mondi – dark world

“డార్క్ వెబ్”

అన్న మాట రవి సార్ నోటి నుండి ఎప్పుడు వెలువడిందో గాని, వీరు జీవితం ఆ క్షణం నుండి,

మారిపోయింది.

 

తను తెలుసుకోబోతున్న విషయం అతన్ని జివితం మొత్తం

వెంటాడబోతోంది అని తెలియక, ఇంకా ఆసక్తిగా అడుగుతున్నాడు వీరు ” అంటే ఏంటి” అని.

 

పక్కన ఎవరైనా ఉన్నారా అని స్టాఫ్ రూం మొత్తం చూసుకున్న తరువాత వీరు ని పిలిచి కంప్యుటర్

ముందు కుర్చోబెట్టుకున్నాడు, రవి.

 

” సింపుల్ గా చెప్తా విను. ప్రపంచం లో ఉన్న వెబ్సైట్లు అన్నీ ఎలా యాక్సెస్ చేస్తున్నాం ? అవి

ఉన్నాయని మనకు ఎలా తెలుస్తోంది? ”

 

” గూగుల్ ద్వారా వెతికితే  ”

 

”  అదే మరి. గూగుల్ లిస్ట్ లో కనిపించనివి. ఏ సర్చ్ ఇంజన్ లో లేనివి వెబ్సైట్లు ఎన్ని ఉంటాయి?”

 

” దాదాపుగా ఉండవు కదా సార్ ”

 

” అదే వీరు ఇక్కడ తేడా . మనకు తెలిసిన గూగుల్ , యాహు, అన్ని సర్చ్ ఇంజన్లు కలిపినా

ప్రపంచం మొత్తం మీద ఉన్న వెబ్సైట్లు 10 శాతం కు మించి మనకు దొరకవు. గూగుల్ వాడి పాలసీ ప్రకారం కూడా కొన్ని రకాల వెబ్ సైట్లను సర్చ్ లో చూపించడానికి అనుమతించదు.   “

 

” ఎలాంటి వెబ్సైట్లు లను అనుమతించరు  ?”

 

” భయంకరమైన వెబ్ సైట్లు ”

 

ఆ మాట తో రూమ్ లో కాసేపు నిశబ్దం ఆవరించుకుంది కాసేపు. నిశబ్దాన్ని ఛేదిస్తూ రవి సార్

 

” ముందు ఈ సిస్టం లోకి tor బ్రౌసర్ ని డౌన్లోడ్ చెయ్ ” అన్నాడు.

వీరు ఇంకొక మాట మాట్లాడకుండా టీఆర్ అనే సర్చ్ ఇంజన్ ను వెతికి డౌన్ లోడ్ చేసాడు.

” ఈ బ్రౌసర్ లోనే మనం డార్క్ వెబ్ ని చూడబోతున్నాము ” అని చెప్పి , ఒక వెబ్ పేజీ ఓపెన్ చేసాడు.

 

” ఇది ఒక డార్క్ సర్చ్ ఇంజన్ వెబ్ సైట్ . లిస్ట్ చూస్తున్నావ్ గా ?” అని అడిగాడు.

 

ఒక్కో వెబ్ సైట్ ఒక్కో భయంకరమైన టైటిల్ తో ఉంది.

 

చైల్డ్ పోర్న్ ., అన్న మాట చూసి ఒక్క క్షణం మైండ్ పని చెయ్యడం మానేసింది వీరు కి.

 

” సార్ ఇలాంటి సైట్లు కూడా ఎవరు పెడతారు సార్ ”

 

” ఇవే కాదు. ఇలాంటి సైకిక్ సైకిక్ ఉన్మాదుల సైట్లు చాలా ఉన్నాయి ”

 

ఇది చూడు అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాడు.

 

” ఇది అమెరికాకు చెందిన అసాసిన్స్ వెబ్ సైట్”

 

“అంటే?”

 

” ఆ దేశంలో డైరెక్ట్ గా ఇంటర్నెట్ నుండి, డబ్బులు కట్టి హంతకులను అద్దెకు వాడుకోవచ్చు ”

 

” నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా సార్ ?”

 

” లేనివి నేనెందుకు చెప్తాను. ఇందులో మనం చంపాలి అనుకుంటున్న వ్యక్తి డీటెయిల్స్ పూర్తిగా

ఇచ్చి, అతన్ని ఏం చెయ్యాలో చెబితే దాని బట్టి రేట్ కూడా ఫిక్స్ చేసి కట్టమంటారు. ”

 

” కడితే ”

 

” కట్టాక , మనం చెప్పిన ఒక డెడ్ లైన్ లోపల అతన్ని వాళ్ళు మనం చెప్పిన విధంగా

హింసించడమో , చంపడమో చేస్తారు ”

 

” మరి పోలీసులు కనిపెట్టి ఆపొచ్చు కదా సార్ ”

 

” ఆపలేరు. అసలు ఎవరు ఎవరిని చంపడానికి డబ్బులు ఇచ్చారో వివరాలు ఎవ్వరికి తెలియవు ”

 

” బాంక్ ట్రాన్సక్షన్స్ బట్టి కనుక్కోవచ్చుగా ”

 

 

” అక్కడే కిటుకు ఉంది. చంపడానికి మనం ఇచ్చిన డబ్బుని బిట్ కాయిన్స్ రూపంలోనే వారికి

చెల్లించాలి. బిట్ కాయిన్స్ అంటే ఇంటర్నెట్ లో వాడే కరెన్సీ. వారి చట్టాల ప్రకారం వాటి ఖర్చుల

వివరాలు ఎవ్వరికి తెలియనివ్వరు. స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ లాగా అనమాట”

 

 

” ఇవొక్కటే కాదు, డ్రగ్స్ కి ఫ్లిప్ కార్ట్ లాగా ఆన్లైన్ స్టోర్లు, వెపన్స్ , తీవ్రవాదుల వెబ్ సైట్లు అన్నీ ఉంటాయి దీంట్లోనే. ”

 

 

” ఇవన్నీ ఆపలేరా సార్. ”

 

 

అందుకే ప్రపంచంలో ప్రతి దేశం కూడా , కొంత మంది హ్యాకర్లను ఉపయోగించి వీటి మూలాలు ,

వీళ్ళ మధ్య సంభాషణలు అన్నింటినీ ట్రాక్ చేసి పట్టుకుంటారు.

 

 

” అర్ధమయ్యింది. ఒకే సారి బాన్ చేసినా వారి నెక్స్ట్ ఎత్తు ఏంటో అర్ధం కాదు కాబట్టి. ప్రభుత్వం ఆ

సైట్లను హ్యాకర్లను ఉపయోగించి వాళ్ళని పట్టుకోవడానికి , బ్యాన్ చెయ్యకుండా వదిలేస్తారు. ”

 

 

” అదొక్కటే కాదు వీరు. ఆ వెబ్సైట్లో కొన్ని దేశాల చెయ్యి కూడా ఉంది అని నమ్ముతారు చాలా

మంది ” 

 

 

అప్పటికి ఒక క్లారిటీ కి వచ్చారు వీరు. ఇదంతా తనకు ఎందుకు చెప్తున్నాడో, ఆలోచిస్తూ

ఉండిపోయాడు. దీర్ఘాలోచనలో పడి ఉన్న వీరు ని మళ్ళీ మాటల్లో పెట్టి మిగతా వెబ్ సైట్లు

చూపిస్తున్నాడు రవి.

 

 

” ఇప్పుడు అర్ధం అయ్యింది అనుకుంట వీరు ఇదంతా ఎందుకు చుపిస్తున్నానో. మొన్న

పోలీసులను ఎందుకు కలిశామో  ”

 

 

” మొన్న కలిసింది ఇంటర్ పోల్ ఆఫీసర్ ని . వారికి వచ్చిన ఇంఫార్మేషన్ ని బ్రేక్ చెయ్యడానికి

పిలిపించారు. టెస్ట్ చేశారు ”

 

 

” అందుకే. అందుకే . నిన్ను ఎంపిక చేసాం. హ్యాకింగ్ చెయ్యాలనుకుంటే నేనే చెయ్యగలను. కానీ ,

సీక్రెట్ కోడ్ ని బరాక్ చెయ్యాలంటే నీలాంటి వాళ్ళు కావాలి. ”

 

” అర్ధమయ్యింది సార్ ”

 

” మొన్న చెప్పిన నాగార్జున సాగర్ డ్యాం  పై బాంబ్ ఇన్ఫర్మేషన్ కూడా అందులోనే దొరికింది ”

 

ఎందుకు అని వీరు అడిగే లోపల, వేరే స్టాఫ్ టీచర్లు రావడంతో ఇక వాళ్ళ మాటలకు బ్రేక్ పడింది.

 

” వీరు ప్రస్తుతానికి ఇక్కడి దాకా తెలిస్తే చాలు నీకు. రేపు పొద్దున్న మళ్ళీ కలుస్తా. అన్నట్టు సార్

కూడా  మనల్ని రేపు. రెడీ గా ఉంది ” అని హడావిడిగా బ్రౌసర్ ని క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Powered by WordPress.com.

Up ↑

%d bloggers like this: