ఒకే ఒక్క ఛాన్స్

 

” మాలాంటోడికి ఎవరు ఇస్తారు ఛాన్స్. ఇచ్చినా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడికేగా ”

తిట్టుకుంటూ పక్కన కూర్చున్నాడు నందు. పక్కనే వచ్చిన కొత్త ఆర్టిస్ట్ లు  ఎదో వింటున్నట్టు  మొకం పెట్టి చూస్తున్నారు అతన్ని. అప్పుడే ఒక షాట్ లో సరిగ్గా చెయ్యకపోతే, డైరక్టర్ దగ్గర బాండ బూతులు తిని frustation లో ఉన్నాడు. యూనిట్ లో అందరూ కాసేపు అతన్ని చూసి, పట్టించుకోవడం మానేశారు. “ఇలాంటివి కొన్ని వందల కేసులు చూసాం” అని ఫీలింగ్ తో.

production వాళ్ళు పెట్టిన భోజనం తింటున్నాడు. ” స్టేజి మీద నిలబడి ప్రేక్షక దేవుళ్ళని ఓ బిల్డ్ అప్ కొడతారు. వేషం ఇవ్వమంటే ఒక్క నా కొడుకు ఛాన్స్ ఇవ్వడు. ” ఇంకా నోటికి వచ్చిన బూతులు పక్కనున్న కొత్త వాళ్లతో చెబుతూ వస్తున్నాడు. ఇంతలో అతనికి ఎదురు వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్ శివ.

ఒక్క సారిగా మాట్లాడటం ఆపేసి నందు అతన్ని చూసాడు  . శివ డైరెక్ట్ గా వచ్చి ఎదురుగా నిలబడి  ” డైరెక్టర్ సార్ ! నిన్ను రమ్మన్నారు. తినేసి సెట్ లోకి వచ్చెయ్ “.

దెబ్బకి ఉన్న కాస్త ఫ్యూస్ ఎగిరి పోయింది నందు కి. పక్కనున్న వాళ్లంతా డైరెక్టర్ పిలిచి కొడతాడు అని ఫిక్స్ అయిపోయారు. ” అందుకే చెప్పా షూటింగ్ కి వచ్చాక , నోరు ముస్కుని మనకిచ్చింది చేసుకుని పోవాలి. ఇలా అంటూ కూర్చుంటే …” అని పక్కన ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ లు గుసగుసలాడుతున్నారు.

శివ అడిగిన తీరుకి షాక్ నుండి తేరుకోలేక నందు సగం తినేసి. గబా గబా డైరెక్టర్ ఉన్న లొకేషన్ కి వెళ్ళిపోయాడు.


 

షూటింగ్ లొకేషన్. అంతా ఇప్పుడు రిలాక్స్డ్ గా ఉంది. పక్కనే డైరెక్టర్స్ యాక్టర్స్ తినేశారు కాబట్టి, ఖాళీ అయ్యిన టేబుల్ పైన డైరక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చుని తింటున్నారు. “సార్ ఎక్కడ ?” అని అడిగిన ప్రశ్నకి చెయ్యి చూపిస్తూ , ఒక వైపు లైటింగ్ దగ్గర స్క్రిప్ట్ చూసుకుంటున్న డైరెక్టర్ ఆకెళ్ళ రాఘవేంద్ర ని చూపించారు.

ఆయనకది రెండవ సినిమా. అప్పుడే 2 బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేస్తున్నాడు. పక్కనే బేబీ ( షూటింగ్ లో వాడే లైట్ లు  ) , డైరెక్టర్ పక్కన ఖాళీగా ఉన్న కుర్చీ. ఫ్రూట్ జ్యూస్ తాగుతూ కూర్చుని స్క్రిప్ట్ చూసుకుంటున్నాడు.

 

“నమస్తే సార్ ”

డైరెక్టర్ ఇంకా తన పని లో నుండి బయటికి వచ్చి నందు ని చూసాడు. కూర్చో అని చెప్పి కంటి తో సైగ చేసాడు డైరెక్టర్. నందు గుండెలో దడ మొదలయ్యింది.

” ఏంటి యూనిట్ లో గొడవ చేస్తున్నావ్ అంట ?”

ఆ మాట వినంగానే నందు కి గుండె ఆగిపోయిన పనయ్యింది.

” సారి సార్. చిన్న వేషం కూడా రాలేదనే ఫ్రూస్టేషన్ లో ఎదో అనేసుకున్నా ”

” ఏం చిన్న వేషం?”

” అదే ఇందాకా హీరో ని టివిలో చూసి చెప్పే డైలాగ్ ”

” మరి నువ్వు సరిగ్గా చెయ్యలేదు కదా ” 

” అవును సార్. కానీ నాకు స్క్రిప్ట్ లో ఏముందో కూడా చెప్పలేదు సార్. ”

” లొకేషన్ లో ఏ సీన్ జరుగుతోందో తెలిస్తే చాలు. ఒక్కోసారి అప్పటికప్పుడు చెప్పింది చేయగలగాలి. తప్పదు “

నందు ఇక తన పని అయిపోయిందని ఇక కొట్టి పంపిస్తాడు లే అనుకున్నాడు.

 


 

ఇంతలో డైరెక్టర్ కలగ చేస్కుని

” అసలేం అవుదాం అని వచ్చావ్ ఇండస్ట్రీ కి “

” సార్. హీరో అవుదామని ”

” సరే !” 

” ఇందాక ఏమని అంటున్నావ్ అందరితో ??”

” ఎవ్వరు వేషాలు ఇవ్వరు మాకు గుర్తింపు ఎప్పటికి రాదు అని ”

” అంటే “

” పల్లెటూరు నుండి వచ్చిన వాళ్లకి హీరో అయ్యే ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది సార్ ”

” మరి నేను కూడా గుంటూరు పక్కన మారు  మూల పల్లె నుండే వచ్చా నాకు పెద్ద డైరెక్టర్ గా ఛాన్స్ రాలేదా మరి ?”

” నిజమే సార్! ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ ఇస్తేనే కదా అది జరిగేది ”


 

” అక్కడే చాల మంది మోసపోతున్నారు , బ్రదర్ “

” లిఫ్ట్ ఇస్తే వస్తారు. ఇయ్యకపోతే పోతారు అని రూల్ లేదు . సరే ఒకటి చెప్తా . ముందు అసలు నువ్వేం చదువుకున్నావో చెప్పు “

” పోలి టెక్నీక్  ”

” పాలిటెక్నీక్ అయ్యాక ఉద్యోగం రావాలంటే ఎం చేస్తావ్ “

” జాబ్స్ కి అప్ప్లై చేస్తాను సార్. ఇంటర్వ్యూ కి వెళ్తా . సెలెక్ట్ అయితే ఉద్యోగం చేస్తా ”

” కదా. ఆ ఫిల్డ్ లో బ్రతకాలంటే నువ్వు ఎం చెయ్యాలి.”

” మా సార్ కి నచ్చాలి. ”

” మీ దగ్గరికి వచ్చే క్లయింట్ కి కూడా నచ్చాలి . అంతేనా ?”

” అవును సార్.”

” మరి మన ఫీల్డ్ లో మనం బ్రతకాలి,ఎదగాలంటే “

” జనం చాల మందికి నచ్చాలి !”

” ఇందాక నువ్వు చెప్పిన డైలాగ్ నీకు నచ్చిందా.”

” లేదు సార్ ”

” నీ  డైలాగ్ నాకు కాదు, షూటింగ్ యూనిట్ కి కాదు. చివరికి నీక్కూడా నచ్చలేదు. మరి ఇండస్ట్రీ కి ఎందుకు వచ్చావ్ “

నందు నోట్లోనుంచి మాటలు రావడం లేదు.

 


 

కాసేపు సైలెంట్ గా ఉన్నాడు. డైరెక్టర్ అందుకుని

 

” చూడు బ్రదర్! ఇండస్ట్రీ లో వేషం కావాలని ఇంటి నుండి వస్తున్న వాళ్ళు వందల మంది ఉన్నారు.  పెద్ద హీరో కొడుకు దగ్గర్నుండి , చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దాకా ఒక్క దెబ్బతో ఇంట్లో కూర్చున్న వాళ్ళు అంత మందే ఉన్నారు. వీళ్లందరినీ దాటి రావాలంటే ఒక్క ఫ్రెమ్ లో జనం మనల్ని గుర్తుపట్టేలా ఏదైనా చేయగలగాలి. సప్తగిరి అలానే వచ్చింది “

” ఇంకొక్క టేక్ చేసి ఉంటె చేసేవాడిని సార్. కానీ, ఎవ్వరు ఆ ఛాన్స్ ఇవ్వరు.”

” ఎందుకిస్తారు. ఇంకో ఛాన్స్ ఎందుకు తీసుకుంటున్నావ్ అసలు చెప్పు.”

“నీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర ఒక 50 వేలు అడగాలంటేనే వంద కారణాలు చెప్పాలి. అలాంటిది ఇది సినిమా. ఒక్క   సారి కెమెరా పొద్దున్న ఆన్ చేస్తే రోజుకి 50 వేలు దగ్గర్నుంచి 50 లక్షలు ఖర్చయిపోతాయి .  ఒక్క చిన్న క్యారెక్టర్ కోసం , ఒక కొత్త ఆర్టిస్ట్ కోసం , గంట సేపు ఎలా వేస్ట్ చేయమంటావ్? నువ్వే చెప్పు !”

” నిజమే సార్ ” నందు కి కాస్త అర్ధమయినట్టు అన్నాడు.

” సరే! నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తా. ఇంకొక రోల్ లో, జనం గుర్తుపట్టేలా నువ్వేం చెయ్యగలవ్ “

” తెలియదు సార్ ”

” నటించడం. వినడం. డైరెక్టర్ కి ఎం కావాలో ఆలోచించడం. ఇవేవి చెయ్యకపోతే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లైఫ్ ఉండదు. అదే, ఇవి ఉన్నవాడు రవి తేజ , నాని లాగా కష్టపడైనా పైకి వస్తాడు.”

” థాంక్స్ సర్. ఇప్పుడు అర్ధం అయ్యింది. సినిమా కి ఏం కావాలో ఇవ్వడం రావాలి. అది మనం చేయగలమని నమ్మకం వచ్చినప్పుడు ఇండస్ట్రీ నే మనకు పిలిచి అవకాశం ఇస్తుంది.”

అవును బ్రదర్. నిన్ను తిడదామని పిలవలేదు. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవాలి అని చెప్తున్నా. నీతో నువ్వున్నావ్. నీ పక్కన స్నేహితుడు ఉన్నాడు. చుట్టూ షూటింగ్ యూనిట్ ఉంది. బయట నీకోసం లక్షల మంది జనం చప్పట్లు కొట్టడానికి ఎదురుచూస్తున్నారు. వీటిలో ఒక్కొక్క సర్కిల్ దాటి ఎప్పుడు వెళ్తావ్. ఎలా వెళ్తావ్ అని ఆలోచిస్తేనే ఇండస్ట్రీ లో ఉండు. లేదా వాళ్ళని, వీళ్ళని, తిట్టుకుంటూ జీవితాంతం ఫోటోలు పట్టుకుని , రాత్రి మందుకొట్టుకుంటూ నాశనం అయిపోతావ్.

 

“యూనిట్ లో కోట గారు , బ్రహ్మానందం గారు ఉంటారు. ఇండస్ట్రీ కబుర్లు కాదు , యాక్టింగ్ ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకో. మంచి ఫేస్ ఉంది నీకు. గో !”

 

నందు నడుచుకుంటూ  వెళ్తున్నాడు. మళ్ళీ వెళ్లి ఫ్రెష్ గా తినేసి వచ్చే వేషానికి సిద్ధం అవ్వడానికి.

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s