నరబలి

అర్ధ రాత్రి : 11:30  

గాంధీ హాస్పిటల్ 

హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ బయట కూలీలు 10 మంది నిలబడి ఉన్నారు. వాళ్ళంతా మెట్రో రైల్ నిర్మాణంలో పని చేస్తున్న కూలీలు.  వాళ్ళలో ఒక్కళ్ళైన మల్లేష్ ( 21) , యాదగిరి ( 39) , మల్లమ్మ (31) నిర్మాణం కోసిన కట్టిన కర్రల వంతెన కూలడం తో చావు బ్రతుకుల్లో ఉన్నారు.

అందులో పనిచేసే ఆడ వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. మల్లమ్మ అప్పటికే చనిపోయింది. సంఘటన జరిగాక ఏం చెయ్యాలో తెలియక ఇంజనీర్ దగ్గర్నుంచి ఎవ్వరూ అడ్రస్ లేకుండా పారిపోయారు. అరుపులు విని వచ్చిన కానిస్టేబుల్, కొంత మంది ఆటో డ్రైవర్లు  తప్ప ఇంకెవ్వరూ లేరు.  ఒక మీడియా రిపోర్టర్ మాత్రం న్యూస్ లైవ్ కవరేజ్ చెయ్యడానికి వచ్చాడు. అందరి దగ్గరా బైట్స్ తీసుకుంటున్నాడు.

పొద్దున్న పని కోసం  వేసుకున్న సిమెంటు అంటిన బట్టలతో అలానే నిలబడి చూస్తున్నారు, డాక్టర్ ఏమంటారో అని. వాళ్లలో ఒక్కడైన రవి యాదవ్ కి కడుపు మండిపోతోంది. మేనేజ్మెంట్ వాడు ఎవడైనా  కనిపిస్తే పొడిచి పారేద్దాం అన్న కచ్చి లో ఉన్నాడు. వాల్లందరిలో సీనియర్ అయిన ఒకప్పటి మేస్త్రి  సైదులు ( పెద్ద మేస్త్రి) బాధగా నిలబడి ఉన్నాడు.


రాత్రి : 1 గంట

మల్లేష్ అప్పటికే చనిపోయాడు. కనీసం యాదగిరి ప్రాణాలు అయినా కాపాడమని అక్కడున్న అందరూ ఏడుస్తూ  డాక్టర్ కాళ్ళు పట్టుకుంటున్నారు. డాక్టర్ కి ఎం చెప్పాలో తెలియడం లేదు. యాదగిరి పరిస్థితి ఇంకా క్రిటికల్ గా ఉంది. ఏ క్షణంలో అయినా  మరణ వార్త వినొచ్చు. అప్పుడే వచ్చి దిగారు పోలీస్ ఎస్సై , పక్కనే ప్రాజెక్ట్ ఇంచార్జ్ తోపాటు వచ్చారు.

రవి యాదవ్ కి పరిస్థితి అర్ధం అయిపొయింది. కేసు తప్పించుకోడానికి వచ్చారని . అప్పటికి కొన్ని చానల్స్ వాళ్ళు వచ్చేసారు.

రవి యాదవ్ : ఏం మొకం పెట్టుకొచ్చావ్ రా ల… బాఢకోవ్. నీకు వారం ముందల నుండి చెప్పినా , ఆ కర్రలకు కట్టే తాడు మంచిది కాదు, కర్ర కూడా నాసి రకం తెచ్చినవ్

అంటూ బిల్డర్ ఇంచార్జ్ మీద పడి కొట్టబోయాడు.

పోలీసులు ఆపినా, కూలీలు కంట్రోల్ అవ్వడం లేదు. ఎప్పుడూ జరిగే కథే ఆ రోజు కూడా జరిగింది. నెమ్మదిగా అందరినీ సముదాయించారు. ఇదంతా నిశ్శబ్దంగా చోద్యం చూస్తున్నాడు సైదులు

FIR తీసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

రవి కు తెలుస్తోంది. ఇప్పుడు ఏం జరగబోతోందో

ముందు తన వాళ్ళని చల్లారుస్తారు, FIR తీసుకుని కొన్నాళ్ళు నాటకాలు ఆడి రెండు పక్కలా సెటిల్మెంట్ చేస్తారు. మీడియా వాళ్ళు నెమ్మిదిగా ఇంకొన్ని బైట్లు తీసుకుని వెనక్కి వెళ్లిపోయారు. పొద్దున్న మినిస్టర్ వచ్చే దాకా ఇక ఎవరూ రారు.

కానీ, రవి  బాధ అది కాదు. ముందుగానే వస్తువులు క్వాలిటీ ప్రమాదకరంగా  ఉన్నాయి, అని ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు.  రేపు మళ్ళీ ఇదే జరిగితే ??????ఇప్పుడు తన వాళ్ళ శవాల్ని చేతిలో పెడుతున్నారు. మళ్ళీ పెడతారు. వీళ్లెందుకు వినరు.

ఆలోచనలతో మండిపోతున్న రవి కు మేస్త్రి సైదులు మాటలు విన్పించాయి.


పెద్ద  మేస్త్రి : ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నా

రవి యాదవ్ : మూతి పగుల్తది.  ఇప్పుడు నోరు తెరుస్తున్నవ్. ఇందాక పోలీసులు వచ్చినప్పుడు ఏమి చేసినవ్. ముసలి కొడకా.

పెద్ద మేస్త్రి : అదే చెబుతున్నా. ప్రతి చోట ఇలానే ఎదో ఒకటి జరుగుతుంది.

రవి యాదవ్ : ఏంది జరుగుతుంది. నెత్తి కొట్టుకుని చెప్పినా ఆళ్లకు వినబడలే. ఏమని చెప్తాము. ఎవడికైనా అయినప్పుడు ఇట్ల సెటిల్మెంట్ చేసి  పైసలు మాత్రమే ఇప్పిస్తరు. ఇంతకన్నా మా జాగర్త ల  గురించి ఒక్క లం .. కొ .. అయినా మాట్లాడిండా. ఆ కట్టలు మంచివి లేవని ఎన్ని సార్లు చెప్పాల.

పెద్ద మేస్త్రి : అరే పిచ్చోడా. నీకింకా అర్ధం కావడం లే. నేను చెప్పింది.

పెద్ద మేస్త్రి : మనకు జాగ్రత్తలు తీసుకోవడానికి, డబ్బులెం పెద్ద ఖర్చు అవ్వవు. కానీ , వాళ్ళు వాటిని కావాలని ఏర్పాటు చెయ్యరు

రవి యాదవ్ : ఎందుకు ?????

పెద్ద మేస్త్రి : అదంతే …

పక్కన ఎవ్వరు లేరు. నిశబ్దం ఇంకా భయంకరం గా ఉంది. పక్కన కుక్కల అరుపులు మళ్ళీ యముడు వస్తున్నాడేమో అన్నట్టు భయపెడుతున్నాయి.

పెద్ద మేస్త్రి : ఈ ఉద్యోగం లో చేరి నాకు 35 సంవత్సరాలైంది. అప్పుడు నుండి ఇప్పటిదాకా ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్ పనుల్లో చేశా. కానీ, ప్రతి సారి ఇలానే ఎవరో కొంత మంది చనిపోతారు. తరువాత జాగ్రత్తలు పెంచుతారు.

రవి యాదవ్ : నీకు మతిపోయింది ఏమో. అంటే ఎవరో ఒకళ్ళు పొతే , జాగ్రత్తలు తీసుకుంటారా ??

పెద్ద మేస్త్రి : అదే నీకు చెప్తున్నా. 50 కోట్లు  పెట్టి కాంప్లెక్స్ కట్టేటోళ్లు. కొన్ని లక్షలు మాత్రమే అయ్యే చిన్న చిన్న జాగ్రతలని ఎందుకు తీసుకోరా తెలుసా ?

రవి యాదవ్ , సైలెంట్ గా వింటున్నాడు.

తాత వేరే ఎదో చెప్పబోతున్నాడని అర్ధం అయ్యింది.

పెద్ద మేస్త్రి : ఈ డబ్బున్న వాళ్లలో చాలా మందికి కొన్ని నమ్మకాలున్నాయి.
ప్రతి పెద్ద కట్టడంలో ఎవరో ఒకళ్ళని నరబలి ఇవ్వాలి.

రవి యాదవ్ : (షాక్ తిని ) నరబలా !

పాత మేస్త్రి : అవును రా! పురాతన కాలం నుండి ఉన్న పిచ్చి నమ్మకం ఇది. కోట్లలో నడిచే పని జరుగుతున్నప్పుడు, కనీసం ఒక్కళ్లన్నా ఆ పనిలో ఉన్న వాళ్ళు చచ్చిపోవాలి. ఈ గొప్పోల్లెం చంపరు.  కానీ, అలా జరిగేట్టు చేస్తారు.

రవి యాదవ్ : అలా అనుకుంటే వాళ్ళ మనుషులనే బలి ఇవ్వొచ్చు కదా. కొడుకులు.

పెద్ద మేస్త్రి : ఇవ్వరు . వీళ్ళ మనుషులు కు ఏమి కాకూడదు. అందుకే కావాలని మన వాళ్లే ఎవరైనా చనిపోయేదాకా ఎదురు చూస్తారు. తరువాత నష్ట పరిహారం ఇస్తారు. అందరి నోళ్లు నెమ్మదిగా ముయ్యిస్తారు.

మన సిటీల కొట్టిన ప్రతి ఒక్క  పెద్ద బిల్డింగ్ ల కట్టడంలో ఖచ్చితంగా ఒకళ్ళనా అలా చనిపోయి ఉంటారు.

రవి యాదవ్ : అంత డబ్బుండి. ఈ నమ్మకం ఏందీ తాతా.

పెద్ద మేస్త్రి : ఎం చేస్తాం. ఇంతక ముందు ఇలాంటి సంఘటనల గురించి ఉద్యమాలు కూడా చేసాం. ఎంత ఉద్యమం చేస్తే నాయకుడికి అంత ఎక్కువ డబ్బులు ఇస్తారు. నోరు  ముయ్యిస్తారు. ఒకే ఒక్క సారి నా స్నేహితుడు ఒకడు ఇలానే నరబలి గురించి పేపర్ వాళ్లకు చెప్పాడు. వాడు 22 సంవత్సరాల నుండి కనపడలేదు. బయట జనాలంతా ఆ సంఘటన అజాగ్రత్త , డబ్బు పైత్యం , కక్కుర్తి వాళ్ళ జరిగింది అనుకుంటారు. అసలు నిజం తెలిసిన వాళ్ళు మాత్రం రహస్యం గా చెప్పుకుంటారు.

రవి యాదవ్ : వాడమ్మా. ఏం బ్రతుకు తాతా ఆనిది. వాడు అంత చదువుకుని , ఇదా చేసేటిది.

పెద్ద మేస్త్రి : అలాని పెద్దోళ్ళు అందరూ నమ్మరు. వాళ్లకు తెలియదు కూడా .కానీ , వాళ్ళల్లోనే ఒక్కడు మాత్రం తెలియకుండా అమలు చేస్తాడు. తరువాత వారి పెద్దకు అర్ధం అయ్యేలా వివరిస్తాడు.

రవి యాదవ్ : చల్ నడు . వాడికి అన్నీ ఉండి  మనల్ని ఇంకా చంపుకుతింటాడు . మనం ఏదీ లేక చచ్చిపోతూ, మనోడు చచ్చినా బయటకు చెప్పలేక  బ్రతుకుతాం . నా …….@#$@#$@#$@$@

ఇంతలో మిగిలిన కూలీల నుండి పిలుపు వచ్చింది. మల్లేష్ శరీరం పోస్ట్ మార్టం పూర్తయ్యింది. డెత్  సర్టిఫికెట్ తీసుకోడానికి వెళ్ళిపోయాడు రవి యాదవ్.

రవి యాదవ్ వైపు జాలిగా చూస్తున్నాడు పెద్ద మేస్త్రి . నమ్మకాలకు చదువు అక్కర్లేదు. లొంగిపోయేంత మూర్ఖత్వం ఉంటె చాలు . చేసేదేమి లేక జోబీలో చెయ్యి వేసాడు, గుట్కా ప్యాకెట్ కోసం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s