నల్ల పిల్ల

“నీ లైఫ్ నీ ఇష్టం అన్న “

ఆ మాటలు లావణ్య నోటి నుండి వినంగానే ఒక్క సారి షాక్ తిన్నాడు శ్రావణ్. ఇంకో రెండు రోజుల్లో పెళ్లి. శ్రవణ్ ని పెళ్లి కొడుకు చెయ్యడానికి ఇంటికి వచ్చేసారు బంధువులు అందరూ. చిన్నప్పటి నుండి తన గురించి తెలిసిన బాబాయ్ కూతురు లావణ్య కూడా అలా అనేటప్పటికి, ఒక క్షణం అలోచించి.

” అదేంట్రా అలా అనేసావు “

” ఏం  లేదు లే అన్న… నీకు ఇష్టమైన అమ్మాయినే చేసుకుంటున్నావ్ గా. just chill  “

మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ అందగాడే. 6 అగుడుల ఎత్తు. మహేష్ ఫెస్ కట్ , లక్షల్లో జీతం ఇవాన్నీ కాక facebook లో భారీ ఫాలోయింగ్ ఉన్న వాఁడే. తనకు ఇష్టమైన దీపికా ని పెళ్లి చేసుకుంటున్నాడు. అక్కడే, అందరికి గోల. అమ్మాయి నలుపు అని ఫ్రెండ్స్ దగ్గర్నుంచి బంధువులదాకా ఒక్కటే గొడవ .

శ్రవణ్ కి చెల్లెలు ఫీలింగ్ అర్ధం అయ్యి, బంధువుల వైపు చూస్తూ.

” వాళ్ళ బొంద.వాళ్లంతా ఏదోటి అంటారు లే. నువ్వు కూడా అవి పట్టించుకుంటున్నావా ?”

” లేదు అన్నయ్య. కానీ, పొద్దున్నుండి దేవి ఆంటీ నే మరి ఓవర్ చేస్తుంది . కట్నం కోసం చేసుకుంటున్నాడు అని. “

శ్రావణ్ నవ్వు ఆపుకుని

” వారి బాబోయ్ అలా కూడా అనుకుంటున్నారా ?”

” అవును అన్నా. నువ్వు వాళ్ళ అమ్మాయిని చేసుకోలేదని కుళ్లుతో చేస్తోంది”

” అనుకోని .”

” ఫ్రెండ్స్ కూడా బాగా కామెంట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ టివి బాగుందని.?”

” ఏంటి ?”

ఒక్క క్షణం శ్రావణ్ కి కాలింది. కానీ, మళ్ళీ సెట్ అయ్యి మాట్లాడేలోపలే.

” ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోని అన్నయ్య. ప్రేమకు మనసే ముఖ్యం. పేస్ కాదు  “

” చా. మరి నీ సెల్ లో మహేష్ బాబు ఫోటోనే ఎందుకు ఉంది. ఆర్. నారాయణమూర్తిని ఫోటో పెట్టుకోవచ్చుగా” 

” ఏడిసావ్ . నీకు సపోర్ట్ చేస్తున్న నా మీదే  సెటైర్ వేస్తున్నావా? నీతో మాట్లాడాను పో “ అని చెప్పు వెళ్లిబోయింది లావణ్య.


 

చెల్లెలు ఒక్క సారి అలిగింది అంటే,  శ్రావణ్ కి ఆ రోజు దేవుడు కనిపించినట్టే. ఓదార్పు యాత్ర పూర్తయ్యేటప్పటికీ రెండు రోజులు పడుతుంది.

” చిన్నమ్మా . ఇప్పుడు రాలేదనుకో, ఇక నేను ఎల్లుండి దాకా మూడ్ అఫ్ అయిపోతా. వస్తే నీకో నిజం చెప్తా ”

లావణ్య ,అన్నయ్య ని ఎందుకు ఏడిపియ్యడం అని సర్దుకుని మళ్ళీ వెనక్కు వచ్చింది. చెల్లెల్ని కుర్చిబెట్టి అడుగుతున్నాడు

 

” హ్మ్ ! ఏంటి ? ఇందాక చిన్న మాటకే వెళ్ళిపోతావా ”

” మరి , చెల్లెలు మీద సెటైర్ వేస్తావా నువ్వు “

” లేకపోతె. ప్రతి ఒకళ్ళు నా వైఫ్ అందం గురించి రేటింగ్ ఇస్తే నాకు కాలదా. తాను అందంగా లేదని అంటే  ”

” దీపిక. నిజంగా నీకు నచ్చిందా అన్నయ్యా “

” yep ! ”

లావణ్య యాక్ అనబోయి.

 ఒక  డౌట్ అన్న .  నీకు ఎం నచ్చింది వదినతో ప్రేమలో పడటానికి”

” అది పెద్ద లిస్ట్ రా. వదిన లు వచ్చాక అన్నయ్యలకి explain చేసే కెపాసిటీ పోతుంది. అందుకే పెళ్లి కాని  వాళ్ళు, పెళ్లి అయ్యాక దెబ్బ తిన్న వాళ్ళే పోయెట్రీ బాగా రాస్తారు. ”

లావణ్య బుర్ర గోక్కుంది.

” అర్ధం కాలేదు కదా.! సింపుల్ గా చెప్తా. తను కలర్ మాత్రమే ఆలా ఉంటుంది. బట్ నాకన్నా కళగా ఉంటుంది. features బాగుంటాయి కదా. తెల్లగా ఉంటె నాకు దొరికేది కాదేమో ”

“ఇది ఒప్పుకుంటా అన్న . తాను తెల్లగా ఉంటే మాత్రం నిజ్జంగా మేం ఎవ్వరం సరిపోము తనకి “

” ఆగు ఆగు ! విను ఫస్ట్ ”

” చెప్పు “

” అసలు బ్లాక్ , వైట్ వీటి మీద ఎలా ఆలోచించే వాడ్నో తెలుసా ”

” ఏమని ?” 


 

” చిన్నప్పుడు 12 ఇయర్స్ అప్పుడు, ఏ అమ్మాయిని చూసినా తెల్లగా ఉంటే అందగత్తె అనుకునేవాడిని. తరువాత 15 ఇయర్స్ అప్పుడు ముక్కు బాగుంటే అందమైన అమ్మాయి అనుకున్నా. 16-20 ఇయర్స్ అప్పుడు వేరే ఏవో అనుకున్నా. ఒక్కో సంవత్సరం మారే కొద్దీ అందం డెఫినిషన్ మారిపోతూ వచ్చింది. సీరియస్ అస్సలు. మీ వదిన వచ్చాక అసలు మైండ్ మొత్తం మారిపోయింది తెలుసా. అప్పుడు అర్ధం అయ్యింది.  అందం అంటే ఏమి లేదు . ఎన్ని సార్లు చూసినా ఆనందంగా అనిపించడమే  ”

“అంటే ?”

” ఎన్ని సంవత్సరాలైనా ఏ కళ్ళని ఒక్కసారి చుస్తే ఇంకాస్త బతకాలనిపిస్తుందో. ఎవరు మన గురించి అన్నీ తెలిసి మనం ఎదగడానికి హెల్ప్ చేస్తారో, ఎవరు మన సంతోషం గురించి ఎక్కువ ఆలోచిస్తారో అలంటి వాళ్ళు ఒక్కళ్ళు కావలి లైఫ్ లో. అది మన లైఫ్ పార్టనర్ అయితే లక్కీ థింగ్ ”

” అవును అన్నయ్యా . తాను చాల ఆక్టివ్.”

” విను విను. చెప్తా! బేసిక్ గా నలుపు అంటే అందరికి ఎందుకు చిరాకు చెప్పు ”

ఏమో మన కల్చర్ లో అలా అనుకుంటారు అనుకుంటా “

” నీ బొంద. నా బొంద. నువ్వు చూసే వరల్డ్  ఛానల్స్ పేర్లు అన్ని చెప్పు ”

” STAR MOVIES, NATIOINAL GEROGRAPHIC , BBC, DISCOVERY”

” కదా. అవన్నీ ఏ దేశం లోవి. ”

” అమెరికా, బ్రిటన్” 

” అంటే. తెల్లగా ఉండేవాళ్లు ఛానల్స్ లో లో తెల్ల వాళ్ళే కనిపిస్తారు. దాంట్లోనూ అందమైన వల్లనే వాళ్ళు చూపిస్తారు. సో, ఆటోమేటిక్ గా తెల్లగా ఉండటం అందం అని చాల మంది ఫీలింగ్ రా. అదే నల్లని వాళ్ళు అందరూ వాళ్లలో అందమైన వాళ్ళని పెట్టి టివి లో ప్రోగ్రామ్స్ పెడితే????? అవి దునియా మొత్తం చుస్తే. అప్పుడు నలుపు కూడా అందంగా ఉంటుంది కదా”

” బాగా బాగా చెప్పావ్ అన్నా “

” సింపుల్ రా. టెక్స్ట్ బుక్స్ దగ్గర్నుంచి, ADVERTISEMENTS దాకా నలుపు అంటే వికారం అని మనకి చేప్పే  బిజినిస్  propogonda ని చూసి ఇలా మారిపోతున్నాం. ”

లావణ్య అన్నయ్యని అలానే చూస్తోంది.

“వదిన చాలా  చాలా లక్కీ అన్నా  “

” ఏడిసావ్ లే. ఇప్పుడు చెప్పు !!వదిన నేను చేస్కోవడం తప్పా ”

” ఎం లేదు అన్నయ్యా. కానీ , నీలా జనాలు ఉండరు. కాబట్టి అస్సలు పట్టించుకోకు. “

” తెలుసులే ”

అండ్ ఇంకొకటి అన్నయ్యా !”

” ఏంటో ”

” వదినకి insecurity  ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి నువ్వు. ఇది మాత్రం మర్చిపోకు. “

” ఎందుకు వస్తుంది ?”

” నేను అమ్మాయిని. నాకు తెలిసిందే చెప్తున్నా అన్న.. అమ్మ కాల్ చేస్తోంది . ఉండు మళ్ళి వస్తాను “

అని చెప్పేసి వెళ్ళిపోతోంది లావణ్య. అసలు కారణం వేరు. మేక్ అప్ కిట్ కొనుక్కోవడానికి.

 

లోపల మాత్రం అన్నయ్య ని గురించి గర్వం గా ఫీల్ అవుతూ అక్కడనుండి కదిలింది.

2 Comments Add yours

 1. కార్తీక …… వంశీ గారి దిగువ గోదావరి కథలో నల్లపిల్ల
  నేను చదివిన మొదటి కథ….. ఆ వంశీ గారు స్త్రీ లలో చతుర్ వర్ణాలు చెపితే…. నువ్వు 2 వర్ణలు బాగా చెప్పావ్.

  ఏ లైన్స్ నాకు బాగా నచ్చాయి.

  అందం అంటే ఏమి లేదు . ఎన్ని సార్లు చూసినా ఆనందంగా అనిపించడమే ”

  “అంటే ?”

  ” ఎన్ని సంవత్సరాలైనా ఏ కళ్ళని ఒక్కసారి చుస్తే ఇంకాస్త బతకాలనిపిస్తుందో. ఎవరు మన గురించి అన్నీ తెలిసి మనం ఎదగడానికి హెల్ప్ చేస్తారో, ఎవరు మన సంతోషం గురించి ఎక్కువ ఆలోచిస్తారో అలంటి వాళ్ళు ఒక్కళ్ళు కావలి లైఫ్ లో.

  Like

 2. Vasavi Priya Miriyala says:

  I love this Story. Super Sir…….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s