మహా రాజువయ్యా

ఆయుధం పట్టలేదు 

ఒక్క చుక్క రక్తం పారలేదు 

అఖండమైన సామ్రాజ్యాన్ని 

అలవోకగా గెలిచేసాడు.

 


 

ఏ వూరు చూసినా అదే పాట పడుతున్నారు. ఆ దేశంలోనే కాదు. ప్రపంచం మొత్తం అదే పాట , ఆ మహారాజును కీర్తిస్తూ  పాడుతోంది. అఖండమైన ‘వర్త’ దేశాన్ని పూర్తిగా అహింసతోనే అతను స్వాధీనం చేసుకోవడం , ప్రపంచ యుద్ధ చరిత్రలోనే ఒక మరపు రాని ఘట్టంగా మిగిలిపోతుంది అని అన్ని మీడియా చానళ్ళు , మహారాజుని వేనోళ్ళ కొనియాడుతున్నాయి.

 

రాజకుమారుడు డేవిడ్ కు మాత్రం ఇవేవీ అర్ధం కావడం లేదు. తండ్రి పట్టాభిషేక మహోత్సవానికి అక్కడి వర్త దేశ ప్రజలు దేశ రాజధానిలో , లక్షలాదిగా హాజరయ్యారు. కొత్త మహారాజు కాసేపట్లో అధిష్టిక్తుడవుతాడు. ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఎటు చూసినా పాటలతో, నృత్యాలతో, మీడియా కవరేజ్ తో హోరెత్తిపోతుంది. అందరి మొహం లో కళ , యువరాజా డేవిడ్ ముఖం మాత్రం ఒకటే కన్ఫ్యూషన్.

 

ఉన్నట్టుండి సింహాసనం అధిష్టించబోతున్న మహారాజు , ఎవ్వరు ఊహించని పని చేసాడు. అక్కడి మంత్రి ఒకడిని పిలిచి, ” ఈ రాజ్యం మీది. మన రాజ్యం కోసం సర్వస్వము ఆరోపించిన మహామంత్రి శ్రావణ కుమారుడిని , మహారాజు గా ఈ రాజ్యానికి నియమిస్తున్నాను. షాక్ నుండి తేరుకున్న ప్రజలు వెంటనే, ఒక్క క్షణం అర్ధం కాక, మరు క్షణం అతని విశాల హృదయాన్ని చూసి ” మాహారాజు కి జై , లోక సార్వభౌముడికి జై ” అని కొనియాడారు.

 

తిరిగి స్వదేశానికి పయనం అవుతున్న మహారాజు , అతని కుమారుడు డేవిడ్ ఒకే పల్లకి లో కూర్చుని ఉన్నారు. రాజ్యం గెలిచినప్పటి నుండి కుమారుడి మౌనాన్ని చూస్తున్న తండ్రి ఇక ఉండబట్టలేక అతన్ని అడిగాడు

 

మహారాజు : ఏమైంది బంగారు తండ్రి … ఎందుకలా విచారంగా ఉన్నావు

డేవిడ్ : నాన్న గారు … నాకు ఏమి అర్ధం కావడం లేదు

మహారాజు : ఏం అర్ధం కావడం లేదు??

డేవిడ్ : అసలు ఆయుధం పట్టకుండా , యుద్ధం చెయ్యకుండా మీరు ఈ రాజ్యాన్ని ఎలా గెలిచారు. అదీ ఇంత  పెద్ద రాజ్యం.

మహారాజు : ఓస్! అంతేనా. సింపుల్ తండ్రి. అందరూ యుద్ధం అంటే కర్రలతో, కత్తులతో కొట్టుకోవడం అనుకుంటారు . కానీ , నేను ప్రయోగించిన తంత్రం వేరు

డేవిడ్ : (ఉత్సాహంగా ) ఏంటది నాన్న గారు?

మహారాజు : వర్తకం. వ్యాపారం ద్వారా ఈ దేశాన్ని ఓడించేసాను.

డేవిడ్ : అవునా. అదెలా సాధ్యం?

మహారాజు : అన్నింటికంటే ముందు ఇక్కడ ప్రజల ఆరోగ్యం , అలవాట్లు చక్కటివి. ముందు వాటి పై దాడి మొదలు పెట్టాను. ముందు మన తిండి, హోటళ్లు, రోజు వారి పనులు మానేసి పబ్బులు, ఇంకా కొత్త రకాల సరదాలు అలవాటు చేసాను. కష్టం తక్కువ చేసి, ఎక్కువ ఫోన్ మాట్లాడితే డబ్బులు బాగా వచ్చే ఉద్యోగాలు అలవాటు చేసాను. జనాలు సోమరి గా మారిపోయారు.

డేవిడ్ : తరువాత

మహారాజు : వాళ్లకున్న మంచి తిండి అలవాట్లు మానేసి మనం విసిరే రొట్టెలను, కోడి ముక్కలను, రెట్టింపు డబ్బు పెట్టి కొనిపించాను. దాంతో వారి శరీరాలను సార హీనంగా మార్చాను. వ్యవసాయం చేసే వాడికి ఎక్కడ చూసినా , కబుర్లు చెప్పి డబ్బులు దండుకునే వారు కనిపించడంతో , పూర్తిగా స్వా ఆహార పరిశ్రమ అంతరించింది. తిండికి మన దగ్గర కరువు చాచారు. దాంతో పోరాటం చేసే వారు తగ్గిపోయి. వీళ్లకు ఉత్పత్తి, గౌరవం లేక మన దేశాలకు వెళ్లిపోయారు.

డేవిడ్ : నిజంగా నీ బ్రెయిన్ సూపర్ నాన్నా ?


 

మహారాజు : ఇక తీరిందా నీ సందేహం.

డేవిడ్ : లేదు ఇంకో ప్రశ్న?

మహారాజు : ఏంట్రా తండ్రి. నీ బుర్రంతా ప్రశ్నలే. బంగారు కొండ.

డేవిడ్ : మరి. ఇంత కష్టపడి సంపాదించిన రాజ్యం వారికే ఎందుకు అప్పచెప్పావ్

మహారాజు : ఆక్రమించే క్రమంలో ఒక పెద్ద పొరపాటు చేశా.

డేవిడ్ : ఏంటది

మహారాజు : ఇక్కడ ప్రచారకులు ముప్పాతిక మందికి డబ్బులు పంచాను. వాళ్ళు ప్రజలని మన దోపిడి గురించి మాట్లాడుకోకుండా, పనికి మాలిన సమస్యల గురించి. ఎవరో చెవుల్లో గొణుక్కునే కబుర్ల గురించి , మంచి వాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళు చేసిన ఒకే తప్పుని లక్ష సార్లు వేలెత్తి చూపించేలా మార్చాను.

డేవిడ్ : అవును అలానే కదా రాజ్యాన్ని ఆక్రమించుకున్నావ్ కదా. ఇప్పుడు మార్చుకోవచ్చుగా.

మహారాజు : పరిస్థితులు మారిపోయాయి నాన్నా. ఇక్కడ ప్రజలు కూడా మోసపోతున్నారు. స్వచ్చందంగా. ఎప్పుడు చూసినా పేకాటలు , హెచ్చులు , డబ్బులు , కొడుకు – కూతుర్ల పెళ్లిళ్లు , పట్టింపులు తప్ప రోడ్డు మీదకు వస్తే చిన్న సంగతి ని కూడా పట్టించుకోవడం మానేశారు. ప్రచారకులు చెప్పేవి తప్ప – ఎదురుగా ఉన్న దేన్నీ సమస్య అనుకోలేని విధంగా తయారయ్యారు. దాదాపు 90 శాతం మంది అలా మార్చబడ్డారు.

డేవిడ్ : అర్ధం అయింది నాన్నా. కాబట్టి. నువ్వు తప్పించుకుని. డబ్బులు మనకి. రాజ్యం మన తొత్తులకి వచ్చేలా ప్లానింగ్ చేసావ్. కదా.

మహారాజు : అవును రా.

డేవిడ్ మదిలో ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకడం తో సంతోషంగా వెళ్తున్నాడు. పల్లకిలో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని , యూట్యూబ్ లో తన తండ్రి పై వచ్చిన రీమిక్స్ వీడియో చూస్తున్నాడు.

” దండాలయ్యా … మహారాజు వెర్షన్ “

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s