ప్రేమికుడు – story

తాను నా హృదయం పై జ్ఞాపకాలు రాస్తోంది 

 

ఇది ఒక తింగరోడి కథ. సారి… వాడి మీద కోపం తో అలా అనేసా లే. అసలు వాడి లైఫ్ ఎంతో వాడికే క్లారిటీ లేదు. ప్రేమిస్తున్నా అంటాడు. ఆ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. మరచిపోవాలి అంటాడు. మరుక్షణం తనని దూరం చేసుకోకూడదని అంటాడు. వీడి రోజు వారి , ముచ్చట్లు ఆ అమ్మాయి గురించి చెప్పే భావాలు విని విని చెవులు KFC రోస్ట్ లా తయారయ్యాయి.

 

నేనేం నా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్పట్లేదు. వాళ్ళిద్దరికీ mutual ఫ్రెండ్ అవ్వడం వల్ల చిరాకుతో చెబుతున్నాను. వాడి డైరీ, ఆ అమ్మాయి ముఖం వాళ్లకు చెప్పకుండా చూసాక , అదొక రకమైన కన్ఫ్యూషన్లో చెప్తున్నాను. వీళ్ళ కథ నాకెందుకు రా అనకండి. మొన్న వీడి తో నేను మాట్లాడిన మాటలు అన్ని చెప్పాక అర్ధం అవుతుంది. నేనెంత డిస్టర్బ్ అవుతున్నానో అర్ధం అవుతుంది.

 

సంతోష్ గాడు నాకు డైరెక్ట్ గా పరిచయం అయ్యి 3 నెలలు అయ్యింది, ఇండైరెక్ట్ గా 15 నెలలు. ఇద్దరం దాదాపు ఒక సంవత్సరం పాటు ” సుధీర్ గారండీ. నరేష్ గారండీ ” అంటూ extra మాటలు చెప్పుకుంటూ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడప్పుడూ ఒక అమ్మాయి గురించి చెప్పేవాడు.
” జీవితంలో చాలా ప్రేమ కథలు ఉంటాయి రా. చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. తను మాత్రం మర్చిపోలేనంత జ్ఞాపకంగా మారిపోయింది. తనతో ఉన్న కొన్ని రోజులు, మొత్తం పాస్ట్ ని చెరిపేశాయి. ఇప్పుడు కొన్ని గొడవల వల్ల ఎవడో ఒక హౌలా గాడి పని వల్ల విడిపోయాం. కానీ, తనే ఇప్పటికి happiest మెమరీ రా ” అని.
కొన్ని రోజుల పాటు మా స్టార్ట్ అప్ కంపెనీ ప్రాజెక్టుల గురించి పని చేస్తూ పోతుండగా. ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. మెరిసిపోతున్న కళ్ళతో.
” సుధీర్. ఆ అమ్మాయి ఫోన్ చేసింది రా. ఎదో linux ప్రాజెక్ట్ అంటా. కలిసి వర్క్ చేద్దాం” అని.
” మరి పాత గొడవల సంగతి ఏంటి రా ?” అని అడిగా.
” అన్నీ తనకి అర్ధం అయ్యేలా చెప్పా. అన్నీ పిచ్చ లైట్ అని అందిరా ” అన్నాడు.
ఆ రోజు మొదలు నా జీవితంలో కొత్త రకం టార్చర్. తనకోసం వాళ్ళ ఆఫీస్ కు తీసుకెళ్లేవాడు. మొదట్లో కాస్త ఓవర్ గా ఎక్సయిట్ అయ్యి మాట్లాడేవాడు , నెమ్మదిగా నానా తిప్పలు పడి నేను వేసే బ్రేకులకి ఆగడం అలవాటు చేసుకున్నాడు.
కొన్నాళ్ళయ్యాక, ఆమెకు నచ్చట్లేదని సిగిరెట్ కూడా మానేసాడు. రాను, రానూ మేము ప్రాజెక్టులు చెయ్యడం, అందరం క్లోస్ ఫ్రెండ్స్ లా మెలగడం అలవాటు అయిపోయాయి. నరేష్ గాడు, హ్యాపీ గానే ఉన్నాడు, బానే ప్రాజెక్టులు తెచ్చుకుని సంపాదిస్తున్నాడు, కానీ, వాడి గురించి టెన్షన్ నాకు పెరిగిపోతోంది. ఆ అమ్మాయి కూడా అవసరానికి మాట్లాడే టైపు కాదు.  కాస్తా ఫన్నీ గా, ఎమోషనల్ గా అన్ని విషయాల్లో ఎవరికైనా కనెక్ట్ అయ్యే అమ్మాయే. మోసం తెలియని మనిషే. కానీ, మా వోడి మీద దిగులు ఎక్కువయ్యింది. దాచుకోలేక ఒక రోజు వాడి రూమ్ కెల్లా. అప్పుడే రూమ్ కి వాడికి ఇష్టమైన సిట్టింగ్ సరంజామా పట్టుకెళ్ళా.
” మామా.  చాలా రోజుల నుండి  ఒకటి అడగాలనుంది “
” ఏంట్రా. క్లాస్ పీకుదామని వచ్చావా ??”
” నువ్వెలా కనుక్కనున్నావ్.?”
 నాకు తెలుసులే. ఈ మధ్య నిన్ను ఎప్పుడు చూసినా అదే ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది.కూర్చో ” అని కూర్చోబెట్టాడు నన్ను.

ఇద్దరం కలిసి సిట్టింగ్. నాకు pulpy ఆరంజ్ , వాడేమో breezer. సరే, అలవాటే అని కొడుతూ మాట్లాడుకుంటున్నాం.
” అసలు ఆ అమ్మాయి పైన ఎందుకు ఎమోషనల్ అవుతున్నావ్? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా “
 లేదు రా . తాను నా బెస్ట్ ఫ్రెండ్ “
” నాకేం అలా అనిపియ్యట్లా. నాక్కూడా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మాయిల్లో ఉన్నారు. అన్ని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ, నీ అంత ఎమోషన్ నాకు లేదు రా “
“అరేయ్. వదిలేయ్ రా. తనకి లవర్ ఉన్నాడు. కొంత కాలం విడిపోయి ఉందాం అని అనుకున్నారు లేరా “
గుండెల్లో బాంబు పేలినట్టు  ఐంది. అసలు మనోడి టార్గెట్ ఏంటని అర్ధం కావట్లా…
” సరే. నిజం చెప్పు! నువ్వు ఆ అమ్మాయితో ఎఫైర్ కోసం ఉంటున్నావా ?”
‘ … లో తంతా. అలంటి ఆలోచనలు లేవు తన విషయం లో. “
” మరి. ఏ అవసరం లేకుండా. ఫ్యూచర్ తో సంబంధం లేకుండా ఆ అమ్మాయి ని ఎందుకు ఇష్టపడుతున్నావ్”
” అదే నాకు తెలియడం లేదు రా. నాకు క్లారిటీ ఉంది “
” నా బొంగులో క్లారిటీ ఉంది నీకు. నిజం చెప్పు. తను ఉన్నప్పుడు నీ మొహం చుస్తే తెలిసిపోతుంది. వెయ్యి వాట్ల వెలుతురు కనిపిస్తుంది. తన ఆలోచన వస్తే అసలు ఏం మాట్లాడతావో తెలియదు. అసలే నీ లైఫ్ లో ఉన్న పాస్ట్ లవ్ స్టోరీస్ తో నాశనం అయిపోయి ఉన్నావు “
” నిజమే రా. కాదనను. కానీ , ఒకటి చెప్తా. లైఫ్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. కానీ, ఒక అమ్మాయి వస్తుంది. తను వచ్చాక ఎంత అందమైన అమ్మాయిని చూసినా చూడాలని అనిపించదు. తను నవ్వుతూ ఉన్న ఫోటోలే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది.”
” అబ్బా ఛా?? లవ్ లో పడ్డ ప్రతి సారి అలానే అనిపిస్తుంది కదా మరి “
” అలా ఎప్పుడు అనిపియ్యలేదు రా. ఒక వయస్సు దాకా ఎదో రక రకాల ఆకర్షణలు కనిపించేవి. ఇప్పుడేం కనిపించట్లేదు. తాను నవ్వుతోందా ?? లేదా ?? ఇంకేం కనిపియ్యట్లేదు “
” అరేయ్. పిచ్చోడా. తనకో లవర్ ఉందంటున్నావ్. మరి ఆ స్టోరీ వదిలి నీ దగ్గరికి వస్తుంది అనుకుంటున్నావా ?”
 రాకపోవచ్చు రా ! వాడినే లవ్ చెయ్యొచ్చు. చెప్పాలేం. తను నా లైఫ్ లో ఇప్పటిదాకా ఉంటుందో తెలియదు. 
“మరి . ఇంతమాత్రం దానికి ఎదవ సోది ఎందుకు. కాస్త వాటిని వదిలి రియాలిటీ లోకి రా…”
 రియాలిటీ తెలుసు మామా. ఇదే మొదటి సారి కాదు కదా. కానీ , నిజం మామా. లైఫ్ లో లవ్ అంటే వంద వంద వంద చెప్తాము. పెళ్లియినా మొదట్లో ఉండే affection గురించే ఆలోచిస్తాం. తను పరిచయం అయ్యాక తెలిసింది. అమ్మ , నాన్న ఇన్ని సంవత్సరాలు ఎలా కలిసున్నారో అని “
మొదటి సారి వాడి మీద ఎందుకో జాలి , వాడి మనసులో మాట వినాలని ఫీలింగ్ కలిగింది.

” సరే చెప్పు. ఎందుకు కలిసి ఉంటారు మన అందరి పేరెంట్స్ “

 

” ఒక మనిషిని నిజంగా ప్రేమించడం మొదలుపెట్టిన రోజు అనిపిస్తుంది, తాను లేకపోతె బ్రతకలేవు అని. అబ్బాయిలం కదా బాగా మొదట్లో పొసెసివ్ గా ఉంటాం. తరువాత తెలుస్తుంది. అమ్మాయిలకు లైఫ్ , తమ్ముళ్లు, ఫ్రెండ్స్, ఉద్యోగం జీవితం చాలా ఉందని. ఒక స్టేజ్ లో పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయాక తెలుస్తుంది రా. తను నిన్ను ప్రేమిస్తే కాదు, నీకు దూరంగా వెళ్లకపోతే చాలని. “
” ఇంకొన్ని రోజులు దాటుతుంది. ఎదో ఒక రోజు వెళ్ళిపోతుందని తెలుస్తుంది. అయినా అప్పుడు మొదలవుతుంది. కాసేపు కోపం , కాసేపు ఆనందం. తనతో జ్ఞాపకాలు వెతుక్కోవడం మాత్రం ప్రేమించడం అని. ఏమో నేను ఆ స్టేజ్ కి వెళ్ళిపోయా రా “

 

” నిజమే రా. నువ్వు తేరగా అన్ని చూసి పెట్టి, తన్ని బాగా చూసుకో. ఇంకొకడు ఎత్తుకెళ్లిపోతాడు. అప్పుడు మళ్లి నన్ను సిట్టింగ్ కి పిలిచి రోజు ఏడుద్దవు గాని “

 

వాడు బరస్ట్ అవుతాడు అనుకున్నా. కానీ

 

“ఏడవడం ఏంటి ? తను నాకు దూరం అయినా ఈ 6 నెలలు ఎవ్వరికి చెప్పుకోలేక ఎలా ఏడ్చానో నాకు తెలుసు రా. తన దగ్గర విలన్ గా విడిపోయా అనే ఫీలింగ్ తో, నా వల్ల తాను ఇబ్బంది పడింది అనే బాధతో ఎన్ని ఎన్ని సార్లో. దేవుడిని రోజు తిట్టుకునే వాడ్ని, ఎందుకు తనని నాకు దగ్గర చేసావ్, ఇప్పుడు దూరం చేసావ్ ? అని. కానీ, వచ్చేసింది మావా. అన్ని గొడవలయ్యాక కూడా తను నన్ను ఇంకా నమ్మింది రా. ఇంతకన్నా బెస్ట్ ఫీలింగ్ ఇంకొకటి ఉండదు. అనుకుంటాం కానీ, దేవుడు అంత శాడిస్ట్ ఏమి కాదు.”

 

 

” ఏమో చెప్పాల్సిందంతా చెప్పా. ఇక నీ సావు నువ్వు సావ్. కానీ, నువ్వు ఫ్యూచర్ లో suffer అవుతున్నావంటే మాత్రం నేను నిన్నో, తననో తంతాను.”

 

” చిల్ మామా. నాక్కావల్సింది తను సంతోషంగా ఉంటె , దానికి నేను కారణం ఐతే , అప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో దొరికే – అలాంటి ఇంకొన్ని క్షణాలు. ఎన్ని వీలైతే అన్ని.  మళ్ళి ఇంత ఫీలింగ్ రాదురా, నాకు లవ్ లో ” 
ఇక వాడి బాధ వినలేక వచ్చేసా. ఏంటో వాడి లవ్ స్టోరీ. ఇద్దరూ నా ఫ్రెండ్స్ ఏ. కానీ, వాడి పిచ్చి ని చుస్తే భయం, ఆ అమ్మాయిని చుస్తే జాలి. మొత్తం మీద శుభం కార్డు  పడితే బాగుండు అనుకున్నా.
అన్నట్టు. నా లైఫ్ లో మాత్రం ఇలాంటి లవ్ స్టోరీ రాకూడదు.

 

 

వాడిలా నేను లవ్ చెయ్యలేను. వాడిలా నేను ఆ అమ్మాయి కోసం ఏదైనా ఓర్చుకునే రకం కాదు.
ఎంతైనా  వాడు MANA FRIEND RAAAAAW.

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s