ప్రాణం

ఫ్రెండ్స్ ని డబ్బులు అడిగి అడిగి విసిగిపోయాడు రాహుల్. రెండు రోజుల నుండి ఫోన్ తియ్యడం లేదు అవతల మనిషి .ఇన్ఫోసిస్ లో ఉద్యోగం పోయి నెల రోజులయ్యింది. ట్రంప్ గాడి పుణ్యం. అసలు మే నెల ఎండలు. మాదాపూర్ ఏరియా లో రోడ్డు మీద నడుస్తూ తిరుగుతున్నాడు. అతని గమ్యం ఇప్పుడు ఒక్కటే. మరణం. ఇక చావు ఒక్కటే గతి అనుకుని ఆత్మ హత్య చూసుకోవడానికి వెళ్తున్నాడు. చుట్టూ మనుషులు నవ్వుతో, డ్రెస్సుతో, పనితో  వెలిగిపోతూ తిరుగుతున్నారు. తనలోపల మనసు మొత్తం చీకటిగా ఉంది. తనకు తెలుసు జీవితంలో అది తనకు చివరి రోజు అని.

నెల  రోజుల్లో జీవితం తలకిందులైపోయింది తనకు. 2 సంవత్సరాలుగా తిట్టి, పొగిడి, తనని బాగా ఉపయోగించుకున్న ఉద్యోగం పోయింది. పైగా ఐదు నెలలు నుండి ఇంట్లో పరిస్థితి అస్సలు బాలేదు. పెళ్లి కావడం లేదని తల్లి, తండ్రి నుండి మాములు టార్చర్ లేదు. దానికి తోడు, ఇంటికి కావలసిన ఒకే ఒక్క డబ్బుల సోర్స్ తన ఉద్యోగం కావడంతో ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోతున్నాయి. భవిష్యత్తుపై నమ్మకం లేదు. అందుకే చనిపోదామని వెళ్తున్నాడు.

పొద్దున్న వచ్చే ముందు పర్సులో రెండొందలు తీసుకుని మంచం మీద పడేసి వచ్చాడు. నిన్న రాత్రే తన ఫ్రెండ్ చైతూ కి తన ఇమెయిల్ పాస్వర్డ్ చెప్పాడు కూడా. తనకు ఇష్టమైన  పీటర్ ఇంగ్లాండ్ చొక్కా వేసుకుని రోడ్డు మీద నడుస్తూ. అతని లెక్క ప్రకారం ఇంకాసేపట్లో వచ్చే MMTS రైల్వే లైన్ మీద పడి  చనిపోదామని వెళ్తున్నాడు. మైండ్ అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు తిరుగుతున్నాయి. An Empty mind is devil’s workshop. పక్కాగా సెట్ అవుతుంది రాహుల్ కి . సెల్ ఫోన్ లో అన్ని అకౌంట్స్, ఫోల్డర్స్  ఒకటి తరువాత ఒకటి డిలీట్ చేస్తున్నాడు


మధ్య మధ్యలో మాత్రం అప్పుడప్పుడూ పక్కనే ఉన్న మనుషుల్ని చూస్తున్నాడు . ఎదురుగా ఎవడో గర్ల్ ఫ్రెండ్ ని పక్కన పెట్టుకుని నడుస్తున్నాడు. వాడి మొకం ముళ్ళ పందిలా ఉంది. పక్కన అమ్మాయి కాజల్ లెవల్లో ఉంది. “చి నీయమ్మ బ్రతుకు. లైఫ్ లో ఒక్కటంటే ఒక్కరోజు ఆనందం లేదు” .అనుకున్నాడు . వాడు ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేసుకుని నడుస్తూ పోతున్నాడు.

రాహుల్ మనసులో ఎన్నో ఆలోచనలు. తనని వదిలేసిన గర్ల్ ఫ్రెండ్స్, బంధువుల చుసిన చూపులు. ఉద్యోగం రాక ముందు పడ్డ అవమానాలు, నాన్న ఫ్రెండ్స్ ,ఇంట్లో అమ్మా, నాన్న ఆరోగ్యం. తాను ఉండి కూడా , కనీసం నాన్నని రోజన్నా సుఖ పెట్టలేకపోవడం. తన వల్ల అమ్మ పడ్డ బాధలు. అన్నీ గుర్తొస్తున్నాయి. కళ్ళెంబడి నీళ్లు. ఇదొక్కటే అనుకుంటే క్రెడిట్ కార్డు దరిద్రం ఒకటి. పక్కన చుస్తే  ప్రతీ ఒక్కడు సెల్ ఫోన్లు. చివరకు అంకుల్స్ కూడా. దేవుడా నన్ను ఎందుకు కాల్చుకుతిన్నావ్. పోనీ మతం మారిపొమ్మంటావా? సైతాన్ గాడివి నువ్వు ? అని కూడా అడుగుతున్నాడు. లోపల మాట్లాడుకుంటూ అందరినీ బూతులు తిట్టుకుంటున్నాడు.

అప్పుడే ఉన్నట్టుండి పెద్ద శబ్దం అయ్యింది. ఉలిక్కిపడి చూసాడు. ఎదురుగా ఒక బైక్ పల్టీలు కొట్టుకుంటూ తన వైపే వస్తోంది. పక్కకి తప్పుకున్నాడు. తనకి తాక లేదు. తాను మొదటి సారి చావును మిస్ అయ్యాడు.

సెకండ్స్ లో జరిగిన సంఘటనకి తనకి మైండ్ బ్లాంక్ అయిపొయింది . ఈలోపల జనాలు పరిగెత్తుకుంటూ రావడం చూసాడు. బైక్ ని గుద్దేసిన కార్ వెళ్ళిపోయింది. బైక్ డ్రైవ్ చేస్తున్న కుర్రాడు మాత్రం పడిపోయి ఉన్నాడు.

దగ్గర మూగిన జనం దగ్గరికి దూరి చూస్తున్నాడు. జస్ట్ అప్పుడే  తగిలిన గాయాల్లోంచి లోంచి రక్తం బయటికి రావడం కళ్ళ ముందు చూసాడు. వయసులో చాల చిన్నవాడు.  21 ఉండచ్చేమో.  నొప్పిగా  మూలుగుతున్నాడు. చిన్న చిన్నగా ఊపిరి పిలుస్తూ వదులుతున్నాడు.

రాహుల్ మొదటి సారి  సారి, చావబోతున్న మనిషిని చూసాడు. కాసేపట్లో నా పరిస్థితి ఇదేగా అనుకున్నాడు. కానీ, పక్కన చుస్తే ఎవ్వరూ పిల్లవాడ్ని ముట్టుకోడానికి ట్రై చెయ్యడం లేదు. “ఏ లేపకు! లేపకు. తలకు బొక్క పడింది. లేపితే రక్తం ఎక్కువ పోతుంది ” అని ఒకళ్లకు ఒకళ్ళు అంటూ  లేపడానికి ధైర్యం చెయ్యడం లేదు.  ఇద్దరు మాత్రం 108 కి ఫోన్ చేసారు. ఎక్కడ పడితే అక్కడ ఫైన్ వేసే ట్రాఫిక్ పోలీస్ దగ్గరలో కూడా కనిపించడం లేదు.

రాహుల్ కి ఒక్క క్షణం అనిపించింది 

చనిపోయే ముందు ఒక్క మంచి పని చేసే ఛాన్స్ ఎవ్వడికీ రాదు. నాకు వచ్చింది.

వేంటనే గాయాలు ఎక్కడైనాయో చూసాడు.

యూట్యూబ్ ఓపెన్ చేసి సేఫ్టీ వీడియోలు సెర్చ్ కొట్టాడు. ఒక పక్క పిల్లవాడ్ని గమనిస్తూనే, వీడియోస్ స్పీడ్ గా చేసేసాడు.  ఆ పిల్ల వాడు గిల గిలా తన్నుకుంటున్నాడు.

ఇక్కడ డాక్టర్స్ ఎవ్వరూ లేరా. ?? ఒకళ్ళు కూడా లేరా ??

ఎవరూ సమాధానం చెప్పడం లేదు.

వెళ్లి అందరూ వద్దంటున్నా ఆ అబ్బాయి తల కింద చెయ్యి పెట్టి రంద్రం ఉన్న చోట కుర్చీఫ్ పెట్టాడు.. సరిగ్గా అప్పుడే,108 వచ్చింది. ఎమర్జెన్సీ టీం టీం వాళ్ళు వచ్చి ఆ కుర్రవాడ్ని ఎక్కించుకున్నారు. మిగతా జనాలు కదిలి ఎవరిపనిలో వాళ్ళు పడుతున్నారు. ఇంత సేపు హెల్ప్ చేశా కదా, ముందు ఇతన్ని హాస్పిటల్ లో పడేశాక తన చావు సంగతి చూద్దాం అని ఫిక్స్ అయ్యాడు.

బండిలో కూర్చోబెట్టి యాక్సిడెంట్ అయ్యిన కుర్రాడు తో వెళ్తున్నాడు. ఎమర్జెన్సీ డాక్టర్ ప్రాథమిక చికిత్స చేయిస్తున్నాడు. అప్పుడే, అబ్బాయి దగ్గర ఫోన్ మోగింది. ప్యాంటు లో నుంచి తీసాడు. ‘ ‘ శాడిస్ట్ ‘ అని రాసి ఉంది. ఫోటో బట్టి నాన్నది అయ్యి ఉంటుంది అని అర్ధం చేసుకున్నాడు. డాక్టర్ ఫోన్ ఎత్తమన్నాడు. “టైం లేదు , ఇతని సిట్యుయేషన్ సీరియస్ గా ఉంది. చెప్పేయ్ ” అని అనేశాడు.

ఆ అబ్బాయి మూలుగుతున్నాడు. నొప్పితో ఒక మనిషి అలా విలవిల్లాడటం మొదటి సారి చూస్తున్నాడు. అతను , ఎటు కదలలేక తలా కూడా తిప్పలేకపోతున్నాడు.  కాలు పూర్తిగా దెబ్బతింది.

డాక్టర్  చెప్పమన్నట్టు  చెప్పేసాడు రాహుల్.  అటు వైపునుండి పెద్ద పెద్దగా ఏడుపులు వినిపిస్తున్నాయి. రాహుల్ కి ఇదంతా వింటుంటే ఏదోలా ఉంది.

ఏ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాడు” అన్నాడు అవతల తండ్రి బాధగా. ” పక్కనే రోడ్.నో.–  లో  గోవేర్నమేంట్ హాస్పిటల్ వైపుకి ” అని సమాధానం చెప్పాడు రాహుల్. అవతల వాళ్ళు ఫోన్ పెట్టేసారు.

ఇంతలో జూబిలీ హిల్స్  రోడ్ నో.36. దాక బండి వచ్చేసింది. ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా ఒక్క కిలో మీటర్ మాత్రమే హాస్పిటల్. రాహుల్ కి కాళ్ళు చేతులు ఆడటం లేదు. డాక్టర్ కి జరగబోయేది తెలుసు. సైలెంట్ గా ఉన్నాడు. ఫోన్ మోగుతోంది. అంబులెన్స్ నుండి దూకేసాడు రాహుల్.

అప్పటిదాకా ట్రాఫిక్ లో ఏనాడూ చెయ్యని ధైర్యం చేసాడు. ఎదురుగా ఉన్న ఒక్కో వెహికల్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేసి దారి ఓపెన్ చెయ్యడం మొదలుపెట్టాడు. లోపల ఉన్న అబ్బాయి ఇప్పటికే చనిపోయి ఉంటాడేమో అని టెన్షన్. ఒక పక్క పెద్ద బాధ్యతని మోస్తున్నా అని భయం. మరో పక్క మోగుతున్న అతని తండ్రి ఫోన్. వీటన్నిటి మధ్యలో మధ్యలో ఇద్దరు కుర్రాళ్ళు ” ఐతే ఏందీ ” అని తగులుకున్నారు. వాళ్ళని కూడా ఒప్పించి, చివరకు 5 నిమిషాల్లో రోడ్డు క్లియర్ చేసి బండెక్కాడు.


 

హాస్పిటల్ లో అతనికి కొత్త చిక్కు వచ్చి పడింది. ఎమర్జెన్సీ వార్డులోకి ముందు డేటా ఎంట్రీ చెయ్యమని. చేతిలో డబ్బులు 100 మాత్రమే ఉన్నాయి.  ఒక్క మనిషి బ్రతకాలంటే ఇన్ని కష్టాలా అనుకున్నాడు రాహుల్ .

అన్నీ ఉన్నా చేతిలో డబ్బులు లేవు. ఏమి చెయ్యాలో  తెలియడం లేదు. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పాడు.  అతను రెసెప్షన్ లో ఫోన్ ఇమ్మన్నాడు. ఏమైందో తెలియదు – ఫోన్ పెట్టేసాక, రిసెప్షనిస్ట్  వచ్చి పరిగెత్తుకుంటూ, స్ట్రెచర్ లో అబ్బాయిని తీసుకెళ్లింది, డాక్టర్ దగ్గరికి. డాక్టర్ లు అతన్ని లోపలి తీసుకెళ్లారు.

తాను చెయ్యగలిగిన పని ఇప్పుడు పూర్తయ్యింది . అప్పుడే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరనుండి  ఫోన్.     ” నే వచ్చే దాకా వాడు  ఊపిరి పీల్చకున్నా చాలు . నేనెలాగైనా బ్రతికించుకుంటా. వాడికి చెప్పు బాబు ” అని అంటున్నాడు వాళ్ళ నాన్న . రాహుల్ కి మాత్రం మనస్సు మళ్ళీ కీడు శంకిస్తోంది. ఇంత చేసి ఆ అబ్బాయి దక్కకపోతే – ఏంటని . అమ్మా, నాన్నా గుర్తొచ్చారు. పావు గంట అయ్యింది.  అతని తండ్రి ఇంకా రాలేదు.

డాక్టర్ బయటికి వచ్చేసాడు….

” అటెండెంట్ ఎవ్వరు ” అని అడిగాడు

” నేనే సార్ “

” ఏమవుతావు ?”

” ఏం కాను  “

” కలెక్టర్ సార్ వచ్చారా ?”

రాహుల్ కి అర్ధం కాలేదు

” వాళ్ళ నాన్న వచ్చారా ?”

“దారిలో ఉన్నారంట “

” రక్తం బాగా పోయి un conscious లో ఉన్నాడు. లెఫ్ట్ లెగ్, మోచెయ్యి విరిగిపోయాయి . PRESENTLY, he is out of danger”


 

తాను చేర్చిన వ్యక్తికీ తనకు ఏం సంబంధం లేదు, ఏమి తెలియదు కూడా.  కానీ రాహుల్ కి అప్రయత్నంగా కళ్ళెంబడి నీళ్లు వచ్చేసాయి. ప్రాణం లేచొచ్చింది.

“అతనింకో 5 మినిట్స్ లేట్ గా వచ్చిన కోమా లో ఉండేవాడు ” అని డాక్టర్ మాటలు.

రాహుల్ కి గిర్రున తిరిగింది భూమి. సినిమాల్లో తప్ప రియల్ లైఫ్ లో టైం అంత ఇంపార్టెంట్ అని తెలియదు. తన చేతులని తానే చూసుకున్నాడు. ఇంతలో గన్ మెన్ తో పాటు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు వాళ్ళ నాన్న. డిస్ట్రిక్ట్ కలెక్టర్.

రాహుల్ కి వాళ్లతో మాట్లాడే ఫార్మాలిటీస్ అక్కర్లేదనుకుని తృప్తిగా బయటికి వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడో విన్న సినిమా డైలాగ్ గుర్తొస్తోంది.

 ఒక్క సారి చావుని దగ్గర దాకా చూసి,

ఎదురించి వచ్చినవాడు.

జీవితంలో దేనికీ భయపడడు.

3 thoughts on “ప్రాణం

Add yours

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Powered by WordPress.com.

Up ↑

%d bloggers like this: