మొండి : EP:3 – చర్లపల్లి

వారం ముందు ఫైవ్ స్టార్ హోటల్ గోడలలో తాను
వారం తిరిగాక జైలు మధ్యలో తానే
అక్కడా ఇక్కడా అదే ఒంటరి తనం
ఇంటర్మీడియట్ హాస్టల్ లో ఉన్నవాడికి , ఏ జైలు అయినా బానే ఉంటుంది
వీరు ఒంటరిగా తిరుగుతున్నాడు. అతని పై వేసిన నింద – తీవ్రవాదులకు వారి చర్యలకు సహకరిస్తున్నాడని, సైబర్ మార్గాల ద్వారా శత్రు దేశాలకు కీలక సమాచారం అందవేస్తున్నాడని. ఆ అభియోగాలపైనే అతను నిందితుడిగా చర్లపల్లి జైలు గోడల మధ్యన బంధీగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
జైలు జీవితం ఇంటర్మీడియట్ హాస్టల్ లానే ఉంటుంది. పొద్దున్నే 6 గంటలకు వేక్ అప్ కాల్.సెల్ తెరుస్తారు. 7:30 కల్లా టిఫిన్లు పూర్తయ్యాక తిరిగి సెల్ లాక్ చేస్తారు. 10 గంటలకు చిన్న చిన్న పనులకి ( బట్టలు ఉతుక్కోవడానికి ) బయటికి ఒక అరగంట వదిలేవారు. 1 గంటకి భోజనం. మధ్యాహ్నం 3-5 దాక మాత్రం కాసేపు ఎవరి ఇష్టమైన పనులు చేసుకోవడానికి జైలు ప్రాంగణం లోకి వదిలుతారు. రాత్రి 6-8 మధ్యలో భోజనం. ఇది అక్కడి నిందితులు ( నేరస్థులు కాని వారి) రోజు వారీ టైం టేబుల్. తన సెల్ లోనే attached టాయిలెట్ ఉంటుంది.
వీరు అక్కడ చేరి వారం రోజులు కావొస్తోంది. రెండు రోజుల క్రితమే హై – సెక్యూరిటీ మధ్యన ఇంటెర్రగేషన్ కూడా వెళ్లి వచ్చాడు. మధ్య మధ్యలో కానిస్టేబుళ్లు వచ్చి మాట్లాడి పోతున్నారు. పక్కనున్న ఖైదీలు పలకరించినా పెద్దగా మాట్లాడటం లేదు. కొంత మంది రెచ్చ గొడితే అన్నా మాట్లాడతాడేమోనని భోజనం వేళలో ట్రై చేసారు. ఫలితం లేదు. వీరు ఒంటరిగా కూర్చుని గోడనే చూస్తున్నాడు. తానూ జైలుకి తీసుకొచ్చింది ఒక పుస్తకం , కొన్ని పేపర్లు మాత్రమే; అప్పుడప్పుడు తన దగ్గర ఉన్న మాథెమాటిక్స్ కోసం తెచ్చుకున్న పేపర్స్ చూసుకుంటున్నాడు. ఏదైనా బాధగా అనిపిస్తే ఆ ఒక్క పుస్తకం (మహా ప్రస్థానం) చదువుతున్నాడు.
తన ఆలోచనలలో మునిగి ఉన్న వీరూకి అప్పుడే వినిపించింది కానిస్టేబుల్ గొంతు. ” జైలర్ సాబ్ వస్తుండు “. పేపర్ లు అన్ని సర్ది తన వార్డ్ ని నీట్ గా చేసుకున్నాడు వీరు. ఒకే ఒక్క పేపర్ తీయడం మర్చిపోయాడు. కాసేపటికే అక్కడికి జైలర్ మొహంతి వచ్చాడు. 40 ఏళ్ల వయస్సు. గోధుమ రంగు శరీరం. సన్నని మీసాలు. కరుడు గట్టిన పోలీస్ రఫ్ నెస్ తో ఎంటర్ అయ్యాడు సెల్ లోకి.
వస్తూనే పలకరించగా, వీరు చిన్న కృతిమ నవ్వుతో సమాధానం ఇచ్చాడు. కాసేపు మాట్లాడి ఆరోగ్యం , కనీస వసతులు అన్నీ సరిగ్గా ఖైదీ కి ఇస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నాడు. ఎల్లుండి మళ్లి కోర్టుకు హాజరు అవ్వాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు జైలర్ మహంతి. వెళ్ళబోతున్న మహంతి షూ కి తగిలింది, మర్చిపోయిన పేపర్. అప్పటిదాకా మొహం లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్న వీరు తెలియని టెన్షన్ కి గురయ్యాడు.
ఎదో ఆలోచనలో ఉండి గమనించకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఆ పేపర్ ని తీసి చూసుకున్నాడు వీరు. అందులో
అసలు ఇప్పటిదాకా తన చుట్టూ ఏం జరుగుతుందో ఒక అంచనా వేస్తున్నాడు. అందులో భాగంగా ముఖ్యమైన పేర్లని , ప్రదేశాలని, కొని డేట్స్ ని , వారిని లింక్ చేస్తూ మాథ్స్ ఈక్వేషన్స్ ని రాసుకున్నాడు ఆ పేపర్ లో.
అందులో తాను రాసుకున్న పేర్లు, దివ్య, శ్రవణ్ , మహేష్, మూర్తి , రాజేంద్ర, బి వి ఆర్ , దేబేంద్ర బోస్ , ప్రకాష్.
ఇలా మాథెమటికల్ గా ప్రతిదీ రాయడం మొదలుపెట్టిన క్షణాల్ని గుర్తు చేసుకుంటున్నాడు.దేబేంద్ర నాథ్ సార్ తనకు చెప్పిన ఒక్కో మాట , ఆయనతో తిరిగినప్పుడు తాను మొదటిగా తెలుసుకున్న ‘ the infinite sepanis theorm ‘ గురించి ఆలోచిస్తున్నాడు. అసలు మాథ్స్ ని పూర్తిగా సమాజం లో జరిగే ప్రతి వస్తువుకి, సంఘటనకి, ప్రజల సమూహ ప్రవర్తనకి లింక్ చేస్తూ రాసిన సిద్దాంతం అది.
తాను రాసుకున్న మొదటి పేరు దేబేంద్ర బోస్ అయితే , చివరి పేరు మహంతి. జైలర్ మహంతి
P_20170720_013808-01-01

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s