  చేశారు. లక్షలు, లక్షలు సంపాదించారు. తాను, మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు literary programs లో  మర్యాద పొందడం తప్ప, తెలుగు టీచర్ గా నా కెరీర్ నాకు తృప్తికూడా మిగల్చడం లేదు ఏమో. అని బాధపడ్డాడు.

ఇప్పుడు వక్తగా కృష్ణ వంతు వచ్చింది. మైకు తీసుకుని మాట్లాడుతున్నాడు.

అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. ప్రస్తుతం, అమెరికాలో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఇందాకటినుండి ఒకటి చెప్పకుండా ఆపాము.ఇప్పుడు చెప్పేస్తున్నా. మా లైఫ్ లో ఎప్పుడూ మేము మరచిపోలేము ఏమో ”

ఏమంటాడా అని అందరూ వింటున్నారు.

              మేము 10th  చదివేటప్పుడు మా తెలుగు గురు మూర్తిగారు చెప్పేవాళ్ళు . ఆయన అంటే అందరికి కాస్త భయం కానీ అంతకన్నా ఎక్కువ ఇష్టం. కానీ, ఒక రోజు మాత్రం మాకు భయం అంటే ఏమిటో చూపించారు. ఒకానొక పద్యం అప్పచెప్పమంటే మేం ఎవ్వరం నేర్చుకుని రాలేదు. మూడు దొడ్డు  కర్రలు విరిగే దాకా క్లాసులో అందరినీ కొట్టారు. నేను పక్కకు జరిగినప్పుడల్లా , నా పక్కన స్టూడెంట్స్ కి దెబ్బలు పడేవి, దాంతో మళ్ళీ నాకు డబల్ డోసు పడేది.. Next రోజున చదువుకుని రమ్మన్నారు.  భయం తో మళ్ళీ ఆ పద్యం బట్టీ కొట్టుకుని వచ్చాము. టెన్షన్ లో నేను పద్యం సగం చెప్పి మర్చిపోయాను.

క్లాసులో ఉన్న మిగతా మొత్తం అందరం నా పని అయిపోయిందని అనుకున్నారు. గురు మూర్తి మాస్టర్ సైలెంట్ గా వచ్చి ఎదురు నించున్నారు. ఆయన కొట్టలేదు. కానీ ఒక విషయం చెప్పారు .

అరేయ్. మీరిప్పుడు 10th కి వచ్చారు. కొన్ని రోజుల్లో ఫైనల్ ఎక్సామ్స్ రాయబోతున్నారు. మీకు తెలియడం లేదు రా….మళ్ళీ జీవితంలో ఎప్పుడూ తెలుగు చదువు కోవలన్నా మీకు అవకాశం రాదు. మీ అమ్మానాన్నలు మిమ్మల్ని మళ్ళీ ఏ  ఇంజనీర్ గాని, డాక్టర్ గానో, బిజినెస్ పర్సన్ గానో అవ్వడానికి  పంపిస్తారు కానీ తెలుగు లో డిగ్రీ చెయ్యడానికి మాత్రం పంపరు.

రేపు మీరు ఇంటర్ లో జాయిన్ అయ్యాక, తెలుగు అనే ఆప్షన్ మీ అడ్మిషన్ ఫారం లో కూడా ఉండదు. అందుకే ఇంత మొండి గా మీకు ఈ పద్యం, తెలుగు వ్యాకరణలు నేర్పిస్తోంది. మనది ఎలాంటి దేశమో తెలుసా రా 

పిల్లాడికి 6 ఏళ్ళకి twinkle twinkle నేర్పిస్తాం .

12 ఏళ్ళు వచ్చాక తెలుగు లో మాట్లాడితే కొడతాం, fine వేస్తాం.

17 ఏళ్ళొస్తే రాంక్ ఎంతా?

25 ఏళ్ళొస్తే జీతం అంతా , కట్నం ఎంతా అని అడుగుతాం?

కానీ , మనకు 50 ఏళ్ళు దాటాక మాత్రం గుర్తొస్తుంది ఒక్కొక్కడికి , ఏమైపోతుంది తెలుగు. అని 

నేము చెప్పే తెలుగు వల్ల మీకు డబ్బు రాకపోవచ్చు, తెలుగు వాడినని చెప్పుకునే కనీస అర్హత మాత్రం కచ్చితంగా ఉంటుంది. నా కోసం ఈ పద్యం నేర్చుకోండి రా. ప్లీస్.

సార్ మాటలకి మేమంతా అలా జరగదు సార్ , మేము తెలుగు ఇంకా చదువుకుంటాం  అందామని  అనుకున్నాం. నేనైతే ఇంటర్ లోతెలుగు మీడియం చేరదామని ఫిక్స్ అయ్యా. మా నాన్న తన్ని నారాయణ కాలేజ్ లో పడేసాడు. ఆ రోజు నేర్చుకున్న తెలుగే ఇవాళ కూడా అమెరికా లో నా పిల్లలకు చెబుతున్నా.

 

అక్కడున్న టీచర్ లు స్టూడెంట్స్ అందరిలో ఎదో తెలియని ఎమోషన్. సైలెంట్ గా చూస్తున్నారు

మాస్టర్, మీకోసం ఒక surprise. అని తన బాచ్ వాళ్లందరిని పిలిచాడు.

అందరూ కలిసి మైక్ ముందు నుంచున్నారు.

పద్యం పాడటం మొదలుపెట్టారు.

 

అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌
కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌

 

ప్రోగ్రాం అయ్యాక విడుకోలు తీసుకుని వెళ్తున్నాడు గురు మూర్తి , బస్ స్టాండ్ కు. ఇందాక వచ్చినట్టే ఒంటరిగా. పిల్లలు రమ్మన్నా వద్దని వెళిపోయాడు. పక్కన ఉన్న మిగతా టీచర్ల కార్లను లెక్క చేయకుండా.

మనసులో తృప్తి తో వెళ్తున్నాడు.

నేను తెలుగు టీచర్ ని. అని గర్వంగా అనుకుంటూ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s