మొండి : మొదటి చాప్టర్

ఫయాజ్ మంజిల్ 

అది నిజాం కాలం నాటి గెస్ట్ హౌస్. CM క్యాంపు ఆఫీస్ పక్కన ప్రాంతం.  ఇప్పుడు అది  పోలీసు interrogations జరిగే ప్రదేశం.బయట జనానికి అది ఒక బూతు బంగాళా లా కనిపిస్తుంది. కానీ , కరుడు కట్టిన క్రిమినల్స్ ని ఇంటరాగేట్ చెయ్యడానికి సి.బి.ఐ. అదే కేంద్రంగా నిర్వహిస్తుంటుంది. హార్డ్ కోర్ క్రిమినల్ ఎవడు దొరికినా . అక్కడే విచారిస్తుంటారు.

దేశం మొత్తం షాక్  కి గురి చేసిన ఒక వైట్ కాలర్  క్రిమినల్ ని ఇప్పుడు విచారించడానికి వెళ్తున్నాడు సి.బి.ఐ. డైరెక్టర్ సత్యనారాయణ(సత్యం). సిట్యుయేషన్ ఏదైనా అస్సలు వెనక్కి తగ్గడు. పెద్ద  పెద్ద మాఫియా లీడర్లు కూడా టచ్ చెయ్యడానికి జంకుతారు అతన్ని చూసి . అస్సలు రిజల్ట్ రాదనుకున్న కేసుల కల్లా అయన దేవుడై కనిపిస్తాడు గవర్నమెంట్  కి. సత్యం ట్రాక్ రికార్డు లానే, అతని ఇంటరాగేషన్ మెథొద్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి.
FOR EXAMPLE, 2 నెలల క్రితం ఒక ISIS మద్దతుదారుడైన టెర్రరిస్ట్ దొరికాడు. సత్యనారాయణ (సత్యం ) దగ్గరికి ఇంటర్రోగేషన్ కోసం పంపారు. సత్యం ఒక్క దెబ్బ పీకలేదు. ఒక్క మాట అనలేదు. కాసేపు కూర్చుని, మాట్లాడాడు. అయ్యిన తరువాత బిర్యానీ తెప్పించి పెట్టాడు. తింటుంటే మధ్యలో ఎక్కిళ్ళు వచ్చాయి టెర్రరిస్ట్ కి. అంతే సత్యం మైండ్ గేమ్ అదే. అతనికి మంచి నీళ్లు ఇవ్వలేదు. మాములు ఎక్కిళ్లయితే ఆపుకునే వాడు . కానీ, బిర్యానీలో నెయ్యి ఎక్కువ వేసి కలిపి పెట్టడంతో  దాహం ఎక్కువయ్యింది.చచ్చిపోతానేమో అన్నట్టు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. చివరికి ఆ టెర్రరిస్ట్ కి టార్చర్ ఎంత పీక్స్ కెళ్ళిందంటే సత్యం అడిగిన కొన్ని questions కి చచ్చినట్టు సమాధానం చెప్పేదాకా.  చుసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మలేక పోతున్నారు. “బిర్యానీతో కూడా ఇంటరాగేషన్ చేస్తారా ” అని షాక్ తిన్నారు. అది . సత్యనారాయణ స్టైల్.
ఛాంబర్  నుంచి బయలుదేరి ఫయాజ్ మంజిల్ కి కేస్ డీటెయిల్స్  , క్రిమినల్ రికార్డ్స్ పట్టుకెళ్ళాడు. ఇంటరాగేషన్ 2వ కేబిన్ రూమ్ లో. టైట్ సెక్యూరిటీ మధ్యలో మాములు కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు ముద్దాయి.
అతని పేరు వీరు.  వీరేంద్రనాధ్.


సినిమాల్లోలా ఒంటరిగా గదిలో కురుకోబెట్టే సీన్ లేదక్కడ. మాములు నిజాం స్టైల్  బంగాళా లో పాతకాలం ఫ్యాన్ వేసి కూర్చోబెట్టారు. కింద అరేబియన్ గళ్ళ కార్పెట్, ఎదురుగా చిన్న టివి. చుట్టూ  టైట్ సెక్యూరిటీ. ఎదురుగా వచ్చిన డైరక్టర్ ముందు తానుగా “హాయ్ ” అని విష్ చేసాడు. వీరు తల ఎత్తి చూసి చిన్న ఒక నవ్వు నవ్వాడు.

ఇద్దరు కూర్చుని పరిచయాలు అయ్యాక.

సత్యం : From richest entrepreneur to prison rooms. నీకు జైలు లైఫ్ బాగా కష్టంగా ఉంటుంది.

వీరు : అదేం లేదు. మూడు రోజులనుండి సెల్ ఫోన్ లేదు కదా, కొత్తగా ఉంది. pleasant గా ఉంది.

సత్యం : సో, వీరు. మీరెంతగా కో-ఆపరేట్ చేస్తే అంత తొందరగా నిజాలు బయటికి వస్తాయి. ఐ జస్ట్ నీడ్ truth from you.

వీరు : ఇంటర్వ్యూ కెళ్ళి చాలా రోజులయ్యింది. haah…ok


సత్యం : ఇంటర్వ్యూ కాదు, you cant play like , you have done it before. Interrogation కి  cooperate చెయ్

వీరు : జోక్ చెయ్యడం లేదు sir. ఇంటర్వ్యూ ఇంటర్రోగేషన్ రెండు ఒకటే. అందులో బ్రతకడానికి అబద్ధం చెప్తాం, ఇందులో చావడానికి నిజం చెప్తాం. Just! so సింపుల్ .


 

సత్యనారాయణ  ఇలాంటి ఆన్సర్స్ కొన్ని వేల సార్లు విని ఉంటాడు. తల ఊపి

సత్యం :  నీ తెలివితేటలూ బయట చూపించుకో. డబ్బులొస్తాయ్. నా దగ్గర చూపిస్తే ఏం రాదు, శిక్ష పెరగడం తప్ప.

సత్యం వీరు ప్రొఫైల్ ఓపెన్ చేసాడు.
లోపల చదువుకుంటున్నాడు.
వీరేంద్రనాధ్. 5,10 అడుగులు.వయసు 27. సొంత ఊరు గుంటూరు

సత్యం : ఉస్మానియా గ్రాడ్యుయేట్ , M .Sc. Maths , థియేటర్ ఆర్టిస్ట్,  సాఫ్ట్వేర్ హ్యాకర్, సాఫ్ట్వేర్ కంపెనీ వికేజ్రీయా ఓనర్ , బైక్ రేసర్. బెస్ట్ ఫ్రెండ్ NGO ఫౌండర్ –

పుస్తకామ్ మూసేసి

సత్యం : SO. మల్టీ టాలెంటెడ్ అన్నమాట

వీరు : అని జనాలు అంటుంటారు.

సత్యం : ఒక్క ఉద్యోగం లో కూడా కుదురుగా ఉండవు అని కూడా అంటారు.

వీరు :
అది నా ప్రాబ్లెమ్.
మీది, పక్కనోడిది, ఇంకెవడిదో కాదు.

సత్యం : నా దగ్గరకొచ్చే క్రిమినల్స్ లో కనీసం 10 కి 9 మంది స్టెబిలిటీ లేని వాళ్లే.

వీరు : సార్ నాకు తెలియక అడుగుతాను
ఒక్క రోజులో 100 చిన్న చిన్న పనులు చేసే మనిషి
ఒక్క జీవితంలో 4 ఉద్యోగాలు చేస్తే ప్రాబ్లెమ్ ఏంటి.

సత్యం : అందుకే, బాంబు బ్లాస్ట్స్, క్రిమినల్ ప్లానింగ్, అన్నింటిలో టాలెంట్ చుపించావ్.

వీరు నవ్వి తల అడ్డంగా ఊపాడు.

వీరు : మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. నాకు సంబంధం లేదు.

సత్యం : లేదని నువ్వెలా అంటావ్.

వీరు : మళ్ళీ చెబుతున్నా. మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి.

సత్యం కు విసుగు వస్తోంది. మైండ్ గేమ్ ఆడుతున్నాడేమో అని టెంపర్ కంట్రోల్ లో పెట్టుకుంటున్నాడు.

సత్యం : చూడు వీరు. ఇంతకన్నా పెద్ద పెద్ద పాములని కాలితో తొక్కేసా.ఆల్రెడీ పెద్ద పెద్ద స్కామ్స్ చేసి, తప్పు చేసావ్. ఇప్పుడు నిజం దాచి ఇంకా రిస్క్ లోకి వెళ్తున్నావ్.

అది పూర్తవ్వకుండానే తగులుకున్నాడు వీరు

 


వీరు :
ఒక మనిషి అనుకుని చేసేది వేరు .
అది చూసే వాళ్ళు అర్ధం మాట్లాడుకునేది వేరు.
దాని పై మీడియాలో వచ్చే న్యూస్ వేరు.
ఆ న్యూస్ చుసిన  జనాలు అర్ధం చేసుకునే తీరు వేరు.

ఇందులో ఏ నిజం కావాలో చెప్పండి.
నే చెప్తా

సత్యం : ఆల్రెడీ నువ్వెంత క్రిమినల్ ఓ మాదగ్గర ట్రాక్ అయిపోయి ఉంది. ఎంత వరకు నిజం చెప్తావా చూద్దామని wait చేస్తున్నా. నిజం ఒప్పుకుంటే కోర్టు వల్ల ఛస్తావ్. లేకపోతె చెప్పు రోడ్డు మీద వదిలేస్తా జనాలు నిన్ను మీద పది నరికేస్తారు.

వీరు : అందులో ఒక్క రికార్డు కూడా కరెక్ట్ కాదు.

సత్యం : రికార్డులు ఇంకా బయటకు తీయకుండానే  ఎలా చెప్పావ్?

వీరు : నేనేదైనా చేస్తే కదా, అవి నిజం అవ్వడానికి .


లేచి సిగిరెట్ వెలిగించుకోవడానికి పక్కకి వచ్చాడు సత్యం. మైండ్ గేమ్ నేను ఆడుతున్నానా. వీడు ఆడుతున్నాడా అన్న కన్ఫ్యూషన్. కానీ, వీరు ని సరిగ్గా లాగి అడిగితే చాలా బ్లాక్ వరల్డ్ బయటికి వచ్చేస్తుంది. వీరు కి సిగిరెట్ ఆఫర్ చేసాడు. వీరు అడ్డంగా తల ఊపాడు. మళ్ళీ ఇంటరాగేషన్ మొదలు.


సత్యం : నీకు నువ్వు సెల్ఫ్ suggestion  ఎంత కాలం ఇచ్చుకుంటూ పోతావ్. నువ్వు దొరికిందే రెడ్ హ్యాండెడ్ గా. మొండి తనం పక్కన పెట్టి, తిన్నగా ఆన్సర్ చెయ్.

వీరు: ఒక్కో వారం లో నా గురించి అన్ని కేసులు ఎందుకు బయటికి వస్తాయి. నన్ను పట్టుకున్నప్పుడే అన్ని డిపార్ట్మెంట్స్ కి క్లూస్ దొరికేస్తాయ్…

సత్యం : సో, అయితే

వీరు : నా మీద కచ్చిగట్టే అన్నింటిలో ఇరికిస్తున్నారు. ఎవడు పడితే వాడు తొక్కితే నలిగిపోవడానికి నేనేం వాన పామును కాదు, తాచు పాము. సరే! ఎందుకు మిమ్మల్ని ఇరిటేట్ చెయ్యడం. ఒక్కటి, ఒక్కటంటే ఒక్క కేసులో నేను క్రైమ్  చేసానని చెప్పండి సార్. నేనే అన్ని ఒప్పుకుంటా

సత్యంకు లోపల ఆనందంగానే ఉంది. లాస్ట్ కి ఎమోషనల్ ట్రాప్ లోకి వీరు ని తీసుకురాగలుగుతున్నాడు. నెమ్మదిగా ఓపెన్ అప్ చేయించడమే పని ఇక.

సత్యం :

పోయిన సంవత్సరం  హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ బస్సు లో బాంబు బ్లాస్ట్ కు ఫండింగ్ చేసావ్. 23 మంది చిన్న పిల్లల్ని చంపడానికి

వీరు : నేను కాదు.

సత్యం : నువ్వు కాదు. ఇంకొకళ్ళతో కలిపి చేయించావ్.

వీరు : ఫండింగ్ చెయ్యలేదు. మొత్తం జరిగిన ప్లాన్ లో ఒక స్టెప్. నా దృష్టిలో నేను మారడానికి ఫస్ట్ స్టెప్.

సత్యం : ఒక స్టెప్ ఆ ? ?? అంటే ??

(ఇంకా ఉంది )

One Comment Add yours

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s