మొండి 6 : రహస్యం

రవి సార్ పిలిచారని వినగానే  దివ్య తో మళ్ళీ మాట్లాడతానని చెప్పి  క్యాంటిన్ నుండి పరుగు తీసాడు వీరు.

” ఏంటోరా బాబు. ఆ పిల్ల నాతొ మాట్లాడాలి అనుకున్నప్పుడే అందరూ నా మీద పడతారు ” అని మనసులో తనని తానూ తిట్టుకుంటూ స్టాఫ్ రూమ్ లో కి వెళ్ళాడు. స్టాఫ్ రూమ్ లో రవి ఒకళ్ళే ఒంటరిగా కూర్చుని కంప్యూటర్ మీద ఎదో టైపు చేస్తూ ఉన్నాడు.

వీరు సైలెంట్ గా రవి సార్ ఏదైనా చెప్తారా అని పక్కన కూర్చుని ఉన్నాడు. కాసేపు పాటు రూమ్ మొత్తం మౌనమే ఉంది. రవి ఎదో టైపు చేస్తూ ఉన్నాడు. వీరు కి ఎం అర్ధం కాక , సార్ అని మాట్లాడేలోపల రవి మొదలుపెట్టాడు.

” వీరు. లాస్ట్ మంత్ ప్రాక్టికల్ క్లాస్ లో ఎదో ప్రోగ్రాం రాసా అన్నావ్ ”

” అవును సార్. ”

” నాకు గుర్తు రావడం లేదు. దేని గురించి అన్నావ్, అది ”

” సార్! అది పాపులర్ పజిల్ 3301 ఉంది కదా. దాన్ని ఎలా సాల్వ్ చెయ్యొచ్చో, దాని గురించి రాసా ”

” సరే! నాతొ రా. ” అని వీరు ని కాలేజీ నుండి బైక్ లో తీసుకెళ్లాడు.

ఎక్కడికెళ్తున్నారో వీరు కి అర్ధం కావడం లేదు. ఊరికినే కాసేపు బళ్ళు, రోడ్ల మీద ఉన్న బస్సు లు అన్ని చూస్తూ  బైక్ వెనుక సీట్ లో కూర్చున్నాడు. ఎదో సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ పని మీదనే తీసుకెళ్తున్నాడని మాత్రం ఫిక్స్ అయ్యాడు మనస్సులో.

వెళ్తున్న బండి కాస్త పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఆపాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి. ఎదురుగా పోలీస్ జీపులో ఉన్న ఒక ఆఫీసర్ కి  నమస్తే చెప్పాడు. బండి ఫాలో అవ్వమని, చెప్పి వెళ్ళిపోయాడు ఆఫీసర్. రవి అలానే ఫాలో అవుతూ, ఖైరతాబాద్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు.

వీరు కి మనస్సులో పోలీసుని చూడంగానే ఏదో అనుమానం మొదలయ్యింది. మొన్న చెప్పిన బ్లాస్ట్ అన్న మాటకి ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్తున్న, సందర్భానికి ఉన్న లింక్ ఏంటా అని ఆలోచిస్తున్నాడు.

చివరికి లక్డికాపూల్ లో రాజ్ దూత్ హోటల్ కి దగ్గర ఉన్న ఒక బిల్డింగ్ కి పట్టుకెళ్ళాడు. లోపల మొత్తం 1970లలో కట్టిన బంగాళా లా ఉంది అది. బయట మొత్తం పాడుపడిన , ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇక, కాసేపట్లో ఎలాగూ తెలుస్తుంది కదా అని వీరు ప్రశ్నలు అడగకుండా అలానే నిశబ్దంగా ఉన్నాడు.

ఇద్దరు కలిసి ఒక గదిలోకి అడుగు పెట్టారు. ఇందాక చుసిన కారులోని పోలీస్ ఆఫీసర్ ని చూసాడు. అతనితో పాటు ఒక కాస్త పెద్ద వయస్సులో ఉన్న ఆఫీసర్ కూడా టేబుల్ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు.

వీరు ని అక్కడున్న ఇద్దరికీ ” సార్. ఇతనే వీరు ”

ఇద్దరూ పలకరించినట్టు  సైగ చేసారు. వీరు కూడా ఏమి తెలియక , అర్ధం కాక కన్ఫ్యూషన్ లో అదోరకం నవ్వు నవ్వాడు.

” వీరు. నీ గురించి అన్ని తెలిసాకే ఇక్కడకి తీసుకు వచ్చాము. ఈయన ఇంటర్పోల్ ఆఫీసర్ మహేష్ దత్ , ఇందాక మనకు విష్ చేసింది ఆయనే. అక్కడ కూర్చుంది ఇంటెలిజెంట్ బ్యూరో ,డైరెక్టర్. ”

” తెలుసు సార్ . మీరు లక్ష్మి కాంత్ గారు. టివిలో చూసాను.” అని వీరు మధ్యలో కలగచేసుకున్నాడు.

” వీరు! నువ్వు సాల్వ్ చేసిన అల్గారిథమ్ దేని గురించి.”

” అదే సార్! బ్రాంచ్ అసోషియేషన్ లో ఒక రోజు సీసాడా 3301 అనే ఒక పజిల్ ఇచ్చారు సార్ అందరికి. దాన్ని సాల్వ్ చేశాను ”

మహేష్ దత్ , లక్ష్మి కాంత్ ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఇంకొకళ్ళు నమ్మలేనట్టు చూసారు.

” వెల్ ! ఎలా చేసావు ” అని మహేష్ దత్ అడిగిన ప్రశ్నకి , సమాధానం మొత్తం అర్ధం అయ్యేలా చెప్పాడు వీరు.

నువ్విప్పుడు ఒక పెద్ద ఆపరేషన్ లో పని చెయ్యాలి. నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ కొన్ని లక్షల మందిని సేవ్ చేస్తుంది. చేస్తావా??


(1 . cicada 3301 ప్రపంచం మొత్తాన్ని కొన్ని నెలల పాటు తలపట్టుకునే లా చేసిన వెబ్ పజిల్. 2007 లో వచ్చిన ఈ సైట్ ఎందుకు ఈ పజిల్స్ పెడుతుందో. దీని వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటిదాకా తెలియదు. )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Powered by WordPress.com.

Up ↑

%d bloggers like this: