మొండి 7 : పజిల్

నువ్వు చెయ్యాల్సిన పనల్లా , మేము ఇచ్చిన కొన్ని కోడ్స్ క్రాక్ చెయ్యాలి.

వీరు కి ఆ మాట వినగానే మొదట అర్ధం కాలేదు. కాంటీన్ దగ్గర బయలుదేరడం దగ్గర్నుంచి జరిగింది ఒక్క క్షణం మైండ్ లో తిరిగింది. పోలీసులు , సార్ పట్టుకురావడం – ఒక ప్రమాదం – కోడ్ క్రాక్ చెయ్యడం. వీటన్నింటికి లింక్ ఏమిటి అని ఆలోచించి చూసాడు.

కరెక్ట్ , కోడ్ ని క్రాక్ చెయ్యడం అంటే వాళ్ళ దగ్గరున్న సమాచారాన్ని క్రాక్ చేసి దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కనుక్కోవాలి.

అందరూ అల్గోరిథమ్స్, క్రిప్టోగ్రఫీ మీద ప్రయోగాలు చేస్తారు కాలేజీ లో. కానీ ఏకంగా 3 వ సంవత్సరమే డైరెక్ట్ గా పెద్ద ప్రాజెక్ట్ లో పని చేసే అవకాశం వచ్చిందని అర్ధం అయ్యింది.

” వీరు. ”

ఆలోచనల్లో మునిగి ఉన్న వీరు , మహేష్ దత్ పిలుపుతో మళ్ళీ లోకంలోకి వచ్చాడు.

టేబుల్ మీద ఉన్న చిన్న కాగితం తీసి, దాని పైన ఒక వాక్యం రాసి ఇచ్చాడు.

” నీకు ఇప్పుడు ఇచ్చింది, ఒక టెర్రరిస్ట్ నుండి వచ్చిన మెసేజిల్లో ఒకటి. హైదరాబాద్ లో ఎవరికో మెసేజ్ పంపాడు. ”

కాగితం పై ఇలా రాసి ఉంది.

admit your tempered babe’s crazy childishness

మహంతి  : ఇది, మాములు గా వచ్చిన చాట్ మెసేజ్ అయ్యి ఉంటే పట్టించుకునే వాడిని కాదు. కానీ, ఐపీ అడ్రస్ పాకిస్తాన్ కు చెందిన ప్రాంతం నుండి వచ్చింది. అది కూడా ఒక్కటే వాక్యం.

చుసిన వాక్యాన్ని ఎలా క్రాక్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు వీరు. మొదటి ప్రయత్నం గా ఆ వాక్యానికి అర్ధం కనుక్కోవడానికి ప్రయత్నించాడు. 10 నిమిషాల్లో అని చెప్పింది కాస్తా  రెండు గంటలు అయ్యింది. పక్కనే ఉన్న మహంతి , ఇద్దరూ ప్రశాంతంగా అతనినే చూస్తున్నారు.

ఇక తన వల్ల కాదు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి వాళ్ళ వైపు చూసాడు. మహంతి, లక్ష్మీ కాంత్ ఇద్దరూ రవి సార్ వైపు కోపంగా చూసారు.

” ఓకే. You tried your best” అని లక్ష్మి కాంత్ అనబోతుండగా వీరు నోట నుండి వచ్చిందొక మాట.

” ఎప్పుడో అయిపోయిన ఫైల్ ని నాకు చూపిస్తున్నారు.”

ఒక్క సారి గా రూమ్ లో ఉన్న ముగ్గురికి షాక్ కొట్టినట్టు ఐయింది.

ఇద్దరు పోలీస్ ఆఫీసర్ లు ఆశ్చర్యపోవడం ఆనంద పడటం క్షణాల్లో జరిగిపోయాయి.

” గుడ్. ఎలా చెప్పావు”

” admit your tempered babe’s crazy childishness అని నాకు ఇచ్చారు. అంటే దీనిలో ఉన్న రహస్య సమాధానం కనుక్కోవడానికి ఎన్ని రకాల దార్లు ఉన్నాయో ఆలోచించాను”

రూమ్ లోని మిగతా ముగ్గురూ ఆసక్తిగా వింటున్నారు.

” మొదట ఈ వాక్యం లో దాచిన అసలు పదంగాని, వాక్యం గాని ఏముంటుందా అని ఆలోచించా.

1. పాత కాలంలో లా  మొదటి, లేదా చివరి అక్షరాలను తీసి చూస్తే ఎలా ఉంటుంది.

‎2. లేదా ప్రతీ పదంలో మొదటి అక్షరాల్ని  తీసి వేస్తే ఎలాంటి వాక్యం వస్తుంది అని
కానీ, సమాధానం దొరకలేదు.

అందుకే, అల్జీబ్రా స్టైల్లో వెతికి చూసా. సమాధానం దొరకలేదు.

3. చివరికి ప్రతి పదంలోని రెండవ అక్షరం వేరు చేసి రాసినా ఏమి దొరకలేదు.

4. మూడవ అక్షరం …. అప్పుడు దొరికింది. ప్రతి పదం లోని 3వ అక్షరాన్ని తీసేస్తే M , U, M , B , A ,I
adMit your tempered babe’s crazy childishness
మహంతికి చప్పట్లు కొట్టాలనిపించింది. కానీ, స్టైల్ గా adjust అవుతున్నట్టు నటించాడు.

” అక్కడితో సమాధానం అయిపోలేదు సార్.
admit your tempered babe’s crazy childishness
నిన్ను పిచ్చిగా ప్రేమించే అమ్మాయి లోని పసితనం చూడు.
tempered babe అంటే తనమీద కసిగా ఉన్న వాళ్ళు. లేదా తన పనిలో భాగస్వామ్యం అయ్యే వాళ్ళు. అంటే పోలీస్ అన్నా  అయ్యుండాలి. లేదా, తమకు ఇష్టమైన బాస్ అన్నా అయ్యుండాలి.

కాబట్టి, మీ డిపార్ట్మెంట్ నుండి ఎవరైనా వాళ్లకు సాయపడే వాళ్ళని కలవమని, లేదా వాళ్ళ బాస్ చెప్పే పనిని పూర్తిచేయడానికి ముంబై వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని.

కానీ, ఇప్పటికే. ముంబై లో పట్టుబడిన RDX, మాఫియా వ్యక్తుల కాల్చివేత వార్త వచ్చి 2 నెలలు అయ్యింది. కాబట్టి, ఇది పాత మెసేజ్ అయ్యి ఉంటుంది. ”

ఒక్క సారిగా రవి మాస్టర్ ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొట్టేసాడు.

పక్కనే ఉన్న మహంతి, లక్ష్మి కాంత్. ఒక్క క్షణం ఆగి వీరు కి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

” నువ్వు కాసేపు బయట ఉండు. ” అని వీరు ని బయటకు పంపించారు.

వీరుకి ఏదో సినిమాలో జేమ్స్ బాండ్ అయిపోయిన లెవల్లో ఆనంద పడిపోయాడు. ఇన్ని రోజులు జీవితంలో ఏం చెయ్యాలో తెలియక తర్జన పడ్డ ఇప్పుడు తనకో లక్ష్యం ఏర్పడుతుందని ఆనందపడ్డాడు.

లోపలి నుండి పావు గంట పాటు మాటలు వినిపించాక బయటికి వచ్చాడు రవి సార్.

” వీరు. ఇక్కడ జరిగింది…”

” బాగా అర్థం ఐయింది సార్. సినిమాలు చూస్తున్నా కదా. ఎక్కడా చెప్పకూడదు”

రవి పల్లికిలించి నవ్వాడు.

” ఉండు. నీకొన్ని విషయాలు చెప్పాలి. పద  ”

ఇద్దరూ బైక్ మీద బయలుదేరారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Powered by WordPress.com.

Up ↑

%d bloggers like this: