అర్ధరాత్రి రైల్వే స్టేషన్

అర్ధ రాత్రి రెండు అవుతోంది. తిరుపతి రైల్వే స్టషన్ అప్పుడప్పుడు వచ్చే రైళ్ల అలికిడితో , స్టాటియం అనౌన్స్మెంట్ లతో నిద్రపోతూ లేస్తోంది. జనరల్ భోగి ఎక్కాల్సిన జనాలు స్టేషన్ ప్లేట్ ఫారం పైన పడుకున్నారు. అక్కడక్కడా RPF పోలీసులు, ఇద్దరు ముగ్గురు రైల్వే స్టాఫ్ తప్ప పెద్ద జన సంచారం లేదు. సత్తి బాబు ఇంకా అక్కడే ఉన్నాడు. చుట్టూ 4 తోటి ఉద్యోగులతో. అతను చెప్పింది వింటూ అందరూ నోరెళ్ళబెట్టి వింటున్నారు. విచిత్రం ఏమిటంటే,... Continue Reading →

ప్రేమికుడు – story

తాను నా హృదయం పై జ్ఞాపకాలు రాస్తోంది    ఇది ఒక తింగరోడి కథ. సారి... వాడి మీద కోపం తో అలా అనేసా లే. అసలు వాడి లైఫ్ ఎంతో వాడికే క్లారిటీ లేదు. ప్రేమిస్తున్నా అంటాడు. ఆ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. మరచిపోవాలి అంటాడు. మరుక్షణం తనని దూరం చేసుకోకూడదని అంటాడు. వీడి రోజు వారి , ముచ్చట్లు ఆ అమ్మాయి గురించి చెప్పే భావాలు విని విని చెవులు KFC... Continue Reading →

మహా రాజువయ్యా

ఆయుధం పట్టలేదు  ఒక్క చుక్క రక్తం పారలేదు  అఖండమైన సామ్రాజ్యాన్ని  అలవోకగా గెలిచేసాడు.     ఏ వూరు చూసినా అదే పాట పడుతున్నారు. ఆ దేశంలోనే కాదు. ప్రపంచం మొత్తం అదే పాట , ఆ మహారాజును కీర్తిస్తూ  పాడుతోంది. అఖండమైన 'వర్త' దేశాన్ని పూర్తిగా అహింసతోనే అతను స్వాధీనం చేసుకోవడం , ప్రపంచ యుద్ధ చరిత్రలోనే ఒక మరపు రాని ఘట్టంగా మిగిలిపోతుంది అని అన్ని మీడియా చానళ్ళు , మహారాజుని వేనోళ్ళ కొనియాడుతున్నాయి.... Continue Reading →

మొండి : EP:3 – చర్లపల్లి

వారం ముందు ఫైవ్ స్టార్ హోటల్ గోడలలో తాను వారం తిరిగాక జైలు మధ్యలో తానే అక్కడా ఇక్కడా అదే ఒంటరి తనం ఇంటర్మీడియట్ హాస్టల్ లో ఉన్నవాడికి , ఏ జైలు అయినా బానే ఉంటుంది వీరు ఒంటరిగా తిరుగుతున్నాడు. అతని పై వేసిన నింద - తీవ్రవాదులకు వారి చర్యలకు సహకరిస్తున్నాడని, సైబర్ మార్గాల ద్వారా శత్రు దేశాలకు కీలక సమాచారం అందవేస్తున్నాడని. ఆ అభియోగాలపైనే అతను నిందితుడిగా చర్లపల్లి జైలు గోడల మధ్యన... Continue Reading →

మొండి : 2వ భాగం

ముందు జరిగిన కథ కావాలంటే  హైటెక్ సిటీ ఏరియా లో ఉంటుంది కోండిటెల్ ఆఫీస్. పదకొండు ఇంటి దగ్గర్నుంచి, కొన్ని వేల మంది తో నిండిపోతుంది అక్కడి ఆఫీసు ఉన్న కంప్లెక్స్. వందల కొద్దీ బైకులు, ఆఫీసు క్యాబ్స్ అక్కడికి వచ్చి ఎంటర్ అవుతున్నాయి. ఎవరి కంపెనీ కి వాళ్ళు వెళ్లి, ఐడి కార్డ్ స్వైప్ చేసి లోపలికి వెళ్లిపోతున్నారు. దివ్య ఎప్పటిలాగే ఆఫీసుకి రెడీ అయ్యి వచ్చింది. కానీ, ముఖం లో కళ లేదు. ఎప్పుడు... Continue Reading →

ఒకే ఒక్క ఛాన్స్

  " మాలాంటోడికి ఎవరు ఇస్తారు ఛాన్స్. ఇచ్చినా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడికేగా " తిట్టుకుంటూ పక్కన కూర్చున్నాడు నందు. పక్కనే వచ్చిన కొత్త ఆర్టిస్ట్ లు  ఎదో వింటున్నట్టు  మొకం పెట్టి చూస్తున్నారు అతన్ని. అప్పుడే ఒక షాట్ లో సరిగ్గా చెయ్యకపోతే, డైరక్టర్ దగ్గర బాండ బూతులు తిని frustation లో ఉన్నాడు. యూనిట్ లో అందరూ కాసేపు అతన్ని చూసి, పట్టించుకోవడం మానేశారు. "ఇలాంటివి కొన్ని వందల కేసులు చూసాం" అని ఫీలింగ్ తో.... Continue Reading →

నల్ల పిల్ల

"నీ లైఫ్ నీ ఇష్టం అన్న " ఆ మాటలు లావణ్య నోటి నుండి వినంగానే ఒక్క సారి షాక్ తిన్నాడు శ్రావణ్. ఇంకో రెండు రోజుల్లో పెళ్లి. శ్రవణ్ ని పెళ్లి కొడుకు చెయ్యడానికి ఇంటికి వచ్చేసారు బంధువులు అందరూ. చిన్నప్పటి నుండి తన గురించి తెలిసిన బాబాయ్ కూతురు లావణ్య కూడా అలా అనేటప్పటికి, ఒక క్షణం అలోచించి. " అదేంట్రా అలా అనేసావు " " ఏం  లేదు లే అన్న... నీకు ఇష్టమైన... Continue Reading →

ప్రాణం

ఫ్రెండ్స్ ని డబ్బులు అడిగి అడిగి విసిగిపోయాడు రాహుల్. రెండు రోజుల నుండి ఫోన్ తియ్యడం లేదు అవతల మనిషి .ఇన్ఫోసిస్ లో ఉద్యోగం పోయి నెల రోజులయ్యింది. ట్రంప్ గాడి పుణ్యం. అసలు మే నెల ఎండలు. మాదాపూర్ ఏరియా లో రోడ్డు మీద నడుస్తూ తిరుగుతున్నాడు. అతని గమ్యం ఇప్పుడు ఒక్కటే. మరణం. ఇక చావు ఒక్కటే గతి అనుకుని ఆత్మ హత్య చూసుకోవడానికి వెళ్తున్నాడు. చుట్టూ మనుషులు నవ్వుతో, డ్రెస్సుతో, పనితో  వెలిగిపోతూ తిరుగుతున్నారు. తనలోపల మనసు మొత్తం చీకటిగా... Continue Reading →

మొండి : మొదటి చాప్టర్

ఫయాజ్ మంజిల్  అది నిజాం కాలం నాటి గెస్ట్ హౌస్. CM క్యాంపు ఆఫీస్ పక్కన ప్రాంతం.  ఇప్పుడు అది  పోలీసు interrogations జరిగే ప్రదేశం.బయట జనానికి అది ఒక బూతు బంగాళా లా కనిపిస్తుంది. కానీ , కరుడు కట్టిన క్రిమినల్స్ ని ఇంటరాగేట్ చెయ్యడానికి సి.బి.ఐ. అదే కేంద్రంగా నిర్వహిస్తుంటుంది. హార్డ్ కోర్ క్రిమినల్ ఎవడు దొరికినా . అక్కడే విచారిస్తుంటారు. దేశం మొత్తం షాక్  కి గురి చేసిన ఒక వైట్ కాలర్  క్రిమినల్ ని ఇప్పుడు విచారించడానికి వెళ్తున్నాడు సి.బి.ఐ. డైరెక్టర్ సత్యనారాయణ(సత్యం).... Continue Reading →

Powered by WordPress.com.

Up ↑