మొండి : 2వ భాగం

ముందు జరిగిన కథ కావాలంటే 

హైటెక్ సిటీ ఏరియా లో ఉంటుంది కోండిటెల్ ఆఫీస్. పదకొండు ఇంటి దగ్గర్నుంచి, కొన్ని వేల మంది తో నిండిపోతుంది అక్కడి ఆఫీసు ఉన్న కంప్లెక్స్. వందల కొద్దీ బైకులు, ఆఫీసు క్యాబ్స్ అక్కడికి వచ్చి ఎంటర్ అవుతున్నాయి. ఎవరి కంపెనీ కి వాళ్ళు వెళ్లి, ఐడి కార్డ్ స్వైప్ చేసి లోపలికి వెళ్లిపోతున్నారు. దివ్య ఎప్పటిలాగే ఆఫీసుకి రెడీ అయ్యి వచ్చింది. కానీ, ముఖం లో కళ లేదు. ఎప్పుడు తనని చూడగానే బల్బ్  లాగా వెలిగిపోయే స్టాఫ్ మొత్తం చిత్రంగా  చూస్తున్నారు. ఎవరూ సరిగ్గా పలకరించడం లేదు. నేరుగా వెళ్లి క్యాబిన్ లో కూర్చుంది.

కూర్చుందన్న మాటే కానీ, పని ఏదీ చెయ్యే లేకపోతోంది. ఏడుస్తూనే ఉంది. దివ్య ని ఓదార్చడం ఎవ్వరి వల్ల అవ్వడం లేదు.కొలీగ్స్ , కాలేజీ  ఫ్రెండ్స్ అయిన సంగీత , కృష్ణ ప్రసాద్ అసహాయంగా చూస్తున్నారు. మధ్యలో మధ్యలో వచ్చి ఎంత  సర్ది చెప్పినా అదే సిట్యుయేషన్. ఇక లాభం లేదని, సంగీత దివ్య దగ్గరకు వచ్చింది. చిన్నగానే

సంగీత : దివ్యా …..! అందరూ చూస్తున్నారు దివ్యా ….

దివ్య ఏడుస్తూనే ఉంది. సంగీత పక్కనున్న క్యాబిన్ లో కుర్చీ లో కూర్చుని,

సంగీత : మెంటల్ దానిలా బిహేవ్ చెయ్యకు. సెన్స్ ఏమైనా ఉందా. ఆ ఫ్రాడ్ గాడి కోసం నీ మూడ్ అంతా ఆఫ్ అవుతావా.

దివ్య కోపంగా చూసింది. సంగీత కంట్రోల్ చేసుకుని. పక్కనే కూర్చుని మాట్లాడుతోంది.

సంగీత : దివ్యా. వీరూ ఇప్పుడు జనం దృష్టిలో వాడో పెద్ద ఫ్రాడ్. వాడ్ని కాలేజీ నుంచి చూస్తూనే ఉన్నాం కదా . అస్సలు వాడెప్పుడూ సోషల్ పర్సన్ కాడు. వాడి గురించి నువ్వేడుస్తుంటే ఎలానో ఉంది.

దివ్య : వాడు ఫ్రాడ్ అని అనకే. రెండు రోజుల క్రితమే చెప్పాడు. తన మీద ఎదో ఇరికించే స్కెచ్ నడుస్తోందని. ఎందుకో డౌట్ అని అంటూనే ఉన్నాడు.

సంగీత  : ఇంకా వాడు మంచోడని నమ్ముతున్నావా. టీవీల్లో చూడటంలేదా. ఎవడు పడితే  వాడు , వాడ్ని పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు.  వాడెంత డేంజరస్సో నీకు తప్ప  అందరికీ తెలిసిపోయింది.

దివ్య : నిజం తెలిసే దాకా అందరు తమకు తెలిసిందే కరెక్ట్ అంటారు. వాడేంటో నాకు నిజంగా తెలుసు. ఖచ్చితంగా చెప్పగలను. నేనే వాడికి అప్పుడు యస్ చెప్పుంటే, వాడి లైఫ్ లో ఈ రిస్క్ లు ఏవీ చేసేవాడు కాదు.

సంగీత : నీకు మైండ్ ఫుల్ గా దొబ్బిందే. ఇంకోసారి నా దగ్గర ఆ టాపిక్ ఎత్తమాకే బాబు. అతని ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను నన్ను కూడా జైలు తో పాటు, జాబ్ లోంచి తీసి పడేస్తారు బాస్. ఆ తరువాత నీ ఖర్మ. ఏడువ్.

అని  వెళ్ళిపోయింది.  వీరూ ఏ తప్పు చెయ్యలేదని తనకు మాత్రమే తెలుసు అని దివ్య నమ్ముతోంది. ఒక్క సారైనా అతన్ని కలిసి అడిగి ” నేనేం చెయ్యలేదు ” అని అంటే విందామని అనుకుంటోంది . ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు ఏమన్నా అనుకోనీ ,వీరూ ని విడిపించాలి.

ఇన్నాళ్లు తాను – వీరూ  ప్రేమను కాదని అన్నప్పుడూ, ఎన్ని సార్లు ఆలోచించినా అనిపించని ఆలోచనలు ఇవాళ వస్తున్నాయి .వీరూ  ని విడిపించాలి . ఎలాగైనా సరే. ఒక్క సారి వాడు నవ్వుతుంటే మళ్లి చూడాలి. తన భుజం మీద తల వాల్చాలి. దివ్య కి అర్ధం అవుతోంది. she cant live without veeru.

Immediate గా next చెయ్యాల్సిన పనేంటి. లాయర్ శ్రీకాంత్ యాదవ్ అంకుల్ ని అడుగుదామా?? లేదు నాన్నకి చెప్పేస్తాడు. రవీందర్ అంకుల్ ని అడిగితే. చెప్పలేం. ఆయన ఇంత పెద్ద కేసు హ్యాండిల్ చెయ్యలేడేమో. ఎదో చిన్న చిన్న కేసులు తప్ప రిస్కీ కేస్ లు హ్యాండిల్ చేసిన అనుభవం లేదు అతనికి. దివ్య మైండ్ అంతా ఆలోచనలతో నిండి పోయి ఉంది. శివ కి ఫోన్ చేసింది.


అప్పుడే ఒక సాఫ్ట్ వేర్ క్లయింట్ దగ్గర చిన్న వెబ్ సైట్ ప్రాజెక్ట్ పని పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు సాయి కిరణ్ . చాలా రోజుల తరువాత అనంతపూర్ నుండి హైదరాబాద్ వచ్చిన శివ ఇరానీ చాయ్ తాగుదామని గొడవచేస్తే,  బరహా కేఫ్  పట్టుకెళ్ళాడు.ఛాయ్ తాగడం మొదలుపెట్టారో లేదో

శివ  : ఇంకా ! ఏందిరా సంగతులు

సాయి : చెప్పాలి నువ్వే

శివ : అమ్మాయిలతో మాట్లాడి మాట్లాడి  అలవాటైనట్టుంది” చెప్పాలి. చెప్పు. ఇంకా “.

సాయి : నీ అంత కాదు లే. సిస్టర్ ఎలా ఉంది.

శివ : మీ సిస్టర్ కే??  హ్యాపీ . అక్కడే గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ గా చేస్తోంది.

సాయి: నీ గవర్మెంట్ జాబ్ ఏ బెటర్ గా. సోది, ఇక్కడ ఒక్కడు కూడా టైం కి పేమెంట్ ఇవ్వడు. పేరుకు సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ పాన్ డబ్బా వాడికొచ్చే డబ్బులు కూడా రావు.

శివ  : చెప్పినావ్  లే గాని…………. అరే. ఆ వీరు గాడు దారుణంగా బుక్ అయ్యాడు గా.

సాయి: చల్ వాడి గురించి నా దగ్గర ఎత్తకు. ….. గాడు. బిజినెస్ కలిసి చేద్దాం చేద్దాం అని చెప్పి మోసం చేసినప్పుడే అనుకున్న. వాడికి ఎక్కడో పెద్ద బొక్క ఎదురు చూస్తుంది అని. ఇప్పుడు దొరికాడు వాడు పోలీసులకి.

శివ కు జరిగింది మొత్తం తెలుసు. ఒకప్పుడు క్లోస్ ఫ్రెండ్స్ గా ఉన్న సాయికిరణ్, వీరేంద్రనాధ్ ఇప్పుడు ఎంత దూరం అయ్యారో అని. అందుకే , టాపిక్ మార్చడానికి

శివ : ఇరానీ చాయ్ ఒకటి చెప్పు పా.

ఇద్దరు కలిసి చాయ్ కి టోకెన్ తీసుకోవడానికి వెళ్లారు. కౌంటర్ దగ్గర జనాలు బానే ఉన్నారు. లోపల పది సార్లు చెప్తే కానీ అప్పటికి క్యాషియర్ సాయి కి డబ్బు తీసుకుని టోకెన్ ఇవ్వలేదు. బయటికొచ్చి టీ ఆర్డర్ చేసుకుని తాగుతున్నారు.

సాయి : చాయ్ లానే లేదు ఇది.

శివ : నీ యబ్బ. ఇరానీ చాయ్ తాగుదామని వస్తే, కలర్ వేసి , ఇరానీ చాయ్ అని పెట్టి ఇస్తున్నాడు.

సాయి: షుగర్ కూడా ఎక్కువయ్యింది.

శివ : ప్లాస్టిక్ రైస్ లాగా. ప్లాస్టిక్ టీ ఇచ్చినాడేమో. ఆ కాఫీ వాడికి ఇచ్చి పోదాం పద

అని శివ అనబోతుండంగానే. ఫోన్ వచ్చింది దివ్య నుండి.

 

 

ఇంకా ఉంది 

One Comment Add yours

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s