అర్ధరాత్రి రైల్వే స్టేషన్

అర్ధ రాత్రి రెండు అవుతోంది. తిరుపతి రైల్వే స్టషన్ అప్పుడప్పుడు వచ్చే రైళ్ల అలికిడితో , స్టాటియం అనౌన్స్మెంట్ లతో నిద్రపోతూ లేస్తోంది. జనరల్ భోగి ఎక్కాల్సిన జనాలు స్టేషన్ ప్లేట్ ఫారం పైన పడుకున్నారు. అక్కడక్కడా RPF పోలీసులు, ఇద్దరు ముగ్గురు రైల్వే స్టాఫ్ తప్ప పెద్ద జన సంచారం లేదు.

సత్తి బాబు ఇంకా అక్కడే ఉన్నాడు. చుట్టూ 4 తోటి ఉద్యోగులతో. అతను చెప్పింది వింటూ అందరూ నోరెళ్ళబెట్టి వింటున్నారు.

విచిత్రం ఏమిటంటే, సత్తి బాబు అతని నలుగురు స్నేహితులు సాయంత్రం 5 ఇంటికే ఇంటికి వెళ్లిపోయుండొచ్చు. కానీ, ఆ రోజు మాత్రం ఇంటికి వెళ్లకుండా కూర్చుని ఉన్నారు. ఎలాగూ అవతలి రోజు వారికి సెలవు దినం.

విషయం ఏమిటంటే, సత్తి బాబు ఆ స్టేషన్ లో రైల్వే పారిశుద్ధ్య కార్మికుడు. స్టేషన్ మొత్తం ఊడవడం అతని పని. పొద్దున్న 4:30 కు లేచి , 5 ఇంటికల్లా రేణిగుంట వద్ద బస్ ఎక్కి వచ్చేస్తాడు. రోజంతా 12 గంటల పాటు స్టేషన్ లోని చెత్త, ట్రాకుల మీద ఉండే మలాన్ని తీసి శుద్ధి చేస్తాడు. కేవలం 8500 వేలతో కుటుంబాన్ని నెట్టుకు రావాలి. అతని జీవితం ఎంత దుర్భరం అంటే డ్యూటీ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి , భార్య పిల్లలని అస్సలు ముట్టుకొనివ్వదు. స్నానం చేసి వచ్చిన ఒంటి మీది దుర్గంధం పోదు. వారాంతంలో , తన తోటి శ్రామికులతో కూర్చుని ప్లేట్ ఫారం చివర్లో చీకట్లో మందు కొడుతుంటాడు.

అది 2017 జూన్ మాసం. సాయంత్రం ఎప్పటిలాగే ఓని పూర్తి చేసుకుని, శనివారం కాబట్టి సిట్టింగ్ కోసం రెడి గా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. సత్తిబాబు స్నేహితుడు మోగిలయ్య మందు, చికెన్ కోసం ఊర్లోకి వెళ్ళాడు. తిరిగి వచ్చి అందరూ కూర్చుని ప్లేట్ ఫారం కి అవతలి మందు ఏశారు. ఇక రిలాక్స్ అవుదామని వెళ్తున్న సత్తి బాబుకి కనిపించింది వొళ్ళు జలదరించే దృశ్యం.

రాత్రి 12:45 అయ్యింది. 10 వ నెంబర్ ప్లేట్ ఫారం పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అటు వైపు ఎక్కువ మంది రారు కాబట్టి లైట్లు కూడా వేసి లేవు. చీకట్లో ఎదురుగా కనిపించిందోక రూపం. ఒక డిగ్రీ కుర్రాడు ఒంటరిగా తల ఒళ్ళో పెట్టుకుని, వీపుకి బాగ్ తగిలించుకుని కూర్చున్నాడు.

” యోరు బాబు నువ్వు.”
అటు వైపు నుండి సమాధానం లేదు.
” యాడికి పోవాలా”
ఇంకో సారి అడిగి , సమాధానం రాకపోవడంతో దగ్గరి కెళ్ళి పిలిచాడు. అప్పుడు తల ఎత్తి చూసాడు ఆ అబ్బాయి. 16 ఏళ్ళుంటాయి. ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు ఉన్నాడు.

” ఎక్కడికి లేదంకుల్”
” కాదు మా. ఇంట్లో గొడవ పడి వచ్చినావ. ఏంది”
“లేదంకుల్. జస్ట్ హాలిడే స్టేషన్ చూద్దామని వచ్చా. ఇక్కడే ఉండిపోవలని అనిపించింది”
” ఇంట్లో అమ్మా, నాయున బెంగ పెడ్తరేమో . పొమ్మా . ఈ platform కాడ ఒక్కడివే ఎందుకు ఉండేది  ”
“సరే అంకుల్.”


ఇంకెంత చెప్పినా మాట విననట్టు అనిపియ్యడంతో ఇక వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యి వెనక్కు తిరిగి తన స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాడు. పిల్లవాడు అలాగే నిటారుగా కూర్చుని ఉన్నాడు. మళ్ళీ ఒక సారి వివరాలు కనుక్కుందామని వెనక్కు తిరిగి. చూసాడు. అక్కడ పిల్లవాడు లేడు. 5 క్షణాలు కూడా కాలేదు. ఆ పిల్లవాడు మాయం అయిపోయాడు. ఆ కాస్త గాప్ లో ఎక్కడికి వెళ్ళిపోయాడు కనిపించకుండా అని బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయాడు.
తీరా జరిగింది ఫ్రెండ్స్ కి చెప్పగా, “రేయ్ ముండ నాయాల . ఆ పిల్లకాయ నాక్కూడా నిన్న కనిపించిన్ డ్ల. అని ఎవరికి వారు అదే అబ్బాయి గురించి చెవుతున్నారు. ఉన్నట్టుండి వాళ్ళల్లో ఒక్కడికి బుర్ర పని చేసింది.

” రేయ్.ఉండ్రా.”
అందరూ అతన్ని తల తిప్పి చూసారు.
” వాడు ఏ రంగు చొక్కా వేస్కునింది”
“…”
” మీద బాగ్ వేస్కున్నాడా”
” అవును బా”
” రే. సంవత్సరం క్రితం ఆ పిలగాడ్ని, అదే బట్టలో చూసినా రా. వారం రోజుకు అదే చొక్కా. వాడి కండ్లు ఎర్రగా ఉన్నాయా”
” అవును బా”

అప్పుడు అర్ధం అయ్యింది అందరికీ. ఇందులో ఎదో భయంకరమైన నిజం ఉందని. సంవత్సరం నుండి వారిలో అందరికీ ఒకే రకంగా ఒక పిల్లవాడు కనిపించాడు. అప్పటికే 10 వ నెంబర్ ప్లేట్ ఫారం కు కాసింత పుకార్లకు అడ్డాగా ఉంది. కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఎక్కువ గస్తీ తిరగడానికి ఇష్టపడరు. అలాంటిది, ఒకే రూపంలో ఒక మనిషి నెలల తరబడి వస్తున్నారంటే ఏమయ్యుంటుందని భయం పట్టుకుంది. అప్పుడప్పుడూ ప్రయాణికులకు మాత్రం సరిగ్గా ట్రైన్ వచ్చే సమయంలో పట్టాల మీద ఒకళ్ళు పరిగెడుతున్నట్టు ఇంతక ముందు వాళ్ళు విన్నారు.

నలుగురూ నడుచుకుంటూ వెళ్లి, స్టేషన్ మాస్టర్ కు జరిగింది వివరించారు. ఆయన, ” బ్లడీ ఫూల్స్ తాగి రూమ్ లో కి వస్తార్రా. పైగా దయ్యం అని కబుర్లు మీకు. బయట ఎక్కడైనా అన్నారా, మొత్తం అందరిని ఉద్యోగం లోనుంచి తీసి పడేస్తా జాగ్రత్త ” అని బెదిరించి, పంపించేసాడు. బయటకు వచ్చిన నలుగురూ ఒకళ్లను వదలకుండా ఇంకొంత మందిని పోగేసుకుని కానిస్టేబుల్స్ తో జరిగింది చెప్పి అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ పిల్లవాడు కూర్చుని పిల్లర్ అలానే ఉంది. పిల్లవాడి ఆచూకీ మాత్రం దొరకలేదు.

లోపలున్న స్టషన్ మాస్టర్ మాత్రం నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే అల్మారా లో ఫైల్స్ అమార్చబడి ఉన్నాయి. వాటి మధ్యలో ఒక న్యూస్ పేపర్ ఉంది. అందులో ఇలా ఉంది.

” ఏప్రిల్, 25, 2007: తిరుపతి స్టేషన్ లో ఇంటర్మీడియట్  విద్యార్థి ఆత్మ హత్య. పారాయణ కాలేజీలో చదువుతున్న 16 ఏళ్ల నవీన్ అనే యువకుడు నిన్న సాయంత్రం 7 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ లో వస్తున్న లోకల్ ట్రైను కింద పడి నలిగి చనిపోయాడు. అతని శవం గుర్తించని విధంగా ఛిద్రమై ఉంది. కాలేజీ లో వేధింపులకు తట్టుకోలేకనే ఇలా ఆత్మ హత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s