mondi – 8

బైక్ లో పోతున్న వీరు, రవి సార్ ఇద్దరూ అప్పుడే పెగ్గేసిన సూర్యోడిలా ఫుల్ కిక్ లో వెలిగిపోతున్నారు.

ఏదో చేసానని ఫీలింగ్. మరోపక్క తన లైఫ్ లో ఏం చేయాలన్న దానిపైన ఒక క్లారిటీ రెండూ వచ్చి అదో రకమైన ఆనందంలో ఉన్నాడు.
లకడికపుల్ నుండి కూకట్ పల్లి వచ్చేటప్పటికి , బండి ఆపమని
” ఇక్కడి నుండి రూం బస్ ఎక్కి వెళ్లిపోతా” అన్నాడు వీరు.
రవి సార్ సరే అని చెప్పి.
” ఎక్సయిట్మెంట్ లో ఎవ్వరికీ ఏమీ చెప్పకు. ఈ రోజు నుండి నీ లైఫ్ టర్న్ అయ్యింది వీరు ” అని చెప్పేసి వెళ్ళిపోయాడు.
బస్ లో బయలుదేరి రూమ్ కి చేరుకునేసరికి రాత్రి 10 ఐయింది.రూం లో ఉంటున్న కృష్ణ ప్రసాద్, శివ ఇద్దరూ
కలిసి ఏమైందని అడిగితే “సైన్స్ ఫెయిర్ కి స్పాన్సర్స్ కోసం వెళ్ళా” అనిచెప్పాడు. మెల్లగా మిగతా ఇద్దరూ
పడకేశారు.పడుకున్నాడంటే పడుకున్నాడనే కానీ వీరుకి ఇంకా నిద్ర పట్టడం లేదు. బుర్ర తోచడం లేదు. లేచి
లాప్ టాప్ తీసుకుని కాసేపు క్రిప్టోగ్రఫీ మీద అల్గోరితమ్స్ అన్నీ చూసాడు . ఎప్పుడు నిద్రపోయాడో కానీ,
పొద్దున్న లేచి చూస్తే లాప్టాప్ పొట్ట పక్కన పడి ఉంది.
రెడీ అయ్యి కాలేజీకి వెళ్లిన వీరు, రవి సార్ తో మాట్లాడాలని పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఆయన క్లాస్
ఇప్పుడా అని టైం చూసుకుంటూ మిగతా క్లాసులు వింటున్నాడు. ఫ్రంట్ బెంచ్ లో దివ్య కి ఇవన్నీ చెప్పాలి, ఏదో
చేశానని చెప్పాలి. ఇంకెవ్వరితో కాకపోయినా తనకు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇలా అనుకోవడమే కానీ
మళ్ళీ సార్ మాటలు గుర్తొచ్చి సైలెంట్ గా ఉన్నాడు.సాయంత్రం 3 ఇంటికి క్లాస్ కి వచ్చాడు రవి సార్ . ఆయన
క్లాస్ అయినపోయిన నెక్స్ట్ నిమిషం ఆయన దగ్గరకు వెళ్ళాడు వీరు. బయట దాకా కబుర్లు సాదా గా
చెప్పుకుంటూ తీసుకెళ్లి బైక్ ఎక్కమన్నాడు రవి.
ఇద్దరూ కలిసి పంజాగుట్ట దాకా వెళ్లారు. మళ్ళీ ఎవరినైనా పరిచయం చేస్తాడేమో అని ఆశించాడు. అక్కడే
ఉన్న సందులోని ఒక ఆఫీసు లోకి తీసుకెళ్లాడు.ఆఫీస్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లా ఉంది. వీరు ని కూర్చోబెట్టి
లాప్ టాప్ తీసుకొచ్చి ముందు కూర్చున్నాడు రవి.
” నిన్న ఆఫీసర్స్ తో టైమ్ ఎలా ఉంది?”
“బాగుంది సార్. అదేదో సినిమాలో సీన్ నిజంగా జరుగుతున్నట్టు ఉంది. “
“నిజంగా కాదు. నిజమే జరుగుతోంది. నీ టాలెంట్ తో వాళ్ళ డిపార్ట్మెంట్ కి అవసరం ఉంది. అందుకే టెస్ట్
చెయ్యడానికి నిన్న నిన్ను నాతో పిలిపించారు”
. నేను రెడి సార్.
“రెడీ అనుకుంటే చాలదు వీరు. నువ్వు చేసే వర్క్ వల్ల చాలా ప్రమాదాలు,ప్లాన్ లు వాటికి సంబందించిన ఆచూకీలు తొందరగా దొరుకుతాయి. అదే నువ్వు సరైన సమయంలో సమాచారాన్ని అందించకపోతే కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. మెంటలీ వెరీ స్ట్రైనింగ్ జాబ్. “
” పర్లేదు. నాక్కూడా అలంటి ఛాలెంజింగ్ లైఫ్ ఏ కావాలి.”
” తట్స్ గుడ్ “
ఇద్దరి మధ్యలో కాసేపు నిశబ్దం. ఆ నిశబ్దాన్ని ఛేదిస్తూ వీరు మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేసాడు.
” సార్. మొన్న డాం బ్లాస్ట్ అని అన్నారు కదా. దాని గురించి చెప్తా అన్నారు”
” హా. ఇంటెలిజెన్స్ వాళ్లకు సమాచారం వచ్చింది. “
” అది మీకు ముందే ఎలా తెలిసింది? “
” అదే ఇప్పుడు చెప్పబోతున్నా. మాములుగా అయితే ఎలా తెలుసుకుంటారు అనుకుంటున్నావు “
” హ్మ్. హాకింగ్ చేస్తారేమో. వాళ్ళ ఇంటర్నెట్ అడ్రస్ తెలుసుకుని దాని నుండి వచ్చే సమాచారం మొత్తం బయటకు తీస్తారు.”
” అదే. ఆ సమాచారం ఎలా తెలుస్తుంది??”
” ఏమో “
” ఇప్పుడు విను. బయటకు కనిపించే ప్రపంచం వేరు. మనకు తెలియని ప్రపంచం వేరు. మనకు కనిపించే గొడవల కన్నా పెద్ద పెద్ద గొడవలు , ఇంటర్నెట్ లోతుల్లో జరుగుతూ ఉంటాయి. ఆ సైట్లు ఏవి గూగుల్ లో కనపడవు.”
” గూగుల్ లో ఉండవా?”
” నీ దగ్గరుండే మాములు బ్రౌసర్ లో కూడా కనిపించవు. మొత్తం అన్ని సెర్చ్ ఇంజిన్లు కలిపినా ఇంటర్నెట్ లో ఉన్నా డేటా మనకు అందుబాటులో ఉంది 10 శాతం మాత్రం “
“మిగతా 90 శాతం? “
” డార్క్ వెబ్ “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s