మొండి – 4 : డ్యామ్

జైల్లో కూర్చుని ఒంటరిగా ఆలోచిస్తున్న వీరు కి మనసులో వందల కొద్దీ ఆలోచనలు మెదులుతున్నాయ్. ఒక్కో సారి అన్నీ

తెలిసినప్పుడు వచ్చే ఆనందం కంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వాళ్ళ వచ్చే భయం బాధపెడుతుంది. తనని

ఇక్కడ దాకా తీసుకువచ్చిన ఒక్కో సంఘటనని , దాని వెనుక ఉన్న ప్రతి మనిషిని లెక్కగా రాసుకుంటున్నాడు. అందులో పేర్లు

ఇంతక ముందే , జైలర్ తొక్కి పడేసిన లిస్ట్ లో ఉన్నవి.

అసలు తను ఇక్కడికి ఎలా వచ్చాడు. బి.టెక్ చదవటానికి ఇబ్బందులు పడ్డ అతను, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి నేరాల్లో

ఎలా భాగం అయ్యాడు. ఊహిస్తే, తనకేం అర్ధం కావడం లేదు.

తనని, ఇటు వైపు తిప్పిన మొదటి సంఘటన గురించి ఆలోచిస్తున్నాడు.

నాగార్జున సాగర్ డ్యాం

అది నాగార్జున సాగర్ డాం. ఇంజినీరింగ్ కాలేజీ లో CSE , 2nd year స్టూడెంట్స్ అందరూ కలిసి టూర్ కోసం అక్కడికి వచ్చారు.

పేద కుటుంబం నుండి వచ్చిన వీరు, ఇంకా అందరితో అంత ఫ్రీ గా మూవ్ అవ్వలేకపోతున్నాడు. క్లాసులో అతని చదువు కూడా

అంతంత మాత్రమే. ఒక్క మాథ్స్ సంబందించిన టాస్కుల్లో మాత్రమే అతను స్పెషల్.

వాళ్ళని తీసుకొచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి అందరికీ అక్కడున్న ఒక్కో ప్రదేశాన్ని చూపించి లోకల్ ఇంజనీర్ సహాయంతో

explain చేస్తున్నాడు. లోపల నీటితో తిరిగే టర్బైన్లు వాటి పని చేసే తీరును చెబుతున్నాడు. కానీ, అందరి దృష్టి ఎక్కువగా

సెల్ఫీలు, ఫోటోలు నాగార్జున కొండ అందాలు మీద ఉంది. కాబట్టి రవికి తను చెప్పే విషయం వెస్ట్ అనిపిస్తోంది. అప్పుడే

గమనించాడు, తాను చెప్పిన ప్రతి దానికీ నోట్స్ రాస్తూ ఎదో పరధ్యానం లో ఉన్న వీరు.

మిగతా వాళ్ళతో కలిసి టైం వెస్ట్ చేసుకోవడం కన్నా , ఎప్పటినుండో తాను గమనిస్తున్న వీరు కి కొన్ని విషయాలు చెపుదాం అని

ఫిక్స్ అయ్యాడు. స్టూడెంట్స్ కి వివరించే పని పక్కనున్న వేరే స్టాఫ్ కి అప్పగించి, వీరు వైపు నడుచుకుంటూ వెళ్ళాడు.

రవి : ఏం రాస్తున్నావ్ వీరు

వీరు : ఎదో సార్. మీకెవ్వరికి అక్కర్లేదు లే.

నోట్స్ తీసి చూసాడు. హైడ్రో డైనమిక్స్. చిన్నప్పుడు స్కూల్ లో చదివిన పాఠానికి ఇప్పుడు చూస్తున్న టర్బైన్ లకు లింక్

చేస్తున్నాడని అర్ధం అయ్యింది.

తనతో పాటు రమ్మని సైగ చేసాడు వీరు కి.

ఇద్దరు నడుచుకుంటూ నాగార్జున సాగర్ డాం కంట్రోల్ యూనిట్ లోపల, ఒక్కో ఫ్లోర్ మెట్లు దిగుతూ మాట్లాడుకుంటున్నారు.

రవి : హైడ్రో డైనమిక్స్ అంటే ఇంటరెస్ట్ .

వీరు: అదేం లేదు సార్. చిన్నప్పుడు చదివిన వాటర్ ( హైడ్రో) లాస్ అన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నా. ఊరికినే అన్ని సబీజెక్ట్స్

అప్ప్లై చేస్తే బావుంటుంది కదా.

రవి: ఓహ్ అవునా.

వీరు: హైడ్రో డైనమిక్స్ కి ఎలెక్ట్రిసిటీ థియరీలు అన్నీ కలిపి ఎంత పెద్ద ప్లాంట్ కట్టారు కదా సార్.

రవి: నిజమే వీరు. మొత్తం, అన్ని బ్రాంచుల మిక్స్ ఉంటుంది మనం రియల్ లైఫ్ లో ప్రాజెక్ట్ చేసినా. నీ ఫ్రెండ్స్ ని చూడు, ఒక్క

కోడింగ్ చెయ్యడానికి నాలుగు ఏళ్ళు పాటు నేర్చుకుని ఏడుస్తుంటారు. బయట వచ్చాక కంపెనీలలో కూడా అదే అవుతుంది

వాళ్ళ పరిస్థితి. ఒక లెవల్ దాటి ప్రపంచాన్ని చూడలేరు.

వీరు: ఏమో సార్. అందరూ అలానే ఆలోచించరు కదా.

ఇద్దరూ కాసేపు మౌనం దాల్చి నడుచుకుంటూ వెళ్తున్నారు. గోడ నుంచి నీటి శబ్దం వస్తుంది. కిందకి 4 ఫ్లోర్ దగ్గరికి వచ్చేసరికి

మళ్ళీ మాటలు మొదలు పెట్టాడు.

 

రవి: నిజమే వీరు. అందరూ అలానే ఉన్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ, వీళ్ళలో ఎవర్ని చూసినా ఒకే ఆలోచన కనిపిస్తుంది.

సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి. కానీ, ఫ్యూచర్ లో మనం అందరం settled గా ఉండటానికి పని చెయ్యాలంటే మాత్రం మంది

ముందుకు రారు.

వీరు: అర్ధం కావడం లేదు సర్.

రవి: సరిగ్గా ఆలోచించు డిసాస్టర్ జరిగినప్పుడు మాత్రమే మన దేశంలో అందరూ గోల చేస్తారు. కానీ, డిసాస్టర్ కి ముందు మనం

ఎంత prepared గా ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి అని ఎంత మంది ఆలోచిస్తారు.

వీరు: ఏమి చేయగలం సర్. సిస్టం మొత్తం అలా ఉంటే.

రవి: తప్పు సిస్టం ది కాదు వీరు. బలవంతుడిది.

వీరూకి ఫ్యూస్ లు ఎగిరిపోయాయి. బలవంతుడిది తప్పు అంటే సమాజం లో ఉన్న పెద్ద వాళ్ళది అంటాడేమో అనుకున్నాడు.

రవి : దెబ్బ తిన్న దేశాన్నైనా చూడు. టాలెంట్ ఉండి అవసరానికి పనికి రాని వాళ్ళు ఎక్కువ ఉండటం వల్లే నష్టాలూ

జరుగుతాయి. . అన్ని స్కాముల్లో కూడా ఇదే జరుగుతుంది. బలవంతుడికి అవకాశం దొరక్క, లేదా సరిచేయగలిగి కూడా

సరిచెయ్యక.

వీరు: నిజమే మరి బలవంతుడు….

వీరుని సైలెంట్ గా ఉండమని సైగ చేసాడు రవి. ఇద్దరూ కలిసి 8 ఫ్లోర్ కి వచ్చారు. అది నాగార్జున సాగర్ డాం అండర్ గ్రౌండ్ లో

చివరి ఫ్లోర్. పైన ఉన్న మెషీన్ గోల మొత్తం ఆగిపోయి ఉంది.

రవి: వెయిట్! ఒక్క సారి గోడను చూడు

వీరు: వింటున్నా సార్. వెనుక గోడ నుండి వస్తున్న వాటర్ సౌండ్.

రవి: అది కొన్ని వంద మీటర్ల వెడల్పు ఉండే గోడ. దాని వెనుక, కొన్ని వేల మీటర్ల నీటి బలం ఉంది. ఇప్పుడు శబ్దం విను.

వీరు వినడం మొదలుపెట్టాడు. అదే నీటి శబ్దం భయంకరం గా వినిపిస్తోంది అతనికి ఇప్పుడు. చుట్టూ భయంకరమైన రాతి

నిశబ్దం. వెనుక నీరు కదులుతున్న శబ్దం. ఒక్క క్షణం గోడ మాత్రమే అన్ని వేల కిలోమీటర్ల నీటిని అపుతున్నదన్న విషయం

గుర్తొచ్చి చిన్నగా వణికిపొయడు వీరు.

రవి: ఇప్పుడు మనం పక్కన ఉండగా ఇంత పెద్ద డాం బద్దలయితే ఎలా ఉంటుందో ఉహించుకో.

తాను ఉండగానే అది పగిలితే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకుంటున్నాడు వీరు. చిన్న చీలిక వచ్చిన లక్షల టన్నుల

నీటి పవర్ బయటికి వచ్చేస్తుంది. తను మాత్రమే కాదు , లక్షలాది మంది జనం మాయం అయిపోతారు గంటల్లో.

రవి: ఇంత పెద్ద నదిని ఆపే శక్తి వరదలు రాకుండా కాపాడగలిగే శక్తి కాస్త గోడకు ఉంది. అదే బలవంతుడు అంటే.

బలవంతుడు సరిగ్గా పని చెయ్యకపోతే ఇందాక నువ్వు అనుకున్నదే అవుతుంది.

ఆసక్తిగా వింటున్న వీరూకి అప్పుడే ఒక భయంకరమైన నిజం చెప్పాడు

రవి: ఇప్పుడు డాం కూడా అదే ప్రమాదం లో ఉంది.

వీరు: అది మీకెలా తెలుసు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s