ఫోటోగ్రాఫర్

నేను అంతం తెలియని కాలాన్ని క్షణాలు రాసే కవిత్వాన్ని షట్టర్ స్పీడ్ లో జరిగే యుద్ధాన్ని  కళ్ళు దాటి చూసే నిజాన్ని సెన్సర్ పై గీసిన చిత్రాన్ని అందాన్ని, రక్తపాతాన్ని చూసిన నేత్రాన్ని గత కాలపు మనుషులకు అమరత్వాన్ని ఆపాదించే యంత్రాన్ని కళకు, కలకు , కళ్ళకు మధ్య జరిగిన సంఘర్షణను నిత్యం అనుభవించే వాడిని నేను చిత్రకారుడిని నవ యుగపు చరిత్రకారుడిని ఫోటోగ్రాఫర్ ని 

ప్రతి రూపం – 1

వెనుతిరిగి చుస్తే ఉపిరి ఊపిరిని, ఆస్వాదించిన ఓ క్షణం ఉంది ఎదురుగా అందమైన కల అమ్మాయిలా తిరుగుతోంది కళ్ళల్లో చీకట్లు, చూపుల్లో వెన్నెలలు కురిపిస్తూ ఉంది ఆ ఊపిరి ఎదో మాటలు చెబుతోంది, పెదవికి కవితలు నేర్పిస్తోంది  గొంతులో ఆగిపోయిన అందమైన మాటలు చెప్పెయ్యమంటోంది కన్నీళ్లు, నవ్వుల్లో కూడా ఉంటాయని కలల కన్నా నిజాలు బాగుంటాయని తన కనురెప్పల చాటున చీకటిలో మిగిలిన మరొక స్వప్న లోకంలో కనిపించే తన రూపంలో నా ప్రతి రూపం వెతుకుతున్నా 

గొప్పళ్ళం

మనమంతా గొప్ప వాళ్ళం ఎందుకంటే గాంధీ, భగత్ సింగ్ వారసులం. సుభాష్ చంద్ర బోస్ సైనికులం. మనం నిజంగానే గొప్పవాళ్ళం 70 ఏళ్ల క్రితం స్వాతంత్ర్యాన్ని ఆర్జించిన వాళ్ళం కత్తి పట్టక, నెత్తురు చిందించక , తెల్లోడికి చెమటలు పట్టించినోళ్ళం 48 ఏళ్లలో అంగారకుడిని చేరిన వారం పక్కింటోడి జీవితాన్ని బిగ్ బాస్ షో అనుకునే వాళ్ళం మనం చాలా గొప్పోళ్ళం ఆగస్టు 15 న ఖడ్గం చూసే వాళ్ళం పది మంది సమర యోధుల పేర్లు... Continue Reading →

ప్రతి రూపం – 3

నిన్నెప్పుడూ నవ్వించాలి అనుకుంటా చిరాకు తెప్పిస్తుంటా నా ఓవర్ తగ్గించాలనుకుంటా కానీ చూడంగానే అన్నీ మర్చిపోతా నీతో ఉండలనుకుంటా ఉన్న కాసేపు ఏమివ్వలేదని కృంగిపోతా నవ్వితే చూడాలనుకుంటా కారణం నేనైతే బాగుండని అనుకుంటా జనాలు లవ్ స్టోరీస్ ఎందుకు చదువుతారో ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నా నీ ప్రతి శ్వాసలో నా ఊపిరికి ప్రతిరూపం వెతుకుతూనే ఉంటా

ప్రతి రూపం – 2

వెన్నెలను తెల్ల చీర చేసుకుని ముంగురులను సరి చేస్తూ చినుకులని ఆశీర్వదిస్తూ కేరళ గట్టుపై నడుస్తూ వెళ్తోంది ఓ దేవతా రూపం ప్రతి చినుకులో కనిపిస్తున్న తన రూపాన్ని తనని ముద్దాడటానికి పోటీ పడుతున్న గాలి కెరటాల్ని తడుస్తున్న తన జడలో మెరుస్తున్న ఇంద్ర ధనుస్సుని ఆరాధనగా చూస్తూ పోల్చుకుంటున్నాడు తన ప్రతి రూపాన్ని

చెలి

తన కురులు గాలికి చేస్తున్న నాట్యం గాలిలో రాస్తున్నాయి లక్ష పదాల కవిత్వం తన పెదవిపై ప్రతి చిన్న చలనం చూడాలని కొట్టుకుంటున్నది హృదయం తానొక కదిలే నవ్వుల వసంతం తను ఉన్న చోటల్లా పసితనపు పరిమళం తన హృదయం ఎప్పటికీ అర్ధం కాని పుస్తకం నా డైరీలోని ప్రతి అందమైన కాగితం ఇదిగో అవన్నీ తనకే అంకితం  

నా గది

నేనున్న గది చాలా పెద్దది పక్కనే ఉన్నా అక్కడి మనుషులు ఎవరికీ కనిపించరు సెల్ ఫోన్ లో అప్పుడప్పుడూ టింగ్ మని మెరుస్తుంటారు నేనున్న గది అంతరిక్ష నది ఎక్కడ పడితే అక్కడ ప్రసరించే చీకటి తన చుట్టూ, తన సమాజం చుట్టూ పరిభ్రమించే మానవ గ్రహాల గది నేనున్న గది ఎర్రగడ్డ అది ఇక్కడ అందరూ పిచ్చోల్లే ఎవడికాడు పక్కనోడిని పిచ్చోడని అంటారు ప్రతి వాడికి పక్కనోడి ఇల్లు బిగ్ బాస్ హౌస్ ఏ అది... Continue Reading →

నువ్వు

నల్లని నీ కళ్ళల్లో చేస్తున్నా అంతరిక్ష యానం వెచ్చని నీ ఒడిలో కొనుక్కున్నా, అమ్మ చేతుల్లో నా బాల్యం నీ చేతిని తాకిన ప్రతి క్షణం, ఈ జన్మకు ఒక ధైర్యం తొలి రాత్రి నీ పాదాలకు రాసిన పారాణి ముట్టుకున్నప్పుడు గుర్తొస్తుంది, దేవుడు నన్నెంత ఇష్టపడ్డాడని పెదవి తాకలేదని ఆలోచించకు ప్రతి అక్షరం నిను ముద్దాడడానికే పుట్టిందిగా

ఎందుకు ఏడవాలి ??

అదే మళ్ళీ అడుగుతున్నా ఓ నా దేశపు చెల్లి నువ్వెందుకు ఏడవాలి నీ ఓటమి లెక్క 9 పరుగులే కానీ దానికి ముందు నువ్వు పెరిగెత్తిన అడుగులు ఎవరిక్కావాలి ఇక్కడంతా మగాడి ఆటలే దేశపు జెండాని నువ్వు గగనంలో రెపరేపలాడిస్తే ఎవరిక్కావాలి నువ్వు కత్తిరించుకున్న జుట్టు నువ్వు వేసుకున్న షర్టు నువ్వు పోగొట్టుకున్న సరదాలు నువ్వు చూసిన మగ గేలి ఎవరిక్కావాలి అయినా నువ్వు ఆడావ్ అనుకోకుండా ఓడావ్ కానీ, కసిగా పోరాడావ్ అది చాలదా మేము... Continue Reading →

Powered by WordPress.com.

Up ↑